Telugu Bhāṣā Saurabhālu

నాన్న ఆదర్శం నాన్న మార్గదర్శకం అన్నింటిలో నాన్న

నాన్న ఆదర్శం నాన్న మార్గదర్శకం అన్నింటిలో నాన్న ముందుంటాడు. నాన్న వలన నలుగురిలో గౌరవం దక్కుతుంది. నాన్న వలన నలుగురు పరిచయం అవుతారు. నాన్నతోనే సామాజిక ప్రభావం ప్రారంభం.

అమ్మ గురించి చెప్పడంలో పడి నాన్నను మరిచిపోయిన రచనలు అన్నట్టుగా నాన్న కన్నా అమ్మనే రచనలు కీర్తిస్తాయి. కానీ అవిరామ శ్రమ నాన్నలో ఉంటుంది.

పిల్లలకు నాన్న ఆదర్శం నాన్న మార్గదర్శకం అవుతాడు. అలాంటి ఆలోచనకు పునాది నాన్న వలననే కలుగుతుందని అంటారు.

కేవలం చదువుకునే వయసులోనే నలుగురిలో గౌరవం లభిస్తుందంటే, అది నాన్నపై సమాజంలో నిలిచిన మర్యాదే. ఎదుగుతున్న బాలబాలికలకు సమాజంలో ఏర్పడే స్థితి నాన్నతో ముడిపడి ఉంటుంది.

కన్నబిడ్డల కోసం కన్నతల్లి అమృతమైన ప్రేమను అందిస్తే, వారి పోషణకు నాన్న తన రక్తాన్నిధారపోస్తాడు. కష్టపడి ఇష్టంతో కాలంలో కలిగే కష్టాలను ఎదుర్కుంటాడు.

తనను నమ్ముకుని ఎదుగుతున్నవారి ఆశలకు నాన్న జీవం పోస్తాడు. నాన్న ఉన్నాడనే ధైర్యంతో పిల్లలు సమాజంలో స్వేచ్ఛగా తిరగగలరు.

సమాజంలో నాన్న ఇచ్చే రక్షణ మరే ఇతరులు ఇవ్వలేరని అంటారు. నాన్న అంటేనే భరోస… నాన్న బ్రతుకుకి భరోస కల్పించగలడు.

అమ్మాయి అల్లరిని ఆధారిస్తాడు. అబ్బాయి బరువును మోస్తాడు. అమ్మాయి ఆలోచనకు విలువనిస్తాడు. పిల్లల మనోభావాలను ఎరిగి, వారి వారి ఆశయాలకు అనుగుణంగా నాన్న చేసే కృషి అద్బుతమే అవుతుంది.

ఎదిగే పిల్లలకు ఆదర్శంగా కనిపించేవారిలో, నాన్నే మొదట నిలుస్తాడు. నాన్న ఆదర్శంలో మార్గదర్శకంగా మారతాడు. నాన్నను అనుసరించాలనే ఆలోచన పిల్లలకు కలగకమానదు.

ఎదిగే వయస్సు చేసే అల్లరికి నాన్న ఒక అడ్డుగోడ. నాన్నను దాటి అల్లరి అల్లరి చేయలేదు.

జీవనగమ్యం చేరడంలో నాన్న ఆచరించిన కుటుంబ పద్దతి, తర్వాతి తరానికి కూడా విధానం అయి కూర్చుంటుంది.

నాన్న లేని సమాజంలో బిడ్డడి, భవిష్యత్తు ఆగమ్యగోచరం. నాన్న వలననే మర్యాద, మన్నన మొదటగా సమాజం నుండి లభిస్తాయి. నాన్నను అనుసరించే అమ్మకు, నాన్నే మార్గదర్శకం. బిడ్డలకు నాన్నే మార్గదర్శకం.

సమాజంలో ఒక కుటుంబానికి ఏర్పడిన గుర్తింపు నాన్న సంపాదించిన విలువైన ఆస్తి వంటిది. ఆ ఆస్తిని ఎవరు దొంగిలించలేరు. పోగొట్టుకుంటేనే పోతుంది తప్ప, విలువైన ఆస్తి నాన్న సంపాదించిన గౌరవ, మర్యాదలు మనిషికి వెన్నంటి జీవితాంతం ఉంటాయి.

ఎప్పుడూ నాన్న ఆదర్శం నాన్న మార్గదర్శకం అయితే

నాన్న తనకోసం తను కష్టపడింది… తక్కువగానే ఉండవచ్చు. కానీ బిడ్డల కోసం పడే కష్టం, తపన ఎక్కువగానే ఉంటుంది. అదే నాన్న తత్వం.

కష్టాన్ని ఇష్టంగా ధారపోసే నన్నతత్వం పెద్దగా గుర్తింపు పొందకపోయినా…. నాన్న మాత్రం తనవారి కోసం తాను శ్రామిస్తూనే ఉంటాడు.

అన్నీ తెలిసినా ఏమి తెలియనివాడిలాగా ఉండడం నాన్నతత్వంలోనే ఉంటుంది. పిల్లల దగ్గర నేర్చుకుంటున్నట్టు ఉండగలడు. పిల్లలు గాడి తప్పుతుంటే, భయాన్ని చూపించగలడు.

వయసుకు వస్తున్నవారికి అలవాట్లు అలుముకోకుండా, వ్యసనాలు వంటబట్టకుండా నాన్న అనే భయం బిడ్డడిని కాపాడుతూ ఉంటుంది.

అమ్మ చూపే అమృతమైన ప్రేమ ముందు, నాన్న శ్రమ, నాన్న తపన కనబడదు. కానీ బిడ్డలు సాధించే విజయాలకు ఆరంభం అమ్మ అయితే, పట్టుదల నాన్నే అవుతాడు.

యువకుడుగా ఉన్నప్పుడు ఎదురైన అనుభవమే, నాన్నగా మరగానే ఆలోచనగా మారిపోతుంది. నిత్యం పిల్లల శ్రేయస్సుకొరకు తపన ప్రారంభం అవుతుంది. పిల్లల కట్టడికి కారణం, సమాజంలో తాను చూసిన సామాజిక పరిస్థితుల ప్రభావం అవుతుంది.

కఠినంగా ఉన్నట్టు కనబడే నాన్న హృదయం వెనుకాల, బిడ్డడి భవిష్యత్తు బాగుండాలనే తాపత్రయం వరదలా ప్రవహిస్తుంది. నాన్న కనబడని ప్రేమ ప్రవాహం వంటి వాడు.

నాన్న ప్రేమ ప్రవాహం కనబడకుండా భవిష్యత్తు కోసం తీసుకునే ప్రణాళిక, ప్రణాళిక అమలు కోసం చేసే నిర్ణయాలు, అలవాట్లకు అంటుకోకుండా చేసే కట్టడి… తదితర విషయాలు కప్పిపుచ్చుతాయి.

ఎదిగే పిల్లల చెడు ఆలోచనలకు నాన్న ఆనకట్టవంటివాడు.

పిల్లల కోసం పాటుపడే తల్లిదండ్రులలో ఎక్కువతక్కువలనే భావనే ఉండదు. అలాంటి వారిలో క్రమమైన ఆలోచనను అమలుపరిచేది నాన్న యొక్క దీక్షే.

నాన్నకు ప్రేమతో మంచి అనిపించుకోవడంలో ముందుండాలి. నాన్నకుప్రేమతో ఇచ్చే కానుక అంటే, సమాజంలో చెడు అనిపించుకోకుండా బ్రతకడమే అంటారు.

బిడ్డకు నాన్న ఇచ్చిన బారోసా ముందు జీవితం ఇచ్చే బారోసా చిన్నదిగానే కనబడుతుంది. కష్టంలో నాన్న పడ్డ కష్టం చూస్తే, జీవితంలో కష్టం ఎదుర్కోవలనే పట్టుదల, దీక్ష కలుగుతాయని అంటారు.

జీవితంలో ఆకాశం అందుకునే అవకాశం వస్తే, అందుకునే పట్టుదల, తెగువ, దీక్ష నాన్న నుండే వస్తాయని అంటారు. కష్టంలోనూ నాన్న ఆదర్శం నాన్న మార్గదర్శకం.

ప్రయత్నంలో నాన్న పట్టుదల, నాన్న దీక్ష, సమస్యలను ఎదుర్కోవడంలో నాన్న చూపే తెగువ… సాధనలో నాన్నచూపే దక్షత. ఆరంభనికి నాన్న తీసుకునే దీక్ష… అన్నింటిలో నాన్న ఆదర్శం నాన్న మార్గదర్శకం అవుతాడు.

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

,

0 responses to “నాన్న ఆదర్శం నాన్న మార్గదర్శకం అన్నింటిలో నాన్న”

Go to top