By | July 8, 2022
నిత్య జీవితంలో సైన్స్ యొక్క ఉపయోగాలు. విజ్ఙానం ఒక సముద్రం వంటిది. అది కనుచూపు మేర కనబడుతూనే ఉంటుంది. సముద్రానికి చెలియలికట్ట ఉంది కానీ విజ్ఙాన సంద్రానికి మాత్రం చెలియలికట్ట లేదు. ఎంతైనా ప్రయత్నిస్తూ… విజ్ఙానం పెంపొందించుకోవచ్చును. విషయశాస్త్రాన్ని అర్ధం చేసుకోవడానికి చేసే సాధనలో, ఆ విషయాన్ని బట్టి లోకంలో ఉండే వివిధ అంశాలపై కూడా వ్యక్తికి అవగాహన ఏర్పడుతుంది. విశ్వంలో ప్రతి వస్తువు తయారీలోనూ సైన్సు ఉంటుంది. ప్రతి మనిషిలోనూ రషాయినిక చర్యలు జరుగుతూ ఉంటాయి. ప్రతి ప్రదేశంలో రషాయినిక చర్యలు జరుగుతూనే ఉంటాయి. లోకాన్ని గమనించినా, వ్యక్తి శరీరాన్ని గమనించినా, వస్తువు ఉత్పత్తి విధానం గమనించినా…. సైన్సు కనబడుతుంది.

నిత్య జీవితంలో సైన్స్ యొక్క ఉపయోగాలు

చిన్న వయస్సులో బాలుడిలో పుట్టే ప్రశ్నలో సైన్సు ఉంటుంది. వస్తు తయారీకి, వస్తు పరిశోధనకు, విషయ పరిశోధనకు సైన్సు ఆధారం. కాబట్టి నిత్య జీవితంలో వ్యక్తికి ఎదురయ్యే అనేక విషయాలతో సైన్సు మమేకం అయి ఉంటుంది. పరిశీలిస్తే వివిధ కుటుంబ సంప్రదాయాలలో ఉండే ఆచారాలు కూడా సైస్సును బట్టి ఉంటాయని అంటారు. ఇంకా వ్యక్తి ఆహార పదార్ధములపై నియమ నిబంధనలు కూడా సైన్సుని దృష్టిలో పెట్టుకుని చేసినవేనని అంటారు. సైన్సు మన జీవితంలో మనకు తెలియకుండానే భాగమై ఉంటుంది. ఆచారం అయినా, సంప్రదాయం అయినా, వస్తువుల అయినా… ఎలా చూసినా సైన్సు కనబడుతుంది. పరిశోధనాత్మక దృష్టి ఉన్నవారికి నిత్య జీవితం కూడా ఒక పరిశోధనాలయం గా కనబడుతుంది. వంట చేస్తున్నప్పుడు గమనిస్తే… సైన్సు కనబడుతుంది. సైన్సు ఉపయోగాలు ఏమిటో తెలుస్తాయి. వ్యక్తి శరీరం, వ్యక్తి జీర్ణాశయం, అందులో జరిగి జీర్ణక్రియలు గమనిస్తే, సైస్సు ఉపయోగాలు తెలుస్తాయి. ఒక ఫ్యాన్, ఒక టివి, ఒక ఫోన్…. ఇల ఏ వస్తువు గమనించినా అందులోని వాడిన పదార్ధాలు, ఆయా పదార్ధాల లక్షణాలు గమనిస్తే… సైన్సు ఉపయోగాలు తెలియబడతాయి. అద్దంలో ముఖం చూసుకుంటే, ఎందుకు మన ముఖం ప్రతిబింబిస్తుంది? ప్రశ్న పుడితే… అదో పరిశోధనాంశంగా మనసుని సైన్సు వైపుకు మళ్ళించవచ్చును. ఇలా విశ్వంలో విజ్ఙానం ఒక సంద్రం వలె ఉంటుంది. దానికి హద్దు లేదు…. పరిశీలించే కొలది కొత్త ఆవిష్కరణలకు కొంగ్రొత్త ఆలోచనలు పుట్టగలవు. సాధన చేస్తే… కొత్త ఆవిష్కరణలు సాధ్యపడగలవు. ఆలోచిస్తే నిత్య జీవితంలో సైన్స్ యొక్క ఉపయోగాలు అనేకంగా కనబడుతాయి.

మరిన్ని తెలుగురీడ్స్ పోస్టులు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు