By | January 11, 2022

మాతృభాషలో విద్య మీరు సమర్థిస్తారా? వ్యాసం. అమ్మ తనకు తెలిసిన భాషలో పిల్లలతో సంభాషిస్తుంది. అమ్మకు తెలిసిన భాష కూడా వాళ్ళమ్మ వద్ద నుండే నేర్చి ఉంటుంది. ఒక ప్రాంతంతో మాట్లాడే భాష ఆ ప్రాంతంలో పుట్టి పెరిగినవారికి మాతృభాషగా ఉంటుంది. అమ్మ మాట్లాడే భాషలోనే పెరిగిన పిల్లలు, అదే భాష ద్వారా విషయాలను గ్రహించడంలో అలవాటు పడి ఉంటారు. కావునా మాతృభాషలో విద్య వలన త్వరగా విద్యార్ధులకు విషయావగాహన ఉంటుందని అంటారు.

మాతృభాషలో విద్య మీరు సమర్థిస్తారా? తెలుగువ్యాసం

పుట్టి పెరుగుతున్నప్పటి నుండి అమ్మతోబాటు మనకు తోడుగా ఉండే భాష మాతృభాష. కావునా మాతృభాషలో వివిధ భావనలు సులభంగా అవగాహన చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఆలోచన చేసినప్పుడు ఖచ్చితంగా మాతృభాషలో విద్య అవసరం అంటారు.

భాషాపరమైన అంశాలలో, చారిత్రక అంశాలలో, సామాజిక అంశాలలో మాతృభాషలో విద్యా బోధన సదరు ప్రాంతంలోని విద్యార్ధులకు మేలు చేయగలదు. అయితే అదే స్థితిలో ఇతర సబ్జెక్టుల పరంగా చూసినప్పుడు ఆంగ్లభాష కూడా అవసరం ఉంటుంది.

అయితే విషయాలు అవగాహన చేసుకోవడంలో మాతృభాషలో ఉన్నంత సౌలభ్యం ఇతర భాషలలో తక్కువగా ఉంటుందని అంటారు. కానీ విశేష ప్రతిభ ఉన్నవారికి భాష ఏదైనా ఒక్కటే… అయితే అందరూ ఒకే విధంగా సబ్జెక్టులను అర్ధం చేసుకోలేకపోవచ్చును. ఎక్కువమంది మాతృభాషలో విషయావగాహన సులభంగా ఉంటుందనే అభిప్రాయపడతారు.

ఎక్కువమందికి ఏది అవసరమో అది వ్వవస్థాపరంగా అందుబాటులో ఉండాలనే కనీస న్యాయమని భావించినప్పుడు… మాతృభాషలో విద్య అవసరం అనే భావనకు బలం చేకూరుతుంది.

మారుతున్న సామాజిక పరిస్థితులలో సాంకేతికత చాలా ప్రముఖ స్థానాన్ని పొందుతుంది. సాంకేతికత ఎక్కువగా ఆంగ్లభాష ఆధారంగా పని చేస్తున్నప్పుడు అందరికీ ఆంగ్లభాష అవసరం ఏర్పడుతుంది.

పెరుగుతున్న పని ఒత్తిడి కారణంగా మనిషికి మానసిక ప్రశాంతతకు భంగం ఏర్పడుతుంటే, వారికి మన భారతీయ సంప్రదాయంలో సాహిత్యం రీడ్ చేయడం ద్వారా మనోవిజ్ఙానం పెరిగే అవకాశం ఉన్నప్పుడు మాతృభాషలో సరైన పట్టులేకపోవడం వారికి భాధాకరం కావచ్చును. మనోవిజ్ఙానం వలన మనోరుగ్మతలనుండి మనసును కాపాడుకోవచ్చని చెబుతున్పప్పుడు మనసు గురించి మాతృభాషలో అవగాహన ఏర్పడినట్టుగా ఇతర భాషలలో ఏర్పడకపోవచ్చును.

అయితే నేటి సమాజంలో వివిధ విషయాలలో ఇతర భాషాల ప్రాముఖ్యత రిత్యా, ఇతర భాషలలో కూడా ప్రావీణ్యత అవసరం ఉంది. కావునా మాతృభాషలో విద్య ఐచ్చికంగా ఉంటే బాగుంటుందనే అభిప్రాయం బలపడుతుంది.

సాదారణ పరిస్థితులలో అంటే ప్రాధమికంగా మాతృభాషలో విద్య అందించి, అవగాహన చేసుకునే బలం పెరిగే కొలది ఐచ్చిక భాషలో విద్యా బోధన మంచి ఫలితం ఇవ్వగలదని ఆశించవచ్చు అంటారు.


