By | March 21, 2021

ఆన్ లైన్ విద్య ఎలా ఉపయోగించుకోవచ్చు? తెలుగులో వ్యాసం. విద్య వలన వ్యక్తి బుద్ది వికసిస్తుంది. విద్య పలురకాలు…

అయితే ప్రాధమికంగా శాస్త్రీయ విద్యతో విద్యార్ధి దశ ప్రారంభం అయితే, అటువంటి విద్య అన్ లైన్ ద్వారా ఎప్పుడైనా, ఎక్కడి నుండైనా నేర్చుకోవచ్చు.

నేటి విద్యా వ్యవస్థ సాంకేతికత తోడై సులభతరంగా మారుతుంది. నేర్చుకునే ఉత్సాహం ఉండాలే కానీ ఎవరైనా విద్య నేరుకునే విధంగా విద్యావ్యవస్థ మారుతుంది.

ఇంటర్నెట్ ఆధారిత పరికరాల వాడుక పెరిగాక, ఆన్ లైన్ విద్యకు ప్రాముఖ్యత పెరిగింది. నేటి విద్యా వ్యవస్థలో విప్లవాత్మకంగా విద్య అందరికి అందుబాటులోకి వచ్చింది.

ఒకప్పుడు విద్య నేర్చుకోవడానికి విద్యాలయానికి వెళ్లి, నిర్ణీత సమయాలలో విద్యాభ్యాసం చేయవలసి ఉంటే, ఇప్పుడది మరింత సులభం అయ్యింది.

ఇంటర్నెట్ ఆధారంగా పనిచేసే పరికరాలతో ఆన్ లైన్ విద్య సులభంగా నేర్చుకోవచ్చు. ఆయా పరికరాలు ఉపాద్యాయులను తెరపై చూపుతుంది. బోధన కొనసాగిస్తుండగానే, బోధించేవారిని ఇంటర్నెట్ ఆధారిత పరికరాలలో చూడవచ్చు.

ఇంటివద్ద నుండే విద్యనూ అన్ లైన్ ద్వారా అభ్యాసం చేయవచ్చు. ఇందుకు డెస్క్ టాప్ కంప్యూటర్ లేదా లాప్ టాప్ లేదా స్మార్ట్ ఫోన్ ఉపయోగించవచ్చు.

ఒకసారి రికార్డు చేయబడిన వీడియోలు మరల, మరలా చూడవచ్చు. అర్ధం కానీ పాఠ్యాంశాలు మరల మరలా వినడానికి అన్ లైన్ విద్య ఉపయోగపడుతుంది. ఇనుడుకు యూట్యూబ్ చాలా ఉపయుక్తంగా ఉంటుంది.

విద్య వ్యక్తికి చాలా ప్రధానమైన విషయం. విద్య అంటే తెలుసుకోవడం. వ్యక్తి జీవనం కొనసాగించడానికి శాస్త్రీయంగా ఏమి తెలియాలో? బ్రతకడానికి ఏమి తెలియాలో? అది తెలిసిన వారి నుండి తెలుసుకోవడం.

శాస్త్రీయమైన విద్యాభ్యాసం పాఠశాలలందు నేర్పించబడుతుంది. కానీ అటువంటి శాస్త్రీయమైన విద్య సైతం ఆన్ లైన్ ద్వారా అభ్యాసం చేయవచ్చు.

ఇందుకు బాలురు, బాలికలు, మహిళలు, పురుషులు ఎవరైనా అన్ లైన్ ద్వారా విద్యనూ నేర్వవచ్చును.

నేటి విద్యా విధానం సాంకేతికత వలన అందరికి అందుబాటులోకి వచ్చింది. చెప్పేవారు ఉంటే, ఏ సమయంలోనైనా ఆన్ లైన్ ద్వారా విద్య అభ్యసించవచ్చు.

అంటువ్యాధులకు దూరంగా ఉండడానికి అన్ లైన్ విద్య అవసరం ఉంది.

కరోనా వైరస్ వలన అంటువ్యాధులు అంటే భయం వ్యాపించింది. అంటువ్యాధి వలన సమాజం అంతా వ్యాధిగ్రస్తం అయ్యే అవకాశం ఎక్కువ. ఒకరి నుండి ఒకరికి పాకే గుణం ఉండే అంటువ్యాధులు సోకకుండా అన్ లైన్ విద్య విద్యార్ధులకు ఉపయోగపడుతుంది.

రవాణా ఖర్చులు అదా చేసుకోవచ్చు. ప్రధానంగా కాలాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవచ్చు. అయితే ఆసక్తి ప్రధానం.

ఆన్ లైన్ విద్య ఎలా ఉపయోగించుకోవచ్చు? ప్రశ్నతో పాటు సమస్యలు కూడా ఉంటాయి.

అయితే ప్రధానంగా ఇందులో ప్రధాన సమస్య ప్రతిరోజు కొద్ది గంటలపాటు తదేకంగా ఎల్ఇడి స్క్రీను చూడడం వలన కంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

ఇంకా స్మార్ట్ ఫోన్, లాప్ టాప్ వంటి పరికరాలు అలవాటు అయితే, మనిషిలో ఒంటరితనం పెరిగే అవకాశం కూడా ఎక్కువ.

తోటివారితో కూడిన విద్య, గురువు ముందు నేర్చుకోవడం మేలైన విద్యావిధానం అంటారు.

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు