By | June 21, 2022
నాటి కాలంలో వివాహాలు ఎలా జరిగేవి? నాటి కాలమంటే పురాణ కాలం గురించే చెబుతూ ఉంటారు. పురాణాల ప్రకారం వివాహాలు జరిగే తీరును చక్కగా వివరిస్తారు. అక్కడ నుండి ప్రారంభం అయిన వివాహ వ్యవస్థ మార్పులు చెందుతూ నేటికి ఇద్దరు స్త్రీపురుషుల స్వీయ నిర్ణయం మేరకు వారికి వారే మిత్రుల మద్య వివాహం చేసుకునే స్థితికి పరిస్థితలు మారాయి అంటారు.

సమాజంలో నాటి కాలంలో వివాహాలు ఎలా జరిగేవి?

స్త్రీ పురుషులు వివాహం విషయంలో ప్రవర్తించే తీరును బట్టి నాటి వివాహాలకు వివిధ పేర్లు ఉండేవని చెబుతారు. ఆయా పేర్లు ఎలా ఉన్నా… వధూవరుల తల్లిదండ్రులు పెద్దల సమక్షంలో అంగీకారం చేసుకుని, వేద మంత్రాల మద్య అగ్నిసాక్షిగా వివాహ తంతుని చేయడానికి అందరూ మొగ్గు చూపుతారు. ఈ వివాహానికి అందరి ఆశిస్సులు అందుతాయని అంటారు. ఇంకా సంప్రదాయంపై నమ్మకం బలంగా ఉన్నవారు ఇలాంటి వివాహాలు వలన పితృదేవతలు కూడా సంతోషిస్తారని అంటారు. శ్రీరామాయణంలో రాముడు సీతా స్వయంవరంలో పొల్గొన్నాడు కానీ వివాహం తన తండ్రి సమక్షంలోనే, తండ్రి ఇష్టానుసారమే చేసుకున్నాడు. తండ్రి ఆజ్ఙ మేరకు నడుచుకునే అలవాటు గల శ్రీరాముడు, తన జీవిత భాగస్వామి విషయంలోనూ తండ్రిగారి సమక్షంలో వివాహం జరిగింది. ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో వధూవరుల ఇష్టప్రకారం వధూవరుల అంగీకరించిన పిమ్మట వివాహ తంతు మొదలయ్యేదని చెబుతారు. అక్కడక్కడా ప్రచారంలో ఉండే విషయం ఉంటే, అది సమాజమంతా జరుగుతున్నట్టుగా కాదు కదా? అలాగే బలవంతపు వివాహాలు జరిగినా అది అక్కడక్కడా మాత్రమేనని ఎక్కువ పెద్దలు కుదిర్చిన వివాహాలు వధూవరులు అంగీకరించిన పిదప జరగడం విశేషం.

అరుదైన నాటి కాలంలో వివాహాలు ఎలా ఉండేవి?

రుక్మీణి కళ్యాణం గాందర్వ వివాహమేనని అంటారు. ఇది అప్పటి కాలంలో అయినా సమాజమంతటా జరగలేదు కదా… ఆనాడు శ్రీకృష్ణుడు రుక్మీణీ దేవి ప్రార్ధన మేరకు, ఆమెను చేపట్టడానికి పూనుకున్నాడు. అరుదుగా జరిగేవి… అయినా అవి కాలం శాషించేవిగా పెద్దలు చెబుతారు. కాలక్రమంలో జరిగే కొన్ని విడ్డూర వివాహాలు, ఎప్పుడూ ఆదర్శం కాదు కాబట్టి పెద్దల సమక్షంలో పిల్లల ప్రీతి ప్రకారం వివాహాలు జరగడం వలన వారి కాపురంపై వారికి ఒక గౌరవం ఏర్పడుతుంది. కేవలం ఇద్దరి అంగీకారంతో జరిగే వివాహాలు, మారే మనసుతో యుద్దం చేయడం వంటిదే…. నాటి కాలంలో వివాహాలు ప్రకారం కాపురాలు జీవిత పరమార్ధం ప్రధానంగా సాగాలనే ఉద్దేశ్యం కారణంగా కలతలు కలిగిన కాపురం అయినా కలిసి ఉండేవారని అంటారు.

మరిన్ని తెలుగురీడ్స్ పోస్టులు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు