పేదరిక నిర్మూలన చర్యలు తెలియజేయండి తెలుగు వ్యాసం. అభివృద్ది దిశగా ప్రపంచం నడుస్తుంటే, మనదేశంలో పేదరికం కనబడుతుందని అంటారు. మన దేశ సమస్యలలో ఇదీ ఒక సమస్య. దీనిని తొలగించడానికి ప్రభుత్యాలు చర్యలు తీసుకుంటున్నా, పూర్తిగా ఈ సమస్య నుండి దేశం బయటపడనట్టుగానే చెప్పడం గమనార్హం.
పేదరికం అంటే తినడానికి సరైన ఆహారం సముపార్జించుకోలేని స్థితిలో జీవనం సాగించేవారు కూడా ఉండడం. అయితే దేశంలో తిండి కోసం యాచన చేసేవారు ఉండడం జరుగుతుంది. ఇంకా సంపాదన కూడా చాలక, అప్పుల బాధలో ఉండే కుటుంబాలు కూడా మనకు అనేకంగా ఉంటాయి. ఇలాంటి దేశంలో
పేదరిక నిర్మూలన చేయడానికి రక రకాల చర్యలు తీసుకోవాలసిన ఆవశ్యకత ఉంటుంది.
పేదరిక నిర్మూలన చర్యలు తెలియజేయండి
- ముందుగా ఉపాధి కల్పన
- చేతి వృత్తుల పోత్సాహం
- చిన్న వ్యాపారులకు చేయూత
చిన్న చిన్న వ్యాపారస్తులకు ఆర్ధికమైన కష్టాలు ఉంటాయి. వారు తాము నిర్వహిస్తున్న వ్యాపారంలో ఎక్కువ నష్టం వాటిల్లితే, వారు వ్యాపారం కొనసాగించలేని స్థితిలో ఉంటారు. అలాంటి వారికి చేయూతనిచ్చే విధంగా ఉండాలి.
చేతి వృత్తులు చేసేవారు మనకు అధికంగా ఉంటారు. అలా చేతి వృత్తులను ప్రోత్సహించేవిధంగా తగు చర్యలు ఉండాలి.
అందరికీ ఉపాధి ఉండాలి.
పేదరిక నిర్మూలన చర్యలు తెలియజేయండి – ఉపాధి కల్పన
కష్టం చేసుకుని జీవించేవారికి ఒక రోజు పని ఉండి, నాలుగు రోజులు పనిలేకపోతే, వారి సంపాదన వారి కుటుంబ పోషణకు కూడా సరిపోకపోవచ్చును. అలాంటివారు పేదరికంలోనే ఉన్నట్టు. కాబట్టి కష్టం చేసుకునే వారికి ప్రతిరోజు పని ఉండేవిధంగా తగు చర్యలు ఉండాలి.
చదువుకున్నవారికి, వారి అర్హతకు తగ్గట్టుగా ఉపాధి లభించాలి. అప్పుడే చదువు పూర్తి చేసుకున్నవారు, తమ కుటుంబ సభ్యుల సంపాదనపై ఆధారపడకుండా, తాము కూడా సంపాదిస్తూ, కుటుంబ అవసరాలు ఆర్ధికంగా సాయపడగలరు.
మహిళలకు ఇంటినుండి పని చేసుకునే ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఇంట్లో ఉండే మహిళలు కూడా తీరిక సమాయాలలో పనులు చేసి, ధనం కూడబెట్టడం వలన కుటుంబానికి ఆర్ధిక భారం తగ్గుతుంది. అన్ని కుటుంబాలు కూడా ఆర్ధికంగా బాగుంటే, వారు చెల్లించే పన్నుల రూపంలో ప్రభుత్వాలకు ఆదాయం పెరుగుతుంది. కావునా కుటుంబాలకు ఆర్ధిక భారం పెరగకుండా, దేశంలో అందరికీ
ఉపాధి అవకాశాలు మెరుగుపడేలా చర్యలు ఉండాలి.
ఉపాధి అవకాశాలు – అవగాహన కల్పించడం
చాలామందికి
ఉపాధి అవకాశాలు గురించి అవగాహన లేకుండా ఉంటారు. కొందరు కేవలం ప్రభుత్వ కొలువుల కొరకే వేచి చూస్తూ ఉంటారు. అలా కాకుండా… అందరికీ ప్రభుత్వ, ప్రవేటు ఉద్యోగాల గురించి సమాచారం తెలిసేలాగా ఉండాలి.
- ప్రజలలో చిన్న చిన్న పెట్టుబడులతో వ్యాపారావకాశాల గురించి అవగాహన పెంచాలి.
- బ్యాంకులలో లభించే లోనుల గురించి అవగాహన కల్పించాలి
- ఉపాధి కోసం వేచి చూడడం కన్నా ఉపాధి అందించే ఒక ఆలోచనను చేయడం గొప్ప అనే ప్రేరణ వీడియోలు ప్రచారం చేయాలి.
- కేవలం తమ ఇష్టమైన ఉద్యోగం కోసం కాకుండా, అందివచ్చిన అవకాశం పట్టుకుని ఆర్ధికంగా స్థిరపడడం ప్రధానమనే అంశం గురించి మరింత అవగాహన యువతలో పెంచాలి.
- ఒక వ్యక్తి సంపాదన కన్నా, వ్యక్తుల సంపాదన వలన కుటుంబ ఆర్ధిక పరిస్థితి బాగున్నట్టుగానే, కుటుంబాల ఆర్ధిక వృద్ది వలన దేశాభివృద్ది ఎలా అవుతుందో అవగాహన యువతలో పెంచాలి.
- ఉత్పత్తి చేసే వ్యవస్థలు, సేవా సంస్థలు, సమాచార సంస్థలు… ఇలా వివిధ వ్యవస్థలు, వాటి వలన ఉపయోగాలు అవగాహన యువతలో పెంచాలి.
- ముఖ్యంగా వ్యక్తికి గాని కుటుంబానికి గాని ఆర్ధిక క్రమశిక్షణ ఎంత అవసరమో? యువతలో అవగాహన కల్పించాలి.
- ఉపాధి కోసం చూడడం కాదు…. ఉపాధి అందించే వ్యవస్థనే స్థాపించిన గొప్పవ్యక్తుల గురించి యువతలో అవగాహన కల్పించాలి.
యువతకు అవగాహన, పిల్లలకు చదువు, కుటుంబ పోషకులకు ఉపాధి… వంటి చర్యలు వలన భవిష్యత్తులో పేదరికం అంతరించడానికి సాయడపడగలవని అంటారు.
మరిన్ని తెలుగురీడ్స్ పోస్టులు
విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?
జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?
దానం గురించి దానం గొప్పతనం
సన్మాన పత్రం ఇన్ తెలుగు
వేచి ఉండడాన్ని నిర్వచించండి
పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?
పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?
అవతారం అర్థం ఏమిటి తెలుగులో
తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు
లీడర్ అంటే ఎలా ఉండాలి
ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?
ప్రేరణ తెలుగు పదము అర్ధము
గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?
నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం
కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు
0 responses to “పేదరిక నిర్మూలన చర్యలు తెలియజేయండి తెలుగు వ్యాసం”