By | December 5, 2021

మన జీవితంలో గురువు యొక్క ప్రాముఖ్యత చాలా ఉంటుంది. ఏ వ్యక్తి పుడుతూనే నిష్ణాతుడు కాదు. ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరి వద్ద విద్యాభ్యాసం చేసిన పిమ్మటనే అతను తనకు నచ్చిన అంశములో నైపుణ్యతను పెంపొందించుకోగలడు. ఒకవ్యక్తి పరిఫూర్ణమైన జ్ఙానం సంపాదించుకోవడంలో గురువు యొక్క ప్రభావం చాలా ఉంటుంది.

చూసి నేర్చుకునే విద్యైనా, చదివి తెలుసుకునే విద్య అయినా సరే గురువు ద్వారా నేర్చుకునే విద్యకు రాణింపు ఉంటుంది. మంచి గుర్తింపుతో బాటు మనోవిద్య కూడా అలవరుతుంది. ప్రధానంగా గురువు వలననే వ్యక్తి మనసు సంస్కరింపబడుతుందని అంటారు.

ఇంకా చెప్పాలంటే, గురువులేని విద్య గుడ్డి విద్య అని కూడా అంటారు. అంటే జీవితంలో ఏదైనా విద్య నేర్చుకోవడానికి గురువు యొక్క ప్రాముఖ్యత ఎంత ఉందో తెలియబడుతుంది.

ప్రకృతిలో సాధన చేస్తూ ప్రకృతి శక్తులను వినియోగించుకోవచ్చును… కానీ గురువు లేకుండా చేసే సాధన వలన వ్యక్తి స్వీయనియంత్రణ తక్కువగా ఉంటుంది… స్వేచ్చ ఎక్కువై అది వ్యక్తి పతనానికి నాంది కాగలదు. అదే గురువు ద్వారా విద్యను అభ్యసిస్తే, ప్రకృతి శక్తిని ఎంతమేరకు ఏవిధంగా వినియోగించుకోవాలో ఒక అవగాహన కలిగి ఉండే అవకాశాలు ఎక్కువ.

వ్యక్తి పట్టుదలకు, సాధించాలనే తపనకు గురువు మార్గదర్శకం తోడైతే, ఆ వ్యక్తి ఉత్తమ స్థాయికి చేరగలడని అంటారు. గురువు విషయంలో పరమాత్ముడైన భగవానుడు కూడా ఒక విద్యార్ధిగానే ఉన్నాడు… కానీ స్వీయ శక్తి ప్రదర్శనకు పూనుకోలేదు.

శ్రీమహావిష్ణువు శ్రీరాముడుగా అవతరించాకా, కుల గురువు దగ్గర శాస్త్రపరమైన విషయాలు, గురువు విశ్వామిత్రుని దగ్గర ధనుర్విద్యా రహస్యాలు గ్రహించాడు. అంతేకాదు కేవలం తండ్రి లేక గురువు ఆదేశాల ప్రకారమే శక్తిని ప్రయోగించాడు కానీ తన ప్రతాపాన్ని చూపించడానికి, ప్రగల్భాల కోసం విద్యను ప్రదర్శించలేదు. గురువులు వశిష్ఠుడు, విశ్వామిత్రుల ప్రభావం శ్రీరామచంద్రుని జీవితంలో ఎంతగానో ఉందని పండితులు చెబుతారు.

బాల్యంలోనే ఆశ్చర్యకరమైన లీలలను ప్రదర్శించిన జగద్గురు శ్రీకృష్ణపరమాత్మ సైతం గురువు సాందీపుని వద్ద విద్యను అభ్యసించాడు. కాలాన్ని బట్టి శక్తిని ప్రయోగించాడు. ఇంకా కురుక్షేత్ర సమయంలో యుద్ధం చేయించాడు కానీ చేయలేదు….

ఎంతటివారైనా కాలంలో మనసును నియంత్రించడానికి స్వశక్తి చాలనప్పుడు గురువుగారి మాటలే వేదవాక్కులుగా ఉంటాయని అంటారు. గురువుగారి మాటలు తలచుకోవడంతోనే తనను నియంత్రించుకునే తత్వం మనసులో పుడుతుందని పెద్దల అభిప్రాయం.

వ్యక్తి జీవితంలో గురువు యొక్క ప్రాముఖ్యత ఎంతగానో ఉంటుంది.

కుటుంబపెద్ద తండ్రి గురువుగా ఉండడం చేతనే, కుటుంబంలో పిల్లలు క్రమశిక్షణకు అలవాటు పడతారు. అక్కడి నుండి విద్యాలయం చేరిన విద్యార్ధులు సహవాసులతో కూడా క్రమశిక్షణతో మెసులుతున్నారంటే, అందుకు కారణం విద్యాలయంలో గురువుల శిక్షణే కారణమంటారు.

ఇంకా కార్యలయములో కూడా ఒక ఉద్యోగికి అతనికంటే సీనియరు ఒక గురువుగా ఉంటే, ఆ ఉద్యోగి సీనియర్ మార్గదర్శకాలను అనసరిస్తూ, కార్యలయములో కూడా తన ఉత్తమ పనితీరు ప్రదర్శించగలడు. ఇలా ఎక్కడ చూసిన వ్యక్తి జీవితంలో గురువు ప్రాముఖ్యత చాలా ఉంటుందని చెప్పవచ్చును.

ఒకవ్యక్తికి బాల్యంలో తల్లిదండ్రులు, విద్యాలయంలో ఉపాధ్యాయులు, సమాజంలో తనకంటే వయస్సులో పెద్దవారు, ఆఫీసులో అనుభవంగలవారు ఎందరో గురుత్వ స్వభావంతో వ్యవహరిస్తూ ఉండడం వలననే వ్యక్తి తన జీవన గమ్యం చేరడంలో కృతకృత్యుడు అవుతాడు అని అంటారు.

అందుకే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షత్తు పరబ్రహ్మ అంటూ మనకు శ్లోకము కూడా ప్రసిద్ది.

గురువు మనసులో విజ్ఙాన మార్గమును సృష్టించగలడు కాబట్టి బ్రహ్మ… గురువు మనసును నియంత్రించే విధంగా మాట్లాడగలడు కాబట్టి విష్ణువు… గురువు సంపూర్ణ జ్ఙానము ఇవ్వగలడు కాబట్టి శివుడు…. గురువు మూడు గుణాలకు అతీతమైన శక్తిని దర్శింపజేయగలడు కాబట్టి పరబ్రహ్మ… అంటారు.

గురువు కారణంగా జీవనమార్గం గాడిలో పడగలదు.

సద్గురు కారణంగా త్రిగుణాతీతమైన ఆత్మస్థితిని పొందవచ్చును. గురువు కారణంగా ఏదైనా సాధించవచ్చునని పురాణాలు ఘోషిస్తున్నాయి… కాబట్టి గురువులేని జీవితం ఊహాతీతం…. గురువు గల జీవితం క్రమశిక్షణతో కూడిన జీవితమై మరొక జీవితానికి మార్గదర్శకం కాగలదు. వ్యక్తి జీవితంలో గురువు యొక్క ప్రాముఖ్యత చాలానే ఉంటుంది.

ఆసక్తిని బట్టి వార్తలు వస్తున్నాయా?

నేటి నీ కృషి రేపటికి నీకు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఎవరు?

అబద్దం చెప్పిన వారి విలువను తగ్గిస్తుంది?

అభివృద్దికి ఆటంకాలు అంటే ఏవి?

అసత్య ప్రచారాలు వాస్తవాలు గురించి

మరిన్ని తెలుగురీడ్స్ పోస్టులు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు