నేటి రాజకీయాల పై మీ అభిప్రాయం మీ మాటల్లో వివరించండి. ప్రతిరోజు న్యూస్ పేపర్ చదవడం ఒక అలవాటుగా ఉండడం వలన నాకు రాజకీయం గురించి కొంచె అవగాహన కలుగుతుంది.
గత కొంతకాలంగా దేశ రాజకీయాలు అయితే జాతీయతా భావం ప్రజలలో ఎక్కువగా కనిపిస్తుంది. ప్రజల ఆలోచనా తీరు గమనిస్తున్న రాజకీయ పార్టీలు జాతీయతా భావమునే ప్రచారాస్త్రాలుగా మార్చుకుని దేశ రాజకీయాలలో తమ ప్రభావం చూపడానికి ప్రయత్నం చేస్తున్నాయి.
ఏదైనా ఒక విషయంలో ఒక ప్రాంతంలో ఎంత ఎక్కువమంది ఐక్యతగా ఉంటే, ఆ ప్రాంతంలో ఆ విషయం చాలా ప్రభావం చూపుతుంది. అలా మన దేశ రాజకీయాలలో ప్రజలు ఒక రాజకీయ పార్టీవైపు మొగ్గుచూపడం గత కొంతకాలంగా జరుగుతుంది. ఒక పది పన్నెండు సంవత్సరాల వెనుక కాలంలో ఈ పరిస్థితి దేశంలో లేదు. ప్రజలు ఒక రాజకీయ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటించడం వలన పరిసాలనా సౌలభ్యం రాజకీయ పార్టీకి బాగుంటుంది. రాజకీయాలలో ఇది మంచి పరిణామంగా చెబుతారు.
ఒకవేళ ప్రజలంతా దేశంలో అన్ని పార్టీలకు సమానంగా మద్దతు పలికితే, దేశంలో అధికారం సంకీర్ణ ప్రభుత్వంలోకి మారుతుంది. సంకీర్ణ ప్రభుత్వంలో పరిపాలనా సౌలభ్యం తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ప్రధానమైన నిర్ణయాలలో అందరి మద్యలో ఏకాభిప్రాయం రావడం క్లిష్టంగా మారుతుంది.
మనదేశంలోనే కాదు కొత్తగా ఏర్పడిన మన తెలుగు రాష్ట్రాలలో కూడా ప్రజలు ఒక రాజకీయ పార్టీకే సంపూర్ణ మద్దతు పలుకుతున్నారు.
ఇలా దేశంలోనూ, రాష్ట్రాలలోనూ కూడా ప్రజలంతా ఒక రాజకీయ పార్టీకే పట్టం కడుతున్నారు. అందువలన ఆయా రాజకీయ పార్టీలకు పరిపాలన సౌలభ్యం లభిస్తుంది.
అయితే కొన్ని న్యూస్ పేపర్ లేదా న్యూస్ టివి చానళ్ళల్లో రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు జరుగుతున్నాయి. రాజకీయ చర్చలు, ప్రభుత్వ నిర్ణయాలపై నిపుణుల విశ్లేషణలు టివి చానళ్ళల్లో ప్రసారం జరగడం వలన రాజకీయాలపై ప్రజలకు ఒక అవగాహన కలిగే అవకాశం ఉంటుంది.
మరిన్ని తెలుగురీడ్స్ పోస్టులు
విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?
జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?
పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?
పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?
తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు
ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?
0 responses to “నేటి రాజకీయాల పై మీ అభిప్రాయం మీ మాటల్లో వివరించండి”