By | January 5, 2022

తెలుసుకో తెలుసుకో తెలుగు గొప్పతనం, తెలుగు వాడివైనందుకు గర్వించు అని మన పూర్వీకులు పట్టుబట్టారు. మన పెద్దవారు తెలుగు వారలమైనందుకు ఎంతగానో సంతషించారు కావునా వారు తెలుగులో అద్భుతమైన మాటలు చెప్పగలిగారు.

అలా తెలుగులో అద్భుతమైన మాటలు చెప్పగలిగారు అనడానికి ఉదాహరణ ఎవరంటే శ్రీకృష్ణదేవరాయలు… మన తెలుగు మహనీయుడైన శ్రీకృష్ణదేవరాయలు ఏమని చెప్పారంటే దేశభాషలందు తెలుగులెస్స… ఇలాంటి అద్భుతమైన మాటలే కాదు పద్యాలు పలికిన మహానుభావులు మన తెలుగు పూర్వీకులు.

మన కవులు అందించిన కవిత్వంలోని మాధుర్యం ఆస్వాదించాలంటే, తెలుగు భాషలో పరిజ్ఙానం అవసరం.

హితము చేయు తెలుగు సాహిత్యం రీడ్ చేయడానికి తెలుగు భాష తెలుసుకో

రాముడు, కృష్ణుడు, శివుడు, విష్ణువు, దైవ మూలం తెలుసుకోవాలంటే, అవసరమైన తత్వజ్ఙానం మన మాతృభాషలోని తెలుగు రచనలు రీడ్ చేయడం వలననే సాధ్యం… కాబట్టి తెలుగు తెలుసుకో… తెలుసుకో మన తెలుగు భాష గొప్పతనం.

యోగి వేమన పద్యాలు మన వాడుక భాషలో ఉన్నట్టుగా ఉంటాయి. అందరికీ అర్ధం రీతిలో పద్యాలలో పదాలు ఉంటాయి. కానీ ఆ మాటలలో మనిషి మనసులో ఆలోచనలను సృష్టించగలవు.

ఉప్పుగప్పురంబు న్రొక్కపోలికనుండు
చూడచూడ రుచుల జాడవేరు
పురుషులందు పుణ్య పురుషులువేరయ
విశ్వదాభిరామ వినుర వేమ

చూడటానికి ఉప్పు – కర్పూరము ఒకే రంగులో ఉంటాయి కానీ రుచులు చూడగా వేరుగా ఉంటాయి. అదే తీరున పురుషులలో పుణ్య పురుషులు వేరు… వారి మనసుతో పరిచయం పెరిగితేనే వారి వ్యక్తిత్వం గోచరమవుతుంది…. వేమన తెలుగు పద్యాలలో వ్యక్తి, వ్యక్తిత్వం, వ్యవస్థలో విషయాలపనలు ఎన్నో అంశాలలో ఆలోచనలు రేకెత్తించేవిధంగా పదాలు ఉంటాయి.

తెలుసుకుంటేనే కదా తెలుగు పదాలలోని తత్వం

తెలుగులో తెలుసుకుంటేనే కదా తెలుగు పదాలలోని తత్వం బోధపడేది. మన వాడుక భాషలోని తెలుగు పదాలకు సరిగ్గా అర్ధం తెలియకుండానే కొన్ని తెలుగు పదాలు వాడేస్తూ ఉంటామని అంటారు.

తెలుగువారలమైనందులకు ఆనందించిన మన మహానుభావులు అనేకమంది కవులుగా ఎన్నెన్నో అద్భుత రచనలు చేశారు. తెలుగు భాషలోకి అనువాదాలు చేశారు. మన తెలుగువారికి తత్వం తెలియాలంటే తెలుగు సాహిత్యంలోని ఎందరో రచనలు ఉపయోపడతాయని అంటారు.

ముఖ్యంగా వ్యక్తి జీవనలక్ష్యం అయిన పరమపదం గురించిన తత్వం భక్తిరూపంలో తెలియబడాలంటే భాగవతమే అవసరం అంటారు. అటువంటి భాగవతమును మన మహనీయుడైన బమ్మెర పోతనామాత్యులు సంస్కృతం నుండి తెలుగులో తర్జుమా చేశారు. పోతనామాత్యుడి తెలుగు పద్యాలు మంత్రసమానమని పెద్దలు భావిస్తారు.

తెలుసుకో తెలుగు గొప్పతనం తెలుగు వాడివైనందుకు తెలుగు గురించి మరింతగా

వ్యక్తిగా ఆచరణలో శ్రీరాముడిని ఆదర్శప్రాయుడు అని అంటారు. అటువంటి శ్రీరామడు గురించి తెలియబడే శ్రీరామాయణం వచనం చదవడానికి తెలుగు చదవడం వచ్చి ఉంటేనే కదా పురాణ పురుషుడి మనోగతం పుస్తక రూపం నుండి మన మనసులోకి చేరేది.

ఒక వ్యక్తికి కర్తవ్య బోధ చేయడంలోనూ, జీవన్ముక్తి జ్ఙానం అందించడంలో ప్రధమంగా కనబడే గ్రంధం భగవద్గీత… తెలుగు తెలిసి ఉంటే కదా భగవద్గీతలో భగవానుడు బోధించిన విజ్ఙానం తెలియబడేది. విషయ పరిజ్ఙానం తెలుసుకోవడానికి విషయాలు మనసు నుండి వేరు బడటానికి భగవద్గీత ఒక గొప్ప గ్రంధమని చెప్పబడుతుంది.

మనిషి శరీరం అలసినప్పుడు మనసు విశ్రాంతికి త్వరగా ఉపక్రమిస్తుంది. మనిషి శరీరానికి పని తక్కువ ఉంటే, అలుపు లేని మనసు ఆలోచనల్లో అదుపు తప్పితే, అది అశాంతితో చెలిమి చేస్తుంది. అటువంటి మనసుపై నియంత్రణ రావాలంటే మాత్రం మన తెలుగులో ఉండే తాత్విక పరిజ్ఙానమే మందు అంటారు. అటువంటి భక్తి, జ్ఙాన, వైరాగ్య జ్ఙానము మన తెలుగు పుస్తకాలలో ఇమిడి ఉంటే, వాటిని చదివి అవగాహన చేసుకోవడానికి తెలుగు భాషలో పరిజ్ఙానం అవసరమే కదా….

తెలుగు వాడివైనందుకు తెలుగు భాషలో మరింత పట్టు పెంచుకో

ఇంగ్లీషు భాష మాట్లాడడం వలన సమాజంలో మెరుగైన ఉపాధి పొందవచ్చును. మాథ్స్ బాగా నేర్చుకోవడం వలన మంచి ఉపాధి పొందవచ్చును. అలాగే ఇతర సబ్జెక్టులలో మంచి పరిజ్ఙానం పెంచుకోవడం వలన మంచి ఉపాధి అవకాశాలు పెరగవచ్చును. కానీ మన వాడుక భాష మరియు మాతృభాష అయిన తెలుగు పుట్టినప్పటి నుండి మనతో ఉంది. దానిలో పరిజ్ఙానం పెంపొందించుకుంటే, అవగాహన ఏర్పరచుకోవడం మనసుకు మరింత సులభదాయకంగా ఉంటుంది.

తెలుసుకో తెలుగు గొప్పతనం తెలుగు వాడివైనందుకు తెలుగు భాషలో మరింతగా పట్టు పెంచుకో… మన పూర్వీకులు మనకోసం అందించిన జ్ఙానమంతా పుస్తకరూపంలో ఉంటే, అది ఆన్ లైన్లో అందరికీ అందుబాటులో ఉంటుంది. తెలుగు పుస్తకాలు రీడ్ చేసి పరిజ్ఙానం పెంపొందించుకోవడానికి తెలుగు భాషలో పట్టు పెంచుకో… అవసరమైన విజ్ఙానం తెలుగు పుస్తకాలలో లభిస్తుంది.

మరిన్ని తెలుగురీడ్స్ పోస్టులు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు