By | October 23, 2021

మాతృభావన జీవితాన్ని ఎలా ఉద్ధరిస్తుంది? అందుకు శివాజీనే ఆదర్శంగా చెబుతారు. ప్రతి స్త్రీని కన్నతల్లిగా భావించిన ఆ మహానుబావుడి మాతృభావన వలననే ఛత్రపతి శివాజీని సమాజం నేటికి కీర్తిస్తుంది. కీర్తిగడించడం కన్నా లోకంలో చేసే ఘనకార్యం ఏముంటుంది? అలా కీర్తి గడించినవారికి జన్మినిచ్చిన తల్లి హృదయం పొంగుతుంది. తల్లిని సంతోషపెట్టడం కన్నా సృష్టిలో విశేషమేముంది. పరమాత్మ అయిన శ్రీకృష్ణుడంతటివాడు కూడా అమ్మ సంతోషం కోసం అమ్మ చేత కట్టబడ్డాడు… కాబట్టి తల్లి సంతోషం కన్నా కొడుకు సాధించేదేముంటుంది?

ఛత్రపతి శివాజీ ఎందుకు అంత గొప్పగా కీర్తిస్తున్నాము? అంటే ఆయన ఆచరణలో విన్నది చేసి చూపించాడు. తన తల్లి చెప్పిన మంచి విషయాలు గుర్తు పెట్టుకుని ప్రవర్తించాడు. రాజు తలచుకుంటే చేయలేనిదేముంటుంది? కానీ అటువంటి రాజు విశృంకలంగా ఉండకుండా పరస్త్రీయందు పరదేవతా మూర్తిని దర్శించాడు. అందుకే మంచి మాట చెప్పినవాని కంటే, మంచి మాటను ఆచరించి చూపినవాడిని లోకం కీర్తిస్తుంది. ఎంతకాలం అంటే మంచిమాట అవసరం అయిన ప్రతిసారీ మంచి మాటను ఆచరించి చూపించిన వారినే ఆదర్శంగా చూపుతుంది.

పరస్త్రీని మాతృభావనతో చూడాలని తెలిసి, అలా చూడకుండా పరదేవతా స్వరూపమైన సీతమ్మను కామదృష్టితో చూడబట్టి రావణాసురుడంతడివాడు నశించిపోయాడు. కానీ కలియుగంలో కూడా రాజుగా పుట్టి, రాచరికంలో పెరిగిన బాలుడు మాతృభావనతో ఎదిగాడు. మాతృభావనతో అతని మనసు నిండిపోయింది. కాబట్టి మాతృభావన అతనిని ఉద్దరించింది. లేదంటే అతని కాలంలో జీవించి, కాలంలో గడిచిపోయిన ఎందరో రాజులులాగానే శివాజీ మహరాజ్ కూడా మిగిలిపోయేవాడు… కానీ మాతృభావనతో ఇతర స్త్రీలయందు మాతృత్వమును దర్శించాడు కాబట్టే ఆయన శరీరంతో లేకపోయినా లోకంలో మాతృభావన అంటే శివాజీ మహారాజ్ గుర్తుకు వచ్చే విధంగా మన మనసులోకి చేరుతున్నాడు.

మాతృభావన శివాజీకి ఎలా ఏర్పడింది?

శివాజీకి ఎలా ప్రేరణ కలిగింది ? అని ఆలోచన అనవసరం. శివాజీ స్త్రీలయందు ప్రవర్తించిన ప్రవర్తన వలన అతను పాఠ్య పుస్తకంలో ఒక పాఠ్యాంశముగా ఉన్నాడు. లోకంచేత కీర్తింపబడుతూనే ఉన్నాడు.

జీవితాన్ని ఉద్దరించుకోవడానికే కదా తల్లిదండ్రుల కష్టపడుతూ పిల్లలను పెంచి పోషిస్తారు. లేదంటే వారు పిల్లలు వద్దనుకుంటే స్త్రీకి మరణతుల్యమైన యాతన ఉండదు. జీవితాంతము కష్టపడుతూ ఉండాల్సిన ఆగత్యం తండ్రికి ఉండదు. అయినా వారు తమ జీవితాలను పిల్లల కనడానికి, వారిని పెంచి పోషించడానికి ప్రధాన కారణం జీవితం ఉద్ధరింపబడాలనే ధర్మం గురించే.

పిల్లల జీవితం నలుగురిలో గొప్పగా ఉండాలనే బలమైన కాంక్షతోనే పిల్లలను పెంచి పోషిస్తారు. వారు లేనప్పుడు కూడా పిల్లలు తగు గౌరవంతో సమాజంలో జీవించాలనే కోరుకుంటారు. అలాంటి తల్లిదండ్రులకు ఆనందదాయకమైన కొడుకులే సమాజం చేత కీర్తింపబడతారు.

ప్రధాని కావాలన్న ఆశయం అందరికీ నెరవేరదు. ముఖ్యమంత్రి కావాలన్న ఆశయం అందరికీ నెరవేరదు. అలా కొందరికే పరిమితం అయ్యే పదవులు ఉంటాయి…. కానీ మాతృహృదయంలో ప్రతి కొడుకుకు స్థానం ఉంటుంది. అంటే లోకంలో అందరికీ కామన్ గా ఒక సదాశయం ఉండే అవకాశం ఉంది… అదే తల్లిహృదయంలో మంచి స్థానం. ఎప్పుడు తల్లి సంతోషిస్తుందంటే తనలాంటి స్త్రీకి కూడా తన కొడుకు గౌరవించినప్పుడే… పరస్త్రీయందు తల్లిని దర్శిస్తున్ననాడు, అతడిని కన్నతల్లి మిక్కిలి సంతోషిస్తుంది. ఇంకా అలాంటివారు ఎక్కువగా ఉండడం వలన ప్రకృతి స్వరూపం అయిన స్త్రీ సంతోషంగా జీవించగలుగుతుంది. స్త్రీ సంతోషంగా మనగలగడమే మంచి సమాజం.

మాతృభావన బలమైన ఆశయంగా అందరిలో ఉన్నప్పుడే శివాజీ మాతృభావనకు మనం వారసలుగా ఉండగలం. మాతృభావన జీవితాన్ని ఎలా ఉద్ధరిస్తుంది? శివాజీ మాతృభావనతో ఉంటే ఒక రాజ్యం అంతా సంతోషంగా ఉంది. అలాగే ప్రతి ఒక్కరూ మాతృభావనతో ఉంటే ప్రతి కుటుంబంలోనూ సంతోషాలు పెరుగుతాయి.

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు