స్వేచ్ఛ గురించి తెలుగు వ్యాసం వ్రాయండి! ఇది చాలా చాలా ప్రధానమైన అంశము. మనిషికి ప్రశాంతతను ఇచ్చేది స్వేచ్ఛ… క్రమశిక్షణలో పెరిగినవారికి సరైన సమయంలో స్వీయ నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ కలిగి ఉండాలని అంటారు.
స్వేచ్ఛ గురించి తెలుగు వ్యాసం వ్రాయండి ఒకరి స్వేచ్ఛ మరొకరికి భంగం కలగరాదు. నియంతృత్వ దోరణి వలన స్వేచ్ఛ హరించబడుతూ ఉంటుంది. స్వేచ్ఛను హరించే గర్హించాలి.
సమాజంలో మనుషులందరికీ స్వేచ్ఛగా జీవించే హక్కుంది. కాబట్టి వ్యక్తి ఎదిగేవరకు సంరక్షకుల నియంత్రణలో ఉన్నా స్వేచ్ఛాపూరిత వాతావరణం ఎదుగుతున్నవారికి ఉండేవిధంగా చూడాల్సిన బాద్యత పెంచేవారికి ఉంటుంది.
మాట్లాడే స్వేచ్ఛ మనిషికి ఉంది. కష్టపడి సంపాదించిన సొమ్మును ఖర్చుచేసుకునే స్వేచ్ఛ ఉంది. కానీ కొందరికి కొన్నిసార్లు ఈ స్వేచ్ఛ లభించని సంఘటనలు కూడా జరగడం విచారదాయకం.
పెద్దల దగ్గర పిల్లలకు స్వేచ్ఛలేకపోవడం
ముసలివారికి కుటుంబ యజమాని దగ్గర స్వేచ్ఛ లభించకపోవడం
అధికారి దగ్గర సహాయకులకు స్వేచ్ఛలేకుండా పోవడం…
అక్కడక్కడా అరుదుగా జరిగినా, వాటిని ఉపేక్షిస్తే స్వేచ్ఛ పూర్తిగా హరించుకుపోతుంది.
క్రమశిక్షణలేని విద్య ఎంత ప్రమాదమో అలాగే పూర్తి నియంత్రణలో స్వేచ్ఛలేకుండా పోవడం కూడా మనిషికి మరింత ప్రమాదకరం. కాబట్టి అవసరమైన స్వేచ్ఛ వ్యక్తికి ఉండాలనేది పెద్దల సదభిప్రాయం.
ఎక్కడైనా ఎప్పుడైనా నేను స్వేచ్ఛ కోల్పోయాను అని బాధపడితే, అది చాలా విచారదాయకం. కాబట్టి స్వేచ్ఛను హరించే సంఘటనలు జరిగినప్పుడు స్వేచ్ఛాహరణ చేసినవారిని ప్రశ్నించాలి. అటువంటి సంఘటనలను విమర్శించాలి.
చదువుకునే వయస్సులో పిల్లలకు ఆటపాటలపై కొంతమేరు స్వేచ్ఛ ఉండాలి.
ఉన్నత విద్యపూర్తయ్యేసరికి తర్వాతి దశ చదువుకు వారికి స్వేచ్ఛ ఉండాలి కానీ వాటి దశలలో అవగాహన కల్పించాల్సిన బాధ్యత పెద్దలదే…
ముసలివారికి ఇంట్లో యజమాని దగ్గర స్వేచ్ఛ ఉండాలి.
మరిన్ని తెలుగురీడ్స్ పోస్టులు
విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?
జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?
పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?
పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?
తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు
ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?
0 responses to “స్వేచ్ఛ గురించి తెలుగు వ్యాసం వ్రాయండి”