By | January 28, 2022

పెద్దల మాట చద్ది మూట మీ మాటలలో…. పెద్దల మాట చద్ది మూట అన్నది నిజం. ఎందుకంటే పెద్దవారి జీవితంలో ఎన్నో సంఘటనలు జరిగి ఉంటాయి. ఏది మంచో, ఏది చెడో వారికి అనుభవంలోకి వస్తాయి. పెద్దవారు సమాజంలో జరుగుతున్న సంఘటనలను పరిశీలన చేసి ఉంటారు. వారికి అనేక విషయాల పట్ట అవగాహన, జ్ఙానం కలిగి ఉంటారు. కావునా వారు మాటలు, మన భవిష్యత్తు కార్యాచరణలో అనుభవంలో ఎదురవుతాయి. అలాంటి మాటలే పెద్దలు పలుకుతూ ఉంటారు.

వర్తమానంలో మనం ఎదుర్కొంటున్న సమస్య ఏదైనా, గతంలో ఎవరో ఒకరు ఎదుర్కొని ఉండవచ్చును.

ఉదా: ఏ అనే వ్యక్తి ఎప్పటి నుండో జీవిస్తున్న వ్యక్తి, ఏ కి కోపం ఎక్కువ… ఆ విషయం బి అనే వ్యక్తికి బాగా తెలుసు… సి అనే వ్యక్తి బి అనే వ్యక్తి కంటే చిన్నవాడు.. బి వద్దనే ఉంటూ ఉండేవాడు. బి అనే వ్యక్తి సి అనే వ్యక్తికి ”ఏ అనువానికి కోపం ఎక్కువ, అతనితో మాట్లాడేటప్పుడు జాగ్రత్త….” అంటూ చెబుతూ ఉండేవాడు. అయితే ఇప్పుడు సి అనే వ్యక్తి ఏ అనే వ్యక్తితో మాట్లాడాలి… ఆ అవసరం వచ్చింది… ఇప్పుడు బి అనే పెద్దవ్యక్తి మాటలు సి అనే వ్యక్తి విని ఉంటే, ఏ అనే వ్యక్తితో మాట్లాటప్పుడు సి చాలా జాగ్రత్తగా మాట్లాడగలడు… కానీ బి అనే పెద్ద వ్యక్తి మాటలను సి అనే వ్యక్తి పెడచెవిన పెట్టి ఉంటే, ఏ అను వ్యక్తితో సి అను వ్యక్తి సరిగ్గా మాట్లాడలేక… ఏ అనే వ్యక్తి యొక్క ఆగ్రహానికి పాత్రుడయ్యే అవకాశం ఉంటుంది.

అంటే పై ఉదాహరణ ఆధారంగా ఎటువంటి వ్యక్తులు మన చుట్టూ ఉన్నారో పెద్దల తమ అనుభవం నుండి పిల్లలకు తెలియపరుస్తూ ఉంటారు… అది ప్రత్యక్ష మాటలు కానీ పరోక్షమాటలు కానీ కావచ్చును.

పెద్దల మాటలు వలన మేలు కలిగే అవకాశం ఎక్కువ.

అలాగే పెద్దల మాటలు కొన్ని ప్రాంతాలలో విధి విధానాల గురించి కూడా ప్రస్తావిస్తూ ఉంటారు. ఏదైనా ప్రాంతంలో దారి దోపిడీలు ఎక్కువ అనే మాటలు పెద్దలు చెబుతుండగా విన్న వ్యక్తి… ఆప్రాంతములోకి వెళ్లేటప్పుడు తగు జాగ్తత్తలు తీసుకునే అవకాశం ఎక్కువ… అదే ఆయా ప్రాంతాల గురించిన పెద్దల మాటలు పెడ చెవిన పెడితే, మాత్రం ప్రయాణంలో తగు జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉండకపోవచ్చున… ప్రయాణంలో ఇక్కట్లు పడవచ్చును.

కొన్ని ప్రాంతాలలో నేల మెత్తగా ఉంటుంది… వర్షం పడితే, అక్కడ వాహనాలు నేలలోకి దిగబడి, వాహన ప్రయానం ఇబ్బందిగా ఉంటుంది. అటువంటి ప్రాంతాల గురించి కూడా పెద్దల మాటలలో ఉంటాయి… ఇలా ఏదైనా తాము ఎదుర్కొన్న సమస్యను తమ తర్వాతి వారికి ఎదురయ్యే అవకాశం ఉండవచ్చును… కావునా వారికి అటువంటి సమస్యల గురించి ముందుగానే ఒక మాట వేసి ఉంటాలనే తలంపు పెద్దలు తలుస్తూ ఉంటారు. అందుకే పెద్దల మాట చద్ది మూట అంటారు.

పెద్దల మాటలు అక్షర సత్యాలు వారు మంచి ఉద్దేశ్యంతోనే అనేక విషయాలపై మాట్లాడుతూ ఉంటారు. కావునా పెద్దల మాటలు పెడ చెవిన పెట్టకుండా, వారి మాటల అంతర్యాన్ని గ్రహించగలరు.

ఆసక్తిని బట్టి వార్తలు వస్తున్నాయా?

నేటి నీ కృషి రేపటికి నీకు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఎవరు?

అబద్దం చెప్పిన వారి విలువను తగ్గిస్తుంది?

అభివృద్దికి ఆటంకాలు అంటే ఏవి?

అసత్య ప్రచారాలు వాస్తవాలు గురించి

మరిన్ని తెలుగురీడ్స్ పోస్టులు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు