స్వచ్ఛ భారత్ గురించి రాయండి. తెలుగు వ్యాసం

వ్యక్తి అనారోగ్యానికి కుటుంబంలోని అపరిశుభ్రతతో బాటు, సమాజంలోని కలుషిత వాతావరణం కూడా కారణం అవుతుంది. కాబట్టి ఒక వ్యక్తి చుట్టూ ఉండే పరిసరాలు శుభ్రంగా ఉండాలి. కుటుంబంతో పాటు సమాజం కూడా పరిశుభ్రంగా ఉండేవిధంగా చూడాల్సిన బాద్యత అందరిపై ఉంది. పరిసరాలు పరిశుభ్రంగా ఉండడం వలన పనికి ఆటంకం కలగదు. పనులు సజావుగా సాగడం వలన వృద్ది ఉంటుంది. కాబట్టి పరిసరాల పరిశుభ్రత ప్రధానమైన అంశమని మహాత్మాగాంధి చెప్పారు.

మొదటిసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన నరేంద్ర మోడిగారు, స్వచ్చ భారత్ కార్యక్రమం ప్రారంభించారు. అందరూ ఆరోగ్యంగా ఉండడం చేత, వ్యక్తికి ఖర్చు తగ్గుతుంది, వ్యక్తి పనిచేసే శక్తి కలిగి ఉండడం చేత, అతను పని చేసి, డబ్బు కూడా బెట్టగలడు… అప్పుడు తనతోబాటు తన కుటుంబానికి సహాయపడగలడు. అలా ఉద్యోగస్తులు, కార్మికులు, వ్యాపారస్తులు ఆరోగ్యంగా ఉండడం వలన, ఇంకా కష్టపడి, వారు దేశాభివ్రుద్దిలో తన వంతు కృషిని అందించగలరు. గాంధిజి కలను నెరవేర్చే దిశగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారు 2014 అక్టోబర్ 2న, గాంధీ జయంతి రోజు స్వచ్ఛ భారత్ అభియాన్” అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు.

స్వచ్ఛ భారత్ లక్ష్యాలు

స్వచ్ఛ భారత్ యోజనకు కొన్ని ప్రధాన లక్ష్యాలు ఉన్నాయి:

  1. ప్రతి ఊరు, ప్రతి పట్టణం, ప్రతి నగరం, అన్ని ప్రాంతాలలో పరిశుభ్రత పెరగాలి.
  2. దేశంలో ప్రతి ఇంటికి మరుగుదొడ్లు నిర్మాణం జరగాలి.
  3. బహిరంగ మలమూత్ర విసర్జన చేయరాదు.
  4. వ్యర్థ పదార్థాలను ఎక్కడపడితే అక్కడ పడేయకుండా చూసుకోవాలి.
  5. దేశ ప్రజలలో కుటుంబం మరియు చుట్టూ ఉండే, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన పెంచాలి.

ఈ కార్యక్రమం ప్రాముఖ్యత

స్వచ్ఛ భారత్ యోజన వలన గ్రామాలు, పట్టణాలు వీధులు చక్కగా ఉంటాయి. ప్రజలలో ఆరోగ్యకరమైన అలవాట్లు పెరుగుతాయి. పరిశుభ్రమైన వాతావరణం వలన అనేక రకాల వ్యాధులు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు ఆరోగ్యంగా ఉండటానికి పరిశుభ్రత చాలా ప్రధానం.

పరిసరాల పరిశుభ్రత వలన పర్యాటక రంగానికి కూడా మంచి లాభం ఉంటుంది. విదేశాల నుండి వచ్చే పర్యాటకులు పరిశుభ్రమైన ప్రదేశాలను చూసి మనదేశం గురించి మంచి అభిప్రాయం ఏర్పరచుకుంటారు. అలాగే పరిశుభ్రమైన జీవన శైలి మన సమాజానికి సాంస్కృతిక, ఆర్థిక, ఆరోగ్య పరంగా మేలు చేస్తుంది.

మన బాధ్యత

స్వచ్ఛ భారత్ కార్యక్రమం కేవలం ప్రభుత్వ కార్యక్రమమే కాదు, అందరికి సంభందించినది. ప్రతివారు తన ఇంటి నుండి తమ వీధి వరకు పరిశుభ్రతకు కృషి చేయాలి. చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా చూసుకోవాలి, చెత్తను నిర్ణీత ప్రదేశాలలో వేయాలి. నీటిని వృథా చేయకూడదు. చుట్టూ పచ్చదనం పెంచుకోవాలి.