By | January 11, 2022

మద్యపానం వల్ల నష్టాలు వ్యాసం. మనిషికి ఉండకూడని వ్యసనంగా పెద్దలు చెబుతారు. కానీ ఈ వ్యసనం నేటి సమాజంలో ఎక్కువమందికి ఉండడం దురదృష్టకరం అంటారు. అందుకు కారణం మద్యపానం వలన మత్తులో ఉంటూ, బాధని మరిచిపోతామనే అపోహలో ఉంటారని, ఇంకా మద్యపానం వలన జరిగే నష్టం గురించి అవగాహన లేకపోవడమే ప్రధాన కారణం అంటారు.

మద్యపానం మూలంగా కలిగే వ్యసనాల వల్ల ఎలాంటి నష్టాలు కలుగుతాయి. తాగుడు వలన అతిగా మాట్లాడుట అలవాటు అవుతుంది. తాగుడు వలన కుటుంబాలు ఎలా నష్టపోతాయి. మద్యపాన నిషేధం అమలు చేయాలి. చెడు అలవాట్లకు లొంగిపోతే ఏం జరుగుతుంది. అలవాట్లు అంటే ఏమిటి ఈ పాయింట్ల వారీ క్లుప్తంగా వివరిద్దాం…

ముందుగా మద్యపానం మూలంగా కలిగే వ్యసనాల వల్ల ఎలాంటి నష్టాలు కలుగుతాయి.

మద్యపానం మూలంగా కలిగే వ్యసనాలలో చెడు స్నేహాలు పెరిగే అవకాశం ఉంటుందని అంటారు.

ఒక వేళ చెడు స్నేహాలు పెరిగితే, చెడ్డపనులకు ప్రేరేపింపబడతారు.

ప్రతిరోజు మద్యపానం చేయడం వలన ప్రతిరోజూ ఎక్కువగా మాట్లాడుతూ ఉండడం అలవాటు అవుతుంది.

అతిగా మాట్లాడుట వలన తగాదాలు పెరిగే అవకాశం ఎక్కువని అంటారు.

ఇంకా రోజూ మద్యపానం చేస్తూ మాట్లాడడానికి అలవాటుపడి ఉండడం చేత, ఒంటరితనంగా ఉండవలసినప్పుడు అది తీవ్రమనస్తాపానికి కారణం కాగలదు.

ఇలా మద్యపానం చేయడమే ఒక వ్యసనం అయితే, దానికితోడు అదనంగా మరి కొన్ని వ్యసనాలతో మానసికంగా మనిషి కృంగిపోయే అవకాశం ఉంటుందని అంటారు.

తాగుడు వలన కుటుంబాలు ఎలా నష్టపోతాయి.

మద్యపానం వలన కుటుంబ కలహాలు పెరుగును. ఎక్కువ తాగుడు వలన కుటుంబాలు ఆర్ధికంగా వెనుకబడతాయి. కారణం పొదుపు చేయవలసిన సొమ్ములు కూడా వ్యసనం ఖర్చు చేయించగలదు. కాబట్టి తాగుడు వలన ఆర్ధికపరమైన ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి… ఇంకా ఆర్ధిక పరపతి కోల్పోవడం జరుగుతుంది.

తాగుడు వలన అధికంగా మాట్లాడడం అలా మాట్లాడడం వలన వారికి మితంగా మాట్లాడేవారు దూరం అవుతారు. అలాంటి సందర్భాలలో కుటుంబ సభ్యులకు కూడా ఉండవచ్చును. అంటే తాగుడు వలన బంధువులలో కూడా చులకన భావం ఏర్పడడమే కాకుండా బంధుత్వాలు దూరం అయ్యే అవకాశం కూడా ఉండవచ్చని ఉంటారు.

ఇంకా ఒక కుటుంబంలో పిల్లలు పెద్దలను అనుసరించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక కుటుంబంలోని పెద్ద తాగుడుకు అలవాటు పడి ఉంటే, ఆకుటుంబంలోని పిల్లలు కూడా మద్యపానం వైపు ఆసక్తిని పెంచుకునే అవకాశం ఉండవచ్చని అంటారు.

తాగుడు మనిషిని ఆర్ధికపరమైన విషయాలలోనూ, పరపతి విషయంలోనూ, గౌరవం విషయంలోనూ… ఇంకా మానసికంగానూ తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుంది…. కావునా మద్యపానం ఆరోగ్యానికి హానికరం.

ఒక అలవాటు మరొక అలవాటుకు నాంది అయితే

మద్యపానం వలన మరిన్ని అలవాట్లు అయ్యే అవకాశం ఉంటుంది… దూమపానం కూడా కావచ్చును…

ఏదైనా చెడు అలవాట్లు అలవాటుగా మారడం చాలా సులభం… అవి వ్యసనాలుగా మారితే మాత్రం వాటిని వదించుకోవడం అంత సులభం కాదు…

వ్యసనం వ్యక్తి పతనానికి దారి తీయగలదు. కావునా వ్యసనాలకు మనిషి లొంగరాదు… వ్యసనాలకు బాట వేసే మద్యపానమునకు మనిషి దూరంగా ఉండాలి..

మద్యపాన నిషేదం వలన సమాజానికి మేలు కలగుతుందని చాలామంది అభిప్రాయపడుతూ ఉంటారు. కావునా మద్యపాన నిషేదం అమలు చేయలి… అంటారు.

మరి కొన్ని తెలుగు వ్యాసాలు – తెలుగురీడ్స్

కర్ణుడు జీవితం నుండి ఏం గ్రహించాలి?

పెద్దలు నీతి కథలు పిల్లలకు చెప్పడం

నేరస్థులు పాలకులైతే పాలనా స్థితి ఎలా ఉంటుంది?

దీర్ఘకాలిక ప్రణాళికలు అనేది భవిష్యత్ లక్ష్యాలు

రాజకీయాల్లో విద్యార్థుల పాత్ర వ్యాసం

రాజకీయాలలో ఎటువంటి మార్పు కావాలి?

ఆసక్తిని బట్టి వార్తలు వస్తున్నాయా?

నేటి నీ కృషి రేపటికి నీకు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఎవరు?

అబద్దం చెప్పిన వారి విలువను తగ్గిస్తుంది?

అభివృద్దికి ఆటంకాలు అంటే ఏవి?

అసత్య ప్రచారాలు వాస్తవాలు గురించి

మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం

తెలుగు వ్యాసం పండుగలు ప్రాముఖ్యత అవి ఎలాంటి ప్రభావం చూపుతాయి

ధన్యవాదాలు – తెలుగురీడ్స్