By | August 9, 2022

75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 74 సంవత్సరాలు పూర్తయి, 75వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాము. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చాకా, భారతదేశంలో అనేక మార్పులు వచ్చాయి. మనం స్వేచ్ఛగా బ్రతకడానికి, ఆకాలంలో తమ జీవితాలను పణంగా పెట్టి పోరాడిని ప్రతి స్వాతంత్ర్య సమరయోధునికి ధన్యవాదాలు తెలుపుకోవాలి. పురుషులతో బాటు స్త్రీలు కూడా దేశ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని తమ దేశభక్తిని తెలియజేశారు. ఎందరో దేశభక్తుల త్యాగ ఫలితం నేటి మన స్వేచ్చాభారతం.

భారత స్వాతంత్ర్య దినోత్సవం గురించి స్పీచ్

1947 ఆగష్టు 15వ తేదీన మనదేశానికి బ్రిటీష్ ప్రభుత్వం నుండి విముక్తి లభించింది. మనల్ని మనం పరిపాలించుకోవడానికి, మన రాజ్యాంగం అమలు కావడానికి మరికొంత కాలం ఆగవలసి వచ్చింది. 1950 జనవరి26 వరకు మన దేశ రాజ్యాంగం అమలుకు శ్రీకారం పడింది.

స్వాతంత్ర్యదినోత్సవ రోజుకు ముందువరకు ఎందరో భారతీయులు స్వేచ్ఛలేని దేశాన్ని చూసి దు:ఖించినవారే. ఎందరో భారతీయులు దేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ ప్రభుత్వంతో పోరాడినవారే. చరిత్రలో లిఖించిన స్వాతంత్ర్య సమరయోధుల గురించి మనం చెప్పుకుంటాము. అలా చరిత్రకెక్కిన నాయకులకు బాసటగా నిలిచినవారెంతమంది? ఆ నాయకులకు స్ఫూరిని నింపిన సంఘటనలు? ఆ సంఘటనలలో బలైన భారతీయులు ఎందరు? ఇలా ప్రశ్నించుకుంటే, దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరి జీవితాలు త్యాగం చేశారో?

వారు తమ సుఖం కోసమే పోరాడాలనుకుంటే, అటువంటివారికి తాయిలాలు పెట్టి బుజ్జగించే బ్రిటీష్ ప్రభుత్వంలో సుఖంగా జీవించేయవచ్చును. వారు దేశం కోసం పోరాటం చేశారు కాబట్టి నేడు మనకు ఈ స్వాతంత్ర్యం. అనేకమంది భారతీయులు సంవత్సరాల కాలం పాటు పోరాటం చేసి చేసి సంపాదించుకున్న స్వాతంత్ర్య భారతం ఎలా ఉంది?

స్వాతంత్ర్య దినోత్సవం గురించి తెలుగులో

ఉత్తరం ఆధారంగా కమ్యూనికేషన్ చేసే రోజుల నుండి వీడియో కాలింగ్ చేసి మాట్లాడే రోజులలో ఉన్నాము. సాంకేతికంగా ఎన్నో మార్పులు అందరి జీవితాలపై ప్రభావం చూపుతున్నాయి. అప్పటి రవాణా సౌకర్యాలకు, ఇప్పటి రవాణా సౌకర్యాలకు ఎంతో వ్యత్యాసం ఉంది. అప్పటి ఉత్పాదక పనులకు ఇప్పటి ఉత్పాదక పనులకు కూడా వ్యత్యాసం… ఇలా ప్రతి రంగంలో ఎన్నో వ్యత్యాసాలు కనబడతాయి.

క్రీడా రంగంలో మన దేశ క్రీడాకారులు అద్భుతాలు సృష్టిస్తున్నారు. పారిశ్రామిక రంగంలో మన దేశ పారిశ్రామికవేత్తలు అభివృద్దిపధం వైపు సాగుతున్నారు. చేయూత అందిపుచ్చుకున్నవారు ఎదుగుతున్నారు. అది అందనివారు అక్కడే ఆగిపోతున్నారు. మనదేశంలో ప్రధాన సమస్య కూడా అదే, అభివృద్ది అందరితో ముడిపడి ఉండకుండా, కొందరి వైపే ఉండడం గమనార్హం. పేదరికం నుండి అందరూ బయటపడలేకపోతున్నారు.

వాణిజ్య, వ్యాపార, పారిశ్రామిక రంగాలలోనూ, సాఫ్ట్ వేర్ పరంగానూ వృద్ది ఉంటే, వ్యవసాయ రంగంలో మాత్రం వృద్దికి బ్రేకులు పడుతున్నట్టే ఉంటుంది. కొందరు వృద్ది ఉండడం లేదని వ్యవసాయం వదులుతున్నవారు ఉంటున్నారు. రైతు సమస్య అలానే మిగిలిపోతుంది.

సామాజికపరంగా ఎన్నో మార్పులు. మనదేశ సంప్రదాయం, సంస్కృతి ప్రపంచమంతా గౌరవిస్తే, వాటిపై సినిమాల ప్రభావం చాలానే పడిందని అంటారు. ఇప్పుడు యువత పాటిస్తున్న విలువలే, రేపటి సామాజిక భవిష్యత్తుపై పడుతుంది. యువతకు మన సంప్రదాయపు ఆచారణ గురించి అవగాహన అవసరం ఉందని పెద్దలంటారు.

మన సమాజంలో అవినీతి సమస్య ఎక్కువగా కనబడుతుందని కధనాలు చూస్తుంటాం. అవినీతి పరుల వలన మరొక అవినీతి పరుడుకి మార్గం చూపినట్టు అవుతుంది. అదే అవినీతిపరులకు అధికారంలో ఉంటే, మరింత మంది అవినీతి మార్గంలో నడవడానికి మొగ్గుచూపే అవకాశం ఉంటుందని అంటారు. కావునా అవినీతి అంతానికి కఠిన చర్యలు అవసరం అంటారు.

నేటి రాజకీయ వ్యవస్థ రేపటి సామాజిక భవిష్యత్తును శాసించగలదు. కాబట్టి రాజకీయాలు స్వచ్చతను కలిగి ఉండాలి. సామాజిక ప్రయోజనాలే ప్రధానంగా ఉండాలని పెద్దలంటారు.

స్వాతంత్ర్యం దినోత్సవం గురించి వ్యాసం

భారతదేశం అభివృద్ది చెందాలి. ప్రజలంతా స్వేచ్ఛగా జీవించాలి. భారతదేశ స్వేచ్ఛకోసం ప్రాణాలు త్యాగం చేసిన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగం పూర్తి స్థాయిలో ఫలించాలంటే, మన దేశంలో పేదరికం అంతరించాలి. సామాజిక సౌభాతృత్వం పెరగాలి. దేశం అభివృద్ది చెందాలి. దేశంలో ప్రజలంతా అభివృద్దిపధం వైపు నడవాలి. ప్రతివారు పనిని చేయడం వలన దేశం అభివృద్ది బాటలో నడుస్తుంది.

నాటి మన స్వాతంత్ర్య సమరయోధుల జీవితాల త్యాగానికి ఫలితం మనం అనుభవిస్తున్న స్వేచ్ఛా జీవితం అయితే, ఇప్పుడు మనం అనుసరిస్తున విధానం రేపటి తరంపై ప్రభావం చూపుతుంది. కాబట్టి విలువలతో కూడిన జీవితం ప్రధానం అంటారు.

అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.

మరిన్ని తెలుగురీడ్స్ పోస్టులు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు