By | July 5, 2022
తెలుగు భాషలో ప్రకృతి మీద వ్యాసం! పంచభూతాల ఆధారంగా ప్రకృతి సహజంగా సాదారణ పరిస్థితులలో ఉన్నంతకాలం, మనిషి మనుగడ ప్రశాంతంగా సాగుతుంది. ఎందుకంటే మనిషి శరీరం కూడా పంచభూతాత్మకమైనదిగా చెప్పబడుతుంది. ఇంకా మనసు కూడా ప్రకృతి పరిస్థితిని బట్టి భావన పొందుతుంది. ప్రకృతి మనిషి మనసుపై ప్రభావం చూపుతుంది. అలాగే మనిషి చేష్టలు కూడా ప్రకృతిపై ప్రభావం చూపుతూ ఉంటాయి. రెండు సాదారణ స్థితిలో ఉన్నంతకాలం ప్రకృతి పర్యావరణం సహజంగానే ఉంటుంది. అసాధారణ పరిస్థితులలో ప్రకృతి వలన మనిషికి నష్టం కలుగుతుంది. అలాగే మనిషి అసాధారణ పనుల వలన ప్రకృతికి నష్టం కలుగుతుంది. కాబట్టి ప్రకృతి గురించి ప్రకృతిలో భాగమైన ప్రతివారికి అవగాహన అవసరం.

తెలుగు భాషలో ప్రకృతి మీద వ్యాసం

అనేక జీవరాశులు ప్రకృతి వలన పోషించబడుతూ ఉంటాయి. అనేక వృక్షజాతి చెట్లు, మొక్కలు భూమిపై పెరుగుతూ ఉంటాయి.  చాలా నదులు తమ జలాలతో ప్రవాహాలుగా భూమిపై ప్రవహిస్తాయి… సహజంగా ప్రకృతిలో నివసించే జీవరాశలు, భూమిపై కేవలం తమ ఆహారం కోసం జీవిస్తూ ఉంటాయి. చర జీవులు ఆహారం అందించే అడవులు, చెట్లు, జంతువులు… ఇలా ఒక తరహా జీవ రాశి మరొక తరహా జీవరాశిపై ఆధారపడుతూ ఉంటాయి. ప్రకృతిలో మనిషి కూడా తన ఆహార సముపార్జనకు ప్రకృతిలో లభించే వివిధ వనరులను వినియోగించుకుంటూ ఉంటాడు. ఇతర జీవరాశులు ఆకలి వేసినప్పుడు మాత్రం తమ ఆహార సముపార్జనకు ప్రయత్నిస్తే, మనిషి తన ఆహారం కోసం ఆహార నిల్వకూడా చేసుకోగలుగుతాడు. భవిష్యత్తు అవసరాలకు ప్రకృతిని ఉపయోగించుకుంటూ, ప్రకృతికి హాని తలపెట్టకుండా, తనకు అవసరమైన ఆహార నిల్వలను పెంచుకