By | June 21, 2022
పాలితులు పాలకులను అనుసరించడం సహజం పొడుపు కధ పుట్టింది. పెద్దలు మాట్లాడిన మాటలలో ఆంతర్యం ఉంటుందని అంటారు. పెద్దలను పిల్లలు అనుసరిస్తారు అంటారు. తమంతటా తమకు ఉహ తెలిసేవరకు పిల్లలకు పెద్దల మార్గదర్శకులుగానే కనబడతారు. కుటుంబ పెద్ద ఆ కుటుంబానికి పాలకుడు. దేశాధినేత దేశానికి పాలకుడు. కుటుంబ సభ్యులు కుటుంబ పెద్ద కనుసన్నలో నడుచుకుంటారు. దేశాదినేత పాలనలో ప్రజలు పాలితులు.

కుటుంబంలో పాలితులు పాలకులను అనుసరించడం సహజం

కొన్ని విషయాలలో కుటుంబ పెద్ద ఎలా ప్రవర్తిస్తారో, అలాగే ఆ కుటుంబ సభ్యులలో పిల్లలు కూడా అనుకరించే ప్రయత్నం చేస్తారు. కొందరు పిల్లల తమ తండ్రి చేసే వ్యాయామం చేయడానికి వారిని అనుసరిస్తూ ఉంటారు. కొందరు పిల్లల తమ తండ్రి వలె డ్రైవింగ్ చేయాలనుకుంటారు. కొందరు పిల్లల తమ తండ్రి వలె వృత్తి పనిని నిర్వహించాలనుకుంటారు. తండ్రిని అనుకరించడానికి పిల్లలు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకంటే కుటుంబంలో తండ్రి ఓ పెద్ద హీరో…. కుటుంబ సభ్యుల అంతా కుటుంబ పెద్దకు గౌరవం ఇవ్వడం. ఆ గౌరవాన్ని పిల్లలు చూడడం వలన పిల్లలలో కూడా తమ తండ్రి వలె మర్యాదను పొందాలని ఆశిస్తారని అంటారు. అలా పాలకులను అనుకరించాలనే ఉద్దేశ్యం పాలితులలో ఉంటుందని అంటారు.

సమాజంలో కూడా యువత పాలకులను అనుసరించడం సహజం

ఊరిలో బాగా ప్రసిద్ది చెందిన వ్యక్తిని అనుసరించే యువత కూడా ఉంటారు. ఒక ఊరి ప్రెసిడెంటుగారి పేరు ప్రతిష్టలు ఆ చుట్టూప్రక్కల ఊళ్లకు కూడా పాకితే, అతనిని అనుసరించాలనే ఆసక్తి ఎక్కువమంది యువతలో కలిగే అవకాశం ఉంటుందని అంటారు. ఎలా చూసినా పాలకులకు కీర్తి ప్రతిష్టలు ఎక్కువగా ఉంటే, ఆ కీర్తి ప్రతిష్టలు తమకు కూడా రావాలంటే, వారిని అనుసరించాలనే ఆలోచన పాలిత ప్రజలలోనూ కలగవచ్చును. ఇలా పిల్లలు కుటుంబ పెద్దను, యువత తమ ప్రాంతంలోని పెద్దలను వారి కీర్తి ప్రతిష్టలను బట్టి, వారిని అనుసరించాలనే ఆసక్తి కనబరుస్తారని అంటారు.

మరిన్ని తెలుగురీడ్స్ పోస్టులు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు