By | October 17, 2021

మానవ వనరులు నిర్వచనం ఏమిటి? తెలుగు వ్యాసం. మానవ వనరులు అంటే ఏమిటి? మానవ వనరుల గురించి వ్యాసం. మానవ వనరులు అనగానేమి? ఇలా ప్రశ్న పలు రకాలుగా ఉండ వచ్చును. మానవ వనరుల గురించి చూద్దాం. వనరు అంటే ఆస్తి వంటిది అంటారు.

మనిషి ఒక వనరుగా ఉంటే, మానవ వనరు అంటే, ఒక సంస్థకు పనిచేసే మనుషులను మానవ వనరులు అంటే, ఒక సంస్థలో నియమితులైన సిబ్బందినే హ్యుమన్ రిసోర్సెస్ అంటారు.

సంస్థకు ఉండే సిబ్బంది ఆ సంస్థకు పనిచేస్తూ వారు సంస్థకు వనరులుగా ఉంటారు. మానవ రూపంలో వనరుగా ఉంటారు. మనిషి రూపంలో ఆస్థివలె సంస్థకు ఉపయోగపడుతూ పనిచేసే సిబ్బందిని మానవ వనరులు అంటే, ఆ సిబ్బందిని నియమించుకోవడం లేదా తొలగించడం మానవ వనరుల నిర్వహణ అంటారు.

ఒక మనిషి చేయగల పనిని బట్టి, ఆ మనిషికి సంస్థ ద్వారా జీతభత్యాలు నిర్ణయించడం. ఇంకా నియమిస్తున్న మనిషి యొక్క పద్దతిని అంత:కోణాన్ని మాటల ద్వారా గ్రహించడం. మనిషి యొక్క మాటతీరు ఏవిధంగా ఇతర సిబ్బందిని ప్రభావితం చేయగలుగుతుంది? అంచనా వేయడం. నియమంచబడుతున్న వ్యక్తి స్వభావం పూర్తిగా అంచనా వేస్తూ, అతను సంస్థకు వనరుగా ఉండగలడు అనుకుంటేనే అతనిని సంస్థలోకి తీసుకునే నిర్వహణను మానవ వనరుల నిర్వహణలో భాగంగా చెబుతారు.

సంస్థకోసం పాటుపడే మానవ వనరులు

సంస్థలోని నియమించబడిన సిబ్బందికి సంస్థకోసం పనిచేసేవిధంగా తర్ఫీదు ఇవ్వడం. ఇంకా సిబ్బందిలో ఒకరంటే ఒకరికి సదభిప్రాయం కలిగేలాగా సంస్థ వాతావరణంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం. సంస్థకోసం నిజాయితీగా పాటుపడేవారి కృషిని గుర్తించడం.

కొందరు వ్యక్తులు వ్యవస్థకోసం పాటు పడుతూ ఉంటారు. తమకు నియమించబడిని పనిని సక్రమంగా నిర్వహిస్తూ ఉంటారు. తమ కర్తవ్య నిర్వహణలో సమయం కూడా గమనించకుండా పనిమీదే దృష్టి పెట్టే వ్యక్తులు ఉద్యోగులుగా ఉన్నప్పుడు వారు సదరు సంస్థకు ఒక మానవ వనరుగా ఉంటారు. అంటే వారు సంస్థకు ఆస్తివంటివారు. అలాంటి ఉద్యోగుల పరిరక్షణ మానవ వనరుల నిర్వహణ సిబ్బందిదే బాధ్యత అంటారు.

పుచ్చుకుంటున్న జీతానికి, తాము చేస్తున్న పనికి పొంతను చూడకుండా… సంస్థ బాగుంటే మనమంతా బాగుంటాము కాబట్టి సంస్థ వృద్దికోసం మన కర్తవ్యం మనం నిర్వహిద్దామని భావించే ఉద్యోగులను మానవ నవరుల నిర్వహణ సిబ్బంది గుర్తించాలి.

ఇతరుల పనికి అడ్డంకిగా మారుతు మానవ వనరులను బలహీన పరిచేవారు

కేవలం జీతంకోసం మొక్కుబడిగా పనిచేసేవారి ప్రవర్తను గమనించడం. ఇతర సిబ్బందితో ఉద్యోగి ప్రవర్తనను గమనించడం వలన అటువంటి ఉద్యోగుల గురించి తెలుస్తుంది.

ఇతరుల పనికి అడ్డంకిగా మారే స్వభావం కొందరిలో ఉంటుందని అంటారు. తమపనితనం ఎదుటివారి పనితనం ముందు చిన్నబోతుందేమో అనుకుంటే, అటువంటివారు మరొకరిపనిని అడ్డుకునే విధంగా ప్రవర్తించవచ్చును. లేదా తమ పనిచేయడం ఇష్టంలేక పనిచేస్తున్నట్టు ఉంటూ, తమకు తోడుగా మరొకరిని ఎంచుకునే ప్రక్రియలో బాగంగా మరొకరి పనిని పాడుచేసే స్వభావం ఉన్నవారు ఉండవచ్చును. ఇలాంటి ఉద్యోగులను త్వరగా గుర్తించకపోతే సంస్థలో మానవ వనరులు బలహీనపడవచ్చును.

ఇలా సంస్థకు సిబ్బంది నియామకం, సిబ్బంది ప్రవర్తన, సిబ్బంది పనితీరు, సిబ్బంది పరివర్తన, సిబ్బంది తొలగింపు, సిబ్బంది శిక్షణ తదితర అంశాలు మానవ వనరుల నిర్వహణలోకి వస్తాయని అంటారు.


మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు