By | January 9, 2021

రాహల్ ద్రవిడ్ క్రికెట్ ఆటగాడు మిష్టర్ డిపెండబుల్ గా ఖ్యాతిగాంచారు. ఈయన భారత జట్టు కు ప్రాతినిద్యం వహించారు.


ఈయన 1973సంవత్సరంలో జనవరి 11వ తేదీన ఇండోర్ లో జన్మించారు. ఇండోర్ మధ్యప్రదేశ్ లో గలదు. ఈయన మాతృభాష మరాఠీ. రాహుల్ ద్రవిడ్ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు.

ఈయన అసలు పేరు రాహుల్ శరద్ ద్రవిడ్ (Rahul Sharad Dravid)… క్రికెట్ లో ఈయనను ఆటను ఒక గోడతో పోల్చుతారు. వికెట్లు టపా టపా రాలిపోతున్నప్పుడు రాహుల్ ద్రవిడ్ క్రిజులోకి వచ్చి, వికెట్ల దగ్గర పాతుకుపోయి బ్యాటింగ్ చేయడం ఈయన గొప్పతనం.

అందుకే ఈయనను గ్రేట్ వాల్ గా క్రికెట్ ఆటలో చెబుతూ ఉంటారు.

రాహుల్ ద్రవిడ్ 1991లో రంజీట్రోఫి ద్వారా క్రికెట్లోకి ప్రవేశించారు. రంజీట్రోఫిలో రాణించిన రాహుల్ ద్రవిడ్ 1996లో రంజీ డబుల్ సెంచరీ సాధించారు. అదే సంవత్సరం టెస్ట్ క్రికెట్ జట్టులో స్థానం పొందారు.

1996 సంవత్సరంలో ఇంగ్లాండుపై లార్డ్స్ మైదానంలో ఆటతో టెస్టు క్రికెట్ జట్టులోకి వచ్చిన రాహుల్ ద్రవిడ్, 1997 సంవత్సరంలో దక్షిణాఫ్రికాపై జొహన్నెస్‌బెర్గ్‌లో తొలి టెస్ట్ సెంచరీ సాధించారు.

వన్డే క్రికెట్ ఫార్మట్లో రాహుల్ ద్రవిడ్ 1996 సంవత్సరంలో ఇండియా-శ్రీలంకల మద్య జరిగిన మ్యాచు ద్వారా తొలి వన్డే ఆడారు…

రాహుల్ ద్రవిడ్ రికార్డులు – అవార్డులు

2001 టీమిండియా సాధించిన చిరస్మరణీయమైన టెస్ట్ విజయంలో వివిఎస్ లక్ష్మణ్ కలిసి రాహుల్ ద్రవిడ్ ఆట కూడా ప్రధానమైనది. ఆ టెస్ట్ మ్యాచులో వీరిద్దరూ ఐదవ వికెట్ కు 376 పరుగుల బాగస్వామ్యం నమోదు చేశారు. పాలో ఆన్ ఆడి అద్భుతమైన విజయం అందుకున్న ఆనాటి టీమిండియా ఆట ఆదర్శప్రాయంగా చెబుతారు.

రాహల్ ద్రవిడ్ క్రికెట్ ఆటగాడు మిష్టర్ డిపెండబుల్
రాహల్ ద్రవిడ్ క్రికెట్ ఆటగాడు మిష్టర్ డిపెండబుల్

పాకిస్తాన్ పై 2004 సంవత్సరంలో 270 టెస్ట్ క్రికెట్లో తన వ్యక్తిగత అత్యధిక స్కోరును మరింత మెరుగు పరుచుకున్నారు. 2005 సంవత్సరంలో టీమిండియా కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించారు.

టెస్ట్ మరియు వన్డే ఫార్మట్లలో భారత క్రికెట్ జట్టుకు నాయకత్వం వహించారు. రాహుల్ ద్రవిడ్ 2008 సంవత్సరంలో టెస్ట్ క్రికెట్లో 10 వేల పరుగుల మైలురాయిని దాటారు.

క్రికెట్లో ఈయన 164 టెస్ట్ మ్యాచులలో 286 టెస్ట్ ఇన్నింగ్సులలో ఆడారు. టెస్ట్ క్రికెట్ ఫార్మట్లో రాహుల్ ద్రవిడ్ 13288 పరుగులు సాధించారు. వన్డే క్రికెట్ ఫార్మట్లో రాహుల్ ద్రవిడ్ 344 వన్డేలలో జట్టులో ఉంటే, 318 వన్డే ఇన్నింగ్సులలో ఆడారు. వన్డే క్రికెట్ ఫార్మట్లో రాహుల్ ద్రవిడ్ 10889 పరుగులు సాధించారు.

రాహుల్ ద్రవిడ్ టెస్ట్ క్రికెట్‌లోనూ, వన్డే క్రికెట్లోనూ భారత తరపున అరుదైన రికార్డు ఉంది. టెస్టు క్రికెట్లో అత్యధికంగా 5 డబుల్ సెంచరీలు చేసిన భారతీయుడుగా ఉన్నారు. ఇంకా వన్డే క్రికెట్లో వరుసగా 120 వన్డేలలో డకౌట్ కాకుండా రికార్డు సాధించారు.

టెస్టు క్రికెట్ ఫార్మట్లో అసలు సిసలైన టెస్ట్ క్రికెట్ ప్లేయరుగా రాహుల్ ద్రవిడ్ కీర్తి గడించారు. క్లాసికల్ క్రికెట్ ప్లేయర్ పలువురిచేత ప్రశంసలు అందుకున్నారు. ఇలా రాహుల్ ద్రవిడ్ భారతీయ క్రికెట్లో ఒక అగ్ర దిగ్గజంగా ఉన్నారు.

భారత ప్రభుత్వం నుండి 2004సంవత్సరంలో రాహుల్ ద్రవిడ్ పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. అంతేకాకుండా అదే సంవత్సరం ఐసిసి ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపికయ్యారు.

ఇంకా పలు అవార్డులు రాహుల్ ద్రవిడ్ అందుకున్నారు. భారత క్రికెట్లో మిస్టర్ డిపెండబుల్ ప్లేయరుగా రాహుల్ ద్రవిడ్ సేవలు మరవలేనివి.

రాహుల్ ద్రవిడ్ 2003 మార్చి 4వ తేదిన విజేత పెండార్కర్ తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు మగపిల్లలు సంతానం. వారి పేర్లు సమిత్ ద్రవిడ్, అన్వయ్ ద్రవిడ్…

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు