By | February 20, 2022

నేటి కాలంలో వృద్ధుల పరిస్థితి దయనీయంగా ఉంటుంది. వారిని పట్టించుకుసే స్థితి ఉండకపోవడం విశేషం. కారణం భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్తులు అయి ఉండవచ్చును. మరొక కారణం తల్లిదండ్రులకు దూరంగా పిల్లల ఉపాధి అవకాశాలు ఉండి ఉండడం కావచ్చును. ఒత్తిడిలో ఉండే యువత పెద్దల స్థితిని పట్టించుకోలేని పరిస్థితి కావచ్చును. కారణం ఏదైనా ఉమ్మడి కుటుంబంలో ఏదో బంధుత్వం ద్వారా సేవలు పొందే వృద్దాప్యం వృద్ధాశ్రమంలో కాలం గడుపుతుంది.

ఎప్పటినుండో స్వేచ్చగా జీవించే పెద్ద హృదయం, చిన్న కుటుంబంలో చిన్నవారి పెత్తనంలో ఇమడలేకపోవడం కూడా ఒక కారణం కావచ్చును. ఏదైనా పెద్దవారు లేవలేని స్థితిలో ఉంటే, వారిని పట్టించుకునే బంధుత్వం కన్నా సేవతత్వం ముందు ఉండే పరిస్థితులు కలగడం కుటుంబ వాతావరణంలో వచ్చే మార్పులకు సంకేతంగా కనిపిస్తుంది.

ఒకప్పుడు ఉమ్మడి కుటుంబంలో పెద్దవారికి అనుయాయులుగా పిల్లలు ఉండడం చేత, పెద్దలంటే భయభక్తులతో ఉండడం. ఇంకా వారు లేవలేని స్థితిలో ఉంటే, వారికి సేవలు చేయడం పరిపాటి. అయితే నేటి కాలంలో వృద్దుల పరిస్థితి, మరొకరిపై ఆధారపడి ఉండవలసిన స్థితి. అయితే ఇటువంటి స్థితిని కొందరు అంగీకరించక వృద్ధాశ్రమంలో ఉండే అవకాశం కూడా ఉంటుంది.

కుటుంబ వాతావరణంలో మార్పులే మనుషుల మద్య

ఏదైనా కుటుంబ వాతావరణంలో మార్పులే మనుషుల మద్య సంబంధాలను శాసిస్తాయి. చిన్న చిన్న కుటుంబం అన్యోన్యంగా జీవించే దంపతుల మద్య పెద్దవారిని అడ్డుగా బావించడం కూడా ఒక రకమైనా కారణం కావచ్చును. ఇంకా పెద్దవారి చాదస్తపు మాటలు నేటి తరం వారికి నచ్చకపోవడం కావచ్చును. కారణాంతరాల వలన వృద్దాప్యం ఆశ్రమం ఆసరాను ఆశిస్తుంది.

మనుషుల మద్య బందమే ముఖ్యం తరువాతే ధనం అని భావించే రోజుల నుండి ధనం సంపాదిస్తే, బంధాలు అవే ఏర్పడతాయనే భావన ఉన్న చోట ప్రేమాభిమానాలు తక్కువగానే ఉండవచ్చును. ఇక ఆ భావనతో సంపాదించిన డబ్బు తీసుకువచ్చే సుఖాలు, మనిషిలో మంచి ఆశయానికి అడ్డుగా మారినా ఆశ్చర్యపడనవసరంలేదని అంటారు. ఇలా సంపాదనకే పెద్ద పీట పడే చోట వృద్దులను పట్టించుకునే స్థితి తక్కువగానే ఉండవచ్చును.

ఒకనాటి భారతీయు కుటుంబ వ్యవస్థకు ఇప్పటి చిన్న కుటుంబ వ్యవస్థకు చాలా వ్యత్యాసం ఉంటాయని పెద్దలు చెబుతూ ఉంటారు. ఆనాటి రోజులలో పెద్లలను సేవించడం ఒక ధర్మం అయితే, ఇప్పుడు డబ్బు తీసుకుని సేవ చేసే స్థితి ఉన్నది. కావునా నేటి కాలంలో వృద్ధుల పరిస్థితి ప్రేమాభిమానాలకు నోచుకోని వయస్సుగా మారిపోతుంది.

అయితే ఇటువంటి వృద్దులను పట్టించుకోలేని స్థితిలో సమాజం ఉండడం శ్రేయష్కరం కాదనే అంటారు. చిన్న పిల్లలకు అమ్మ చేసే సేవ అనిర్వచనీయం… అలాగే వృద్యాప్యంలో పిల్లల ద్వారా పెద్దలు పొందే సేవ కూడా అనిర్వచనీయమేనని అంటారు. కొందరు వృద్దులు పిల్లల స్వభావంతో ఉండవచ్చును. అలాంటివారిని వయస్సులో ఉన్నవారే మంచిగా చూసుకోవాలి.

ధర్మశాస్త్రములు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ, అతిధిదేవోభవ అంటున్నాయి… అంటే అమ్మ దైవం, నాన్న దైవం, గురువు దైవం, అతిది దైవం అంటారు. అలా మనకున్న వృద్దులలో ఈ నలుగురిలో ఎవరో ఒకరిగా భావిస్తే, వారికి కష్టం కలగకుండా చూడగలం. అందుకేనేమో… అమ్మానాన్నగురువుఅతిధి దైవంతో చెప్పి ఉంటారు.

మనకు ప్రేమను పంచి ఉంటారు. లేక మనల్ని కన్న తల్తిదండ్రులలో ఎవరికో ఒకరికి వారు ఎనలేని ప్రేమను పంచి ఉంటారు. వెలకట్టలేని సేవ చేసి ఉంటారు. అటువంటి వృద్దులకు ఆసరాగ నిలబడవలసిన అవసరం యువతలో ఉండాలి. మనిషిలో సేవాతత్పరత వృద్దులకు సేవ చేయడం ద్వారానే మరింత ఇనుమడిస్తుందని అంటారు.

వృద్ధులకు ఇష్టమైన పనులు చేస్తూ వారికి సేవ చేస్తూ ఉండడం వలన వారికి కలిగే ఆనందం అనిర్వచనీయం అంటారు.

మరిన్ని తెలుగురీడ్స్ పోస్టులు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు