సొంత కాళ్ళమీద నిలబడాలంటే చదువొక్కటే మార్గం తెలుగు వ్యాసం. వ్యక్తి మరొకరిపై ఆధారపడడం అంటే, ఆ వ్యక్తి మరొకరికి భారంగా ఉన్నట్టే, అలా కాకుండా తన సంపాదనపై తాను జీవిస్తుంటే మాత్రం తనే మరొకరికి సాయపడగలడు. కావునా వ్యక్తి తన సంపాదనపైనే ఆధారపడేవిధంగా జీవించాలి అంటారు. దానికే ఓ విలువ లభిస్తుందని అంటారు.
పిల్లలుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులపై ఆధారపడి ఉండడం సహజం అయితే ఒక వయస్సుకొచ్చేసరికి తన కంటూ ఒక సంపాదన మార్గం ఉండాలి. అప్పుడే వ్యక్తిగా ఒక గుర్తింపు పెరుగుతూ ఉంటుంది. చేసే వృత్తిని బట్టి సమాజంలో స్థాయి కూడా మారుతుంది. సొంత కాళ్ళపై నిలబడడం ప్రారంభించాడు అనే ప్రశంస పెద్దల నుండి లభిస్తుంది. ఈ
తెలుగు వ్యాసం… చదవండి.
వ్యక్తి తన సొంత కాళ్ళమీద నిలబడాలంటే చదువొక్కటే మార్గం తెలుగు వ్యాసం ద్వారా వివరించే ప్రయత్నం.
స్వీయ సంపాదనతో జీవనం సంతృప్తికరంగా ఉంటే, అందుకు చదువు బాగా సాయపడుతుంది. తనకంటూ గుర్తింపు సహజ ప్రతిభ వలన వస్తుంది. అటువంటి ప్రతిభకు పట్టం కట్టేది చదువు. వ్యక్తికి ఉండే విశిష్టమైన ప్రతిభ గుర్తింపుకు కారణం అయితే, ఆ ప్రతిభ వలన ఆర్ధిక ప్రగతి కూడా సాధించిన నాడు, ఆవ్యక్తికి సమాజంలో స్థాయి పెరుగుతుంది. అటువంటి స్థాయికి వెళ్ళడానికి వ్యక్తి ప్రతిభకు చదువు కూడా తోడైతే అది మరింతగా రాణిస్తుందని అంటారు.
వ్యక్తి తన పోషణకు, తనపై ఆధారపడినవారిని పోషించడానికి సంపాదన అవసరం. సాదారణంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలపై ఆధారపడి వ్యక్తి ఆర్ధికాభివృద్ది ఉంటుంది.
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల ఏదైనా ఒకటి సాయానికి చదువు కూడా తోడైతే తన సొంత కాళ్ళమీద నిలబడడానికి మరిన్ని అవకాశాలు
చేతి పనులు ద్వారా తమ కృషితో తమ కుటుంబాన్ని పోషించుకునేవారు ఉంటారు. అయితే భవిష్యత్తులో చేతి వృత్తి పనులు కూడా సాంకేతికతతో జతకడితే, చదువు ఆవశ్యకత ఏర్పడుతుంది.
ఉద్యోగం చేయాలంటే, అర్హత సాధించిన పత్రములు అవసరం. అలాంటి అర్హత రావడానికి చదువొక్కటే మార్గం. ఏదైనా రంగంలో ఒక స్థాయి ఉద్యోగంలో చేరడానికి అర్హత అవసరం. ఉపాధ్యాయ వృత్తి స్వీకరించాలంటే, అందుకు తగిన చదువులలో ఉత్తీర్ణుడై ఉండాలి. అప్పుడే అతను ఉపాధ్యాయునిగా ఏదైనా ఒక విద్యా సంస్థలో పని చేయగలడు.
అలాగే ఒక ఆఫీసులో ఖాతాల పరిశీలన, ఖాతాల లెక్కలు తేల్చే ఉద్యోగం చేయాలంటే, కామర్స్ లో ఉత్తీర్ణుడై ఉండాలి. అందుకు చదువొక్కటే మార్గం.
ఇంకా ఒక కార్మికుడుగా పనిచేయాలన్న, అర్హత అవసరం కనీసం 10వ తరగతి ఉండాలి. ఐటిఐ వంటి సంస్థలలో చదివి ఉత్తీర్డుడైతే కర్మాగారంలో కార్మికుడిగా మారవచ్చును. ఇంకా ఆపై డిప్లొమా కోర్సులు పూర్తి చేసి అర్హత సాధిస్తే, ఒక సంస్థలో పనిని చేయించే అధికారిగా మారగలడు.
ఈ పై వాటిలో ఏది చేయడానికైనా… చదువొక్కటే మార్గం. తన
సొంతకాళ్ళ మీద తాను నిలబడాలంటే, చదువు యొక్క ఆశ్యకత ఎంతగానో ఉంది.
మరిన్ని తెలుగురీడ్స్ పోస్టులు
విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?
జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?
దానం గురించి దానం గొప్పతనం
సన్మాన పత్రం ఇన్ తెలుగు
వేచి ఉండడాన్ని నిర్వచించండి
పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?
పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?
అవతారం అర్థం ఏమిటి తెలుగులో
తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు
లీడర్ అంటే ఎలా ఉండాలి
ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?
ప్రేరణ తెలుగు పదము అర్ధము
గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?
నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం
కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు
0 responses to “సొంత కాళ్ళమీద నిలబడాలంటే చదువొక్కటే మార్గం తెలుగు వ్యాసం”