నినాదాలు ఉద్దేశించబడిన భావనా వ్యాఖ్యలు…. నినాదం అంటే ఒక ఉద్దేశ్యాన్ని తెలియజేస్తూ చేసే బలమైన వ్యాఖ్యగా చెబుతారు. నినాదం ఒక బలమైన విషయాన్ని పరిచయం చేస్తుంది. నినాదాలు నాయకుల మాటలలో ప్రస్ఫుటం అవుతూ ఉంటాయి. కంపెనీల ఉత్పత్తి ప్రచారంలో ప్రస్ఫుటం అవుతాయి. ప్రధాన ఉద్ధేశ్యాన్ని నినాదాలు తెలియజేస్తాయి.
నినాదాలు ఉద్దేశించబడిన భావనా వ్యాఖ్యలు – నినాదం గురించి వివరణ
సమాజంలో అనేక సమస్యలు ఉంటాయి. వాటిలో దీర్ఘకాలిక సమస్యలు ఉంటాయి. అలా దీర్ఘకాలిక సమస్యలతో ఎక్కువమంది సతమతం అవుతున్నప్పుడు, ఎక్కువమందిని ప్రభావితం చేస్తూ, వారిని చైతన్యపరుస్తూ సదరు దీర్ఘకాలిక సమస్య పరిష్కార ప్రయత్నానికి ఒక నాయకుడు అవసరం అయితే, అందరినీ ఆ సమస్యవైపు మళ్ళించడానికి నాయకుడికి ఒక నినాదం అవసరం. ఆ నినాదం సమస్యపై ఉద్యమించడానికి, సమస్య యొక్క ప్రభావం, దాని పరిష్కారం యొక్క ఆవశ్యకతను తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి నినాదం ఒక బలమైన వ్యాఖ్యగా పరిగణిస్తారు.
అలాగే సమాజంలో ఎన్నో కంపెనీలు తమ ఉత్పత్తులను మార్కెటింగ్ చేస్తూ ఉంటాయి. కొన్ని బ్రాండెడ్ కంపెనీలు తమ ఉత్పత్తి యొక్క ఆవశ్యకతను తెలియజేసే విధంగా ఒక వ్యాఖ్యను రూపొందించి, దానిని నినాదంగా ప్రచారం చేస్తారు. నినాదం వలన కూడా ఉత్పత్తి ప్రసిద్ది చెందే అవకాశం ఉంటుంది.
అంబికా దర్భార్ బత్తి అగరు బత్తి ఉత్పత్తి చేసే సంస్థ… ఈ సంస్థ ప్రధాన నినాదం… భగవంతుడికి భక్తుడికి ఆనుసంధానమైనది. ఇది చాలా చాలా ప్రసిద్ది చెందిన నినాదం. ఇది భక్తి తత్వం గురించి బలమైన భావనను తీసుకువస్తుంది. అలాగే నోకియా వారి నినాదం.. కనెక్టింగ్ పీపులు… ఇది కూడా చాలా ప్రసిద్ది చెందిన నినాదం.
ప్రముఖ వ్యక్తుల నినాదాలు
మన దేశ నాయకులలో గాంధీజి… నినాదం – సత్యం, అహింస నాదేవుళ్ళు.
లాల్ బహుదూర్ శాస్త్రి : జై జవాన్, జై కిసాన్
సర్దార్ వల్లభాయ్ పటేల్ : నిజాలను నిర్లక్ష్యం చేస్తే, అవి రెట్టింపు శక్తితో ప్రతీకారం తీర్చుకుంటాయి.
జవహర్ లాల్ నెహ్రూ : చెడుని సహిస్తే అది వ్యవస్థనే నాశనం చేస్తుంది.
బళ్ళారి రాఘవ : కళ కళకోసం కాదు ప్రజలకోసం.
పివి నరసింహారావు : దేశ్ బచావో… దేశ్ బనావో
దాశరధి కృష్ణమాచార్యులు : నా తెలంగాణ కోటి రతనాల వీణ
కందుకూరి వీరేశలింగం పంతులు : అవసరం అయితే చినిగిన చొక్కా కొనుక్కో కానీ మంచి పుస్తకం వదులుకోకు.
భగత్ సింగ్ : విప్లవం వర్ధిల్లాలి
లాలా లజపతిరాయ్ : ఆర్యసమాజం నా తల్లి, వైదిక ధర్మం నా తండ్రి.
ఇలా నినాదాలు సమాజంలో ప్రజలను చైతన్యవంతం చేయడానికి నాయకులకు ఆయుధాలుగా ఉపయోగపడతాయి. కంపెనీలకు ప్రచారాస్త్రములుగా ఉపయోగపడతాయి. నినాదాలు బలమైన భావనను ఎక్కువమందిలో ఒకేసారి తీసుకురాగలవు. ప్రముఖుల చేత నినాదాలు ఉద్దేశించబడిన భావనా వ్యాఖ్యలు నినాదాలు. లేదా ప్రముఖ కంపెనీల చేత ఉద్దేశించబడిన భావనా వ్యాఖ్యలు నినాదాలు.
మరిన్ని తెలుగురీడ్స్ పోస్టులు
విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?
జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?
దానం గురించి దానం గొప్పతనం
సన్మాన పత్రం ఇన్ తెలుగు
వేచి ఉండడాన్ని నిర్వచించండి
పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?
పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?
అవతారం అర్థం ఏమిటి తెలుగులో
తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు
లీడర్ అంటే ఎలా ఉండాలి
ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?
ప్రేరణ తెలుగు పదము అర్ధము
గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?
నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం
కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు
0 responses to “నినాదాలు ఉద్దేశించబడిన భావనా వ్యాఖ్యలు”