అమ్మదగ్గర నేర్చుకునే మాతృభాషలో విద్య మీరు సమర్థిస్తారా?


అమ్మ దగ్గర ఏ భాష ద్వారా వివిధ విషయాలను తెలుసుకుంటూ ఉంటామో? తమ తమ కుటుంబాలలో ఎప్పుడూ మాట్లాడే వాడుక భాష హిందీ అయితే వారికి మాతృభాష హిందీ భాష అవుతుంది. అలాగే పుట్టినప్పటి నుండి తమిళం మాట్లాడేవారికి, మాతృభాష తమిళం అవుతుంది. అలాగే కుటుంబలోనూ, సమాజంలోనూ వాడుక భాష తెలుగుభాష అయితే అదేవారికి మాతృభాష. అలా తెలుగులోనే మాట్లాడేవారికి తెలుగు భాష మాతృభాష


ముందుగా చెప్పుకున్నట్టే… మాతృభాషలో అందరికీ అవగాహన ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఎక్కువగా అవగాహన ఎలా ఉంటుందో, అలానే విద్యాబోధన ఉపాధ్యాయులు చేస్తూ ఉంటారు. కారణం ఏవిధంగా విద్యార్ధికి పాఠం చెబితే, అర్ధం అవుతుందో, ఆవిధంగానే పాఠాలు బోధిస్తూ, విద్యార్ధులకు విద్యను అందిస్తారు. కావునా ఈ దృష్టికోణంలో ఆలోచిస్తే, మాతృభాషలో విద్యను సమర్ధించవచ్చును.


మాతృభాషలో విద్యతో బాటు ఇతర భాషలలో పట్టుకూడా అవసరం.


మనకు తెలిసిన భాషలోనే సమాజం అంతా ఉండదు. సమాజంలో అందరూ ఉండరు. సమాజంలో అన్ని పనివిధానాలు ఉండవు. ఇక ప్రాంతాలు మారితే మాట్లాడే భాష కూడా మారుతుంది. కావునా మాతృభాష మనకు అవగాహన చేసుకోవడం సులభం అయితే, ఇతర భాషల వలన ఇతర ప్రాంతాలలో కూడా మనం సంభాషించగలం.


కాబట్టి మాతృభాషలో పట్టు పెంచుకుంటూ, ఇతర భాషలలోనూ పట్టు సాధించడం వలన అనుషంగిక ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగరిత్యా ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, ఇతర భాషలలో మాట్లాడవలసిన అవసరం ఏర్పడుతుంది. ప్రయాణాలలో కూడా ఇతర ప్రాంతాలకు చేరితే, అక్కడ ఇతరులతో సంభాషించడానికి, ఆ ప్రాంతపు భాష అవసరం లేదా జాతీయ భాష అవసరం.


కనుక మాతృభాషతో పాటు జాతీయ భాష హిందీ కూడా వచ్చి ఉండడం వలన దేశంలో ఏ ప్రాంతంలోనైనా ఉద్యోగం నిర్వహించగలుగుతాము. అంతర్జాతీయ భాష ఇంగ్లీషు కూడా మనకు ప్రధానం.


ప్రతి విద్యార్ధికి మూడు భాషలు మన విద్యాబోధనలలో ఉన్నాయి. ఒక్కటి మాతృభాష, రెండు జాతీయ భాష, మూడు అంతర్జాతీయ భాష.


తెలుగు రాష్ట్రాలలో విద్యా బోధనలలో భాషలు



  1. ఒకటవ భాష గా తెలుగు

  2. రెండవ భాషగా హిందీ

  3. మూడవ భాష ఇంగ్లీషు

  4. తర్వాత సబ్జెక్టులు ఉంటాయి.


అలాగే ఇతర భాషలలో కూడా ఒకటవ భాష వారి ప్రాంతపు వాడుక భాష ఉంటే, రెండవ భాషగా హిందీ, మూడవ భాష ఇంగ్లీషు తర్వాతి వరుసలలో సబ్జెక్టులు ఉంటాయి.


అంటే అందరికీ మాతృభాష ప్రధానంగా పట్టు ఉండాలి. తర్వాతి మిగిలిన భాషలలో పట్టు ఉండాలి. సబ్జెక్టులు వచ్చి ఉండాలి అని విద్యాబోధన పద్దతిలోనే కనబడుతుంది.


ధన్యవాదాలు.

మరిన్ని తెలుగురీడ్స్ పోస్టులు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు