By | October 17, 2021

పోరు నష్టం పొందు లాభం తెలుగులో వ్యాసం. ఏస్థాయి అయినా వ్యక్తి నుండి వ్యవస్థ వరకు కూడా ఈ మంచి మాట వర్తిస్తుందని అంటారు. ఈ మాటను విశ్లేషించడానికి ఒక పుస్తకమే వ్రాయవచ్చును. అంతటి మంచిమాట అంతటి శక్తివంతం కూడా… ఇది వంటబట్టించుకున్న వ్యక్తి అందరితోనూ సఖ్యతతో ఉంటారు. అందరితో చాలా సౌమ్యంగా మాట్లాడడానికి ప్రయత్నిస్తారు.

ఆ మాటలోనే చాలా ఆంతర్యం ఉంటుంది. పోరు అంటే పోరాటం లేక యుద్ధం అంటారు. పొందు అంటే సఖ్యత, స్నేహం, కలిసి ఉండుట అనే అర్ఘాలు గ్రహిస్తారు. ఈ పూర్తి వ్యాక్యం యొక్క భావన శత్రుత్వం కన్నా మిత్రత్వం గొప్ప మేలు చేస్తుందని అర్ధం ఇస్తుంది. శత్రుభావన వలన పోరాడాలనే తలంపులే తడతాయి, మిత్ర భావన వలన పొందు(పొందు అంటే స్నేహం, సఖ్యత, మిత్రత్వం) కోరే ఆలోచన పుడుతుంది.

ఇద్దరి మద్య భేదాభిప్రాయాలు రాకుండా ఉండవు. అది సహజం. కాబట్టి ఇద్దరి మద్య భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు ఆ భేదాలకు తగిన కారణాంతరాలు ఏమిటో తెలుసుకొని, ఇద్దరి మద్య భేదం తగ్గించుకునే ప్రయత్నం చేయాలని సూచిస్తూ ఉంటారు.

వ్యక్తుల మద్యే కాదు వ్యవస్థల మద్య ఉండే కార్యనిర్వహణాధికారుల మద్య వచ్చే పొరపొచ్చాలు కూడా వ్యవస్థల మద్య భేదాభిప్రాయాలు సృష్టించగలవు… కావునా ముందు వ్యక్తులలోనే పోరు నష్టం పొందు లాభమనే సూత్రం తెలియబడాలి. ఇచ్చిపుచ్చుకునే దోరణిలోకానీ మాటలలో కానీ అభిప్రాయ భేదం కలిగినప్పుడు తగిన సమయం తీసుకుని, వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం ఉత్తమ ప్రయత్నంగా చెప్పబడుతుంది.

పోరు వలన పోయేది కాలం. కాలం కరిగిపోతు వ్యక్తి ఉన్న సమయం ఖర్చు అయిపోతుంది. పోరు వలన ఖర్చు అయిన కాలం తిరిగి రాదు. అదే పొందు వలన వ్యక్తికి సమయం మిగులుతుంది. మిగులు సమయం బంగారమే అవ్వవచ్చును. కాలానికి విలువనిచ్చేవారు పోరుతో సమయం వృధా చేయకుండా పొందు ద్వారా తమకున్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారని అంటారు.

ఎవరికైనా పోరు నష్టం పొందు లాభం వర్తిస్తుందని అంటారు.

సమాజంలో అనేక సమస్యలు ఇద్దరి మద్య పొడచూపవచ్చును. రెండు వ్యవస్థల మద్య పొడచూపవచ్చును. రెండు సంస్థల మద్య కూడా పొడచూపవచ్చును.

సినిమా వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ మద్య ఘర్షణ వాతావరణం ఏర్పడితే, రాజకీయ నిర్ణయాలు సినిమారంగంపైనా ప్రభావం చూపుతాయి. ఇంకా సినిమా తారల మాటలు రాజకీయంగా ఒక పార్టీని ఇబ్బందికి గురిచేసే అవకాశం ఉంటుంది. రెండు వ్యవస్థల మద్య పోరు వాటికే చేటు చేసే అవకాశం ఉంటుంది.

అలాగే ఏదైనా రెండు సంస్థల మద్య పోటీ పెరిగి, అది వాటి మద్య అవగాహనాలోపం వలన సమస్యలు సృష్టిస్తే, అవి ఆ సంస్థల వ్యాపార లావాదేవీలపైనా ప్రభావం చూపగలవు. వ్యక్తి బలాబలాను బట్టి ఇద్దరి వ్యక్తుల మద్య సంఘటనలు ఉంటే, అలాగే రెండు సంస్థల మద్య పోరు కూడా బలమైన సాంఘిక ప్రబావం ఉంటుంది.

వ్యక్తైనా, వ్యవస్థ అయినా, సంస్థ అయినా పోరుకు పోతే, పోయేది విలువైన కాలంతో బాటు లాభాలు కూడా అంటారు. అదే అభిప్రాయ భేదాలు ఏర్పడినప్పుడు ఆదిలోనే పొందుకు ప్రయత్నించి సెటిల్ చేసుకుంటే, అది విలువైన కాలం వృధా కాకుండా ఉంటుంది. ఒక వ్యక్తికి కాలం కాంచన తుల్యం అని భావిస్తే, అదే సూత్రం వ్యవస్థలకు, సంస్థలకు కూడా వర్తిస్తుంది.


మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు