By | July 8, 2022
‘పల్లెటూళ్ళు ప్రశాంత జీవిత సౌఖ్యానికి పుట్టిళ్ళు’ దీన్ని సమర్థిస్తూ సమాధానం రాయండి. పట్టణంలో ఉన్నంత కాలుష్యం పల్లెటూళ్ళల్లో ఉండదు. కాలుష్యం లేని వాతావరణమే మనిషి ప్రశాంతతకు కారణం కాగలదు కావునా పల్లెటూళ్ళల్లో పల్లెటూరు వాతావరణం ప్రశాంత జీవనానికి అవకాశం ఉంటుంది.

పల్లెటూళ్ళు ప్రశాంత జీవిత సౌఖ్యానికి పుట్టిళ్ళు

మన సమాజంలో నగర జీవనం, పట్టణ జీవనం, పల్లె జీవనం, అటవీ జీవనం… ఇలా మానవులు వివిధ ప్రదేశాలలో జీవనం సాగిస్తూ ఉంటారు. అటవీ జీవనం పల్లెటూళ్ళ కన్నా సహజంగా ఉంటుంది. అయితే అక్కడ క్రూర మృగాలు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనిషికి ప్రశాంతత ఉండదు. పట్టణాలు, నగరాలు అభివృద్ది చెందిన ప్రదేశాలు. కానీ అక్కడ సంపాదన ఉన్నంతగా వాతావరణంలో సహజత్వం ఉండదు. కాబట్టి వాతావరణం అసహజంగా ఉండడమే మనిషిలో అశాంతికి ఆలవాలం అవుతుంది. పట్టణ, నగర జీవనాలు కేవలం యాంత్రికమైన జీవనంగా కూడా ఉండవచ్చని కొందరి అభిప్రాయంగా చెబుతారు. ఇక పల్లెలు… ఇవి నిజంగానే ప్రశాంతతకు పుట్టిళ్ళుగా అనిపిస్తాయి. పూర్వం మనకు పల్లెలు ఎక్కువ. చక్కని చెట్లు, చక్కని ఇల్లు. చక్కనైన వాతావరణం పల్లెటూరు వాతావరణం, ఆప్యాయంగా పలకరించుకునే బంధాలు. ఊరంతా చుట్టమే అన్నట్టుగా అందరూ బంధుభావనతో మెసులుకుంటారు.

పల్లెటూళ్ళు ప్రశాంత జీవిత సౌఖ్యానికి పుట్టిళ్ళు ఎందుకు?

ముందుగా పల్లెల్లో ఇల్లు చాలా విశాలంగా ఉంటాయి. ఇంకా ఇంటిలో జనం ఎక్కువగా ఉంటారు. ఎప్పుడూ వచ్చిపోయే చుట్టాలు ఉంటారు. మనుషుల మద్య సత్సంబంధాలు ఎక్కువగా ఉంటాయి. విశాలమైన ఇంటి వాతావరణంలో ఉండే చెట్లు చక్కని గాలిని అందిస్తాయి. సాయం వేళల్లో ఇంటి ముందునుండి వెళ్ళేవారి పలకరింపులు ఉంటాయి. ఒకరినొకరు పలకరించుకుంటూ, ఒకరికొకరు సాయం అందించుకుంటూ ఉంటారు. ప్రధానంగా ఏదైనా సమస్య ఎదురైతే ఊరంతా ఒక్కటే నిలబడతారు. అంటే ఊరంతా ఒక్కటేననే భావన పల్లెటూళ్ళల్లో బలంగా ఉంటుంది. ఇలాంటి భావన మనిషికి మరింత మనోబలాన్ని పెంచుతుందని అంటారు. ఊరి క్షేమం కోసం ఉత్సవాలు ఉంటాయి. ఉత్సవాలు జరిగినప్పుడు బంధు మిత్రులకు ఆహ్వానం పంపుతారు. పండుగలు జరుపుకోవడంలో పల్లెలు ముస్తాబయినట్టుగా పట్టణాలలో కుదరదు. పల్లెటూరు వాతావరణం వలన వ్యక్తి జీవనం పల్లెటూళ్ళల్లో సహజ జీవనంగా అనిపిస్తే, పట్టణ, నగరాలలో యాంత్రిక జీవనంగా అనిపిస్తుంది. ప్రకృతి సహజత్వం పల్లె జీవనంలో ఉంటుంది కాబట్టి ‘పల్లెటూళ్ళు ప్రశాంత జీవిత సౌఖ్యానికి పుట్టిళ్ళు’ అని భావిస్తాము.

మరిన్ని తెలుగురీడ్స్ పోస్టులు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం? జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు? దానం గురించి దానం గొప్పతనం సన్మాన పత్రం ఇన్ తెలుగు వేచి ఉండడాన్ని నిర్వచించండి పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి? పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి? అవతారం అర్థం ఏమిటి తెలుగులో తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు లీడర్ అంటే ఎలా ఉండాలి ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి? ప్రేరణ తెలుగు పదము అర్ధము గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి? నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు