By | February 1, 2022

మనిషికి మాత్రమే మాట్లాడే శక్తి ఉంటే, పనులపై నిర్ణయాధికారం ఉంది. మంచి చెడులు ఆలోచించి పనులు చేయవచ్చును లేక చేయకపోవచ్చును కానీ సృష్టిలో ఇతర ప్రాణులకు తమ భావనను మాటలలో బహిర్గతం చేయలేవు. వాటికి తెలిసింది కేవలం తమ ఆకలి తీర్చుకోవడం వరకే… అయితే మూగ జీవులను ఎందుకు ప్రేమించాలి? మూగ జీవుల గురించి మనకున్న శ్రద్ధ ఎలా ఉండాలి?

పైన చెప్పినట్టుగా మూగ జీవులు అంటేనే మాట్లాడలేవు. వాటికి బాధ కలిగితే, మూలుగుతూ బాధపడతాయి. సంతోషం అనేది తెలియకపోవచ్చును… కానీ ఆసంతోషం అవి వాటి అమ్మ దగ్గర పొందుతాయి… ఆతర్వాత వాటిని ప్రేమించే మనిషి ఉంటే, ఆ మనిషి దగ్గర పొందుతాయి. అంటే మూగ జీవులకు అమ్మ తర్వాత అమ్మగా మనిషి కనిపిస్తాడు.

మనిషి యొక్క ఉత్తమ లక్షణాలలో మనిషికి దయ కలిగి ఉండాలని చెబుతారు. పశువులందు దయతో ఉండడం వలన, వాటికి భయం తొలగుతుంది. మనిషికి భయం ఉన్నట్టే మూగ జీవులకు భయముంటుంది. కొన్ని మూగ జీవులకు మనిషి వలన కూడా భయం కలగవచ్చును. తన చుట్టూ ఉండే మూగ జీవులయందు ప్రేమతో వ్యవహరించడం వలన వాటిలో భయం తగ్గుతుంది. ఇంకా అవి సంతోషంగా ఉంటాయి.

కుక్క, గుర్రం, ఆవు, గేదే, ఎద్దు వంటి మూగ జీవులు మనిషికి ఉపయోగపడుతూ, మానవ సమాజంలో భాగంగా ఉంటాయి. అవి కేవలం ఆకలి అనిపించినప్పుడు ఆహారం తీసుకోవడం వరకే పరిమితం అవుతాయి. వాటిని ఉపయోగించుకుంటున్న మనిషి, వాటియందు దయతో లేకపోవడం కఠిన స్వభావంగా చెబుతారు. ‘మూగ జీవులను ఎందుకు ప్రేమించాలి‘ వాటిని ఉపయోగించుకుంటున్న మనిషి కృతజ్ఙతగా వాటిని ప్రేమతో చూడడమేనని అంటారు.

మరిన్ని తెలుగురీడ్స్ పోస్టులు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు