By | May 18, 2021

మాట తీరు ప్రాముఖ్యత గురించి తెలుగులో వ్యాసం. మాటతీరు వలన మన్ననలు పొందవచ్చు. మాట తీరుతో బాగుంటే, స్నేహపూర్వక సమాజం మనిషి చుట్టూ ఏర్పడుతుంది. సంఘంలో గుర్తింపు మాట తీరును బట్టి ప్రభావితం అవుతుంది.

మనిషి మాట తీరు అతని చుట్టూ ఉండే మనుషులపై ప్రభావం చూపుతుంది. మాట వలన మనిషికి మనిషికి సంబంధాలు ఏర్పడుతూ ఉంటాయి.

మాటే మంత్రం అవుతుంది. మాటే కష్టం పోగొడుతుంది. మాటే మనిషికి కష్టాన్ని తీసుకురావచ్చు. మాట శక్తివంతమైనది… అది ఒక మంత్రంగా పనిచేయగలదు. ఎందుకంటే మాట మనసుని తాకుతుంది.

వ్యక్తి మాట తీరు బాగుంటే, ఆ వ్యక్తి చుట్టూ స్నేహితులే ఎక్కువగా ఉంటారు. ఎవరైనా సరే స్నేహపూర్వక ఆదరణ మాట తీరు బాగుండే వ్యక్తిపై చూపుతారు.

అలా కాకుండా ఒక వ్యక్తి మాట తీరు కటువుగా ఉంటే మాత్రం, ఆ వ్యక్తికి ఎక్కువమంది మిత్రుల కంటే శత్రువులు పెరుగుతారు. మాట తీరు వలననే మిత్రత్వం లేదా శతృత్వ భావనలు వ్యక్తి చుట్టూ ఏర్పడుతూ ఉంటాయి.

సమాజంలో వ్యక్తిపై అతని మాట తీరు ప్రభావం చాల ప్రముఖమైంది. అతని మాటే అతనికి పరిచయాలు తీసుకువస్తుంది,. మాట తీరును బట్టి స్నేహితులు గాని శత్రువులు గాని ఉండవచ్చు.

మాట తీరు మనిషికి ధైర్యాన్ని ఇవ్వగలదు, మాట తీరు వలన విషయాలను చక్కగా వివరించవచ్చును. మాట తీరు మంచిదైతే లోకం అంతా ప్రశాంతంగా కనబడుతుంది. లేకపోతె లోకం అశాంతిగా అనిపిస్తుంది.

కొందరి మాట తీరు ఎదుటివారిలో శాంతిని రేకెత్తిస్తే, కొందరి మాట తీరు ఎదుటివారిలో అశాంతికి కారణం కాగలదు. కొందరు నొప్పించే మాట తీరు కలిగి ఉండి, తమ చుట్టూ ఉండేవారిని కూడా బాధపెడుతూ ఉంటారు.

మాట సాయం వలన మనిషికి మనో బలం ఏర్పడుతుంది. అటువంటి మాట సాయం మంచి మాట తీరు కలిగిన వ్యక్తులకే సాద్యమంటారు.

మాట తీరు ప్రాముఖ్యత గురించి పురాణాలలో కూడా కనబడుతుంది.

మనకు మాట తీరు ప్రాముఖ్యత పురాణాలలోను కనబడుతుంది. రామాయణంలో హనుమంతుడు మాట్లాడితే ప్రాణాలు నిలబడతాయి. హనుమంతుడు చాల చక్కగా ఓర్పుగా మాట్లాడగలడు, విషయం సూటిగా సున్నితంగా హృదయానికి తాకేలాగా మాట్లాడగలడు. అందుకే శ్రీరాముడు సీతాన్వేషణలో హనుమపైన నమ్మకం ఉంచాడు. శ్రీరాముని నమ్మకాన్ని హనుమ నిలబెట్టాడు,

చక్కని మాట తీరు ఉంటే, రోజుల తరబడి మాట్లాడినా ఆ మాటలు వినేవారు ఉంటారు. మహా భారతంలో శుకుని మాటలను వారం రోజులపాటు వింటూ కూర్చున్నాడు. మాట తీరు బాగుంటే చెప్పే విషయం ఎదుటివారి మనసులో మంచి భావనలు పెంచుతుంది.

ఏడు రోజులలలో మరణం సంభవిస్తుంది అని తెలుసుకున్న పరిక్షత్తు మహారాజు… శుక మహర్షి మాటలకు మరణ భయం పోగొట్టుకున్నాడు. జీవిత పరమార్ధం ఏమిటో తెలుసుకోగలిగాడు… కారణం మంచి మాటలు చెప్పగల వారిని మాట్లాడించేలాగా మాట తీరు కలిగి ఉండడమే

మంచి మనిషికో మాట, మంచి గొడ్డుకో దెబ్బ అనే నానుడి ఒకటి కలదు. మంచి భావనలు కలిగి ఉండే వ్యక్తికి మాటపై మంచి అభిప్రాయం కలిగి ఉంటారు. మాట యొక్క అంతరార్ధం గ్రహించి మెసులుకుంటారు… కాబట్టి మంచి మనిషికో మాట చాలు అంటారు.

ఏదైనా మాట తీరు బాగుంటే లోకమంతా మిత్రులే…. లేకపోతె లోకంలో ఇబ్బందులు ఎక్కువ ఎదురవుతాయి. మాట తీరు ప్రభావం మనిషి జీవితంపై పడుతుంది.

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు