నదులు నదులలో నీటి ప్రవాహం ప్రయోజనాలు తెలుపుతూ తెలుగులో వ్యాసం.
నదులు నీటి ప్రవాహంతో ఉంటాయి. కొన్ని నదులు కాలంలో కురిసే వర్షముల ఆధారంగా నీటిని కలిగి ఉంటాయి. కొన్ని నదులు ఎప్పుడూ నీటిని కలిగి ఉంటాయి. ఎక్కువగా నదులు పర్వతాలలో పుడతాయి. ఎందుకంటే పర్వత ప్రాంతాలలో వర్షాలు ఎక్కువగా పడతాయి. శిఖరముల నుండి క్రిందికి జారే నీరు అంతా నేలపై ప్రవహించడానికి తగినంత ప్రవాహం పర్వత ప్రాంతాల నుండి ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడూ ప్రవాహంతో ఉండే కొన్ని జీవనదులు మరికొన్ని వర్షాధార నదులుగా చెప్పబడతాయి.
మన దేశంలోని నదులను రెండు విధాలుగా విభజించవచ్చు. 1) హిమాలయ పర్వతాల నుండి ప్రవహించే నదులు 2) దక్కను పర్వతాల నుండి ప్రవహించే నదులు. హిమాలయాలలో పుట్టి ప్రవహిస్తున్న నదులలో ఎప్పుడూ నీటి ప్రవాహం ఉంటుంది. ఇతర నదులు కురిసే వర్షాల ఆధారంగా నీటి ప్రవాహం ఉంటుంది.
నదులు రెండు రకాలు – జీవనదులు, వర్షాధార నదులు
జీవ నదులు ఎప్పుడూ నీటిని కలిగి ఉండడానికి కారణం హిమాలయపు
నదులు మంచు కరగడం వల్ల, మరియు వర్షాల వల్ల సంవత్సరం పొడవునా ప్రవహిస్తూనే ఉంటాయి. అందుచేత గంగ, బ్రహ్మపుత్ర, సింధు తదితర నదులను జీవనదులుగా పేర్కొంటారు.
గోదావరి, కృష్ణ కావేరి, పెన్న, మహానది, నర్మద, తపతి మొదలైన
నదులను వర్షాలు ఆధారంగా ప్రవాహం కలిగి ఉంటాయి. ఈ నదులు వర్షంపై ఆధారపడి ఉండడం చేత, వేసవికాలం నది ప్రవాహాలు తగ్గుముఖం పడతాయి.
కానీ గోదావరి, కష్ణా నదులలో దక్షిణ భారతంలోనే ప్రవహిస్తున్నా, వాటిలోనూ ఎప్పుడూ నీటి ప్రవాహం ఉంటుంది. వేసవిలో ప్రవాహం తక్కువగా ఉంటుంది. ఎప్పుడూ
నీటి ప్రవాహం ఉండడం చేత గోదావరి, కృష్ణా నదులు జీవనదులుగా పరిగణించేవారట.
నదులు ఉపయోగాలు
ఏవిధమైన నది అయినా నదులలో నీటి వలన వ్యవసాయం చేసుకోవచ్చును. త్రాగునీటిగా మార్చుకోవచ్చును. నదీ ప్రవాహాలలో ఇసుక లభిస్తుంది. మనదేశం నదీస్నానం పవిత్రమైనదిగా నమ్ముతారు. ఇప్పటికే నదులపై ఉన్న ఆనకట్టల వలన విద్యుత్ తయారు కాబడుతుంది. ఇంకా ఆ నదీ జలాలను కాలువలుగా వివిధ ప్రాంతాలకు తరలించడంలో వ్యవసాయానికి నీటిసాయం అందుతుంది. ఇతర ప్రాంతాలకు తాగునీటిని సరఫరా చేయగలుగుతున్నారు.
నదులలో నీటి ప్రవాహం బాగున్నప్పుడు, విద్యుత్ ఉత్పత్తి బాగుంటుంది. సరైన రీతిలో నదీజలాలను ఉపయోగించుకుంటే, రైతుల వ్యవసాయానికి నీరు అందుతుంది. వ్యవసాయ ఉత్పత్తులు పెరగడానికి అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలవరం ప్రొజెక్టు పూర్తయితే, మరింతగా వ్యవసాయం వృద్ది చెందుతుందని అంటారు.
మరిన్ని తెలుగురీడ్స్ పోస్టులు
విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?
జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?
దానం గురించి దానం గొప్పతనం
సన్మాన పత్రం ఇన్ తెలుగు
వేచి ఉండడాన్ని నిర్వచించండి
పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?
పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?
అవతారం అర్థం ఏమిటి తెలుగులో
తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు
లీడర్ అంటే ఎలా ఉండాలి
ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?
ప్రేరణ తెలుగు పదము అర్ధము
గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?
నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం
కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు
0 responses to “నదులు నదులలో నీటి ప్రవాహం ప్రయోజనాలు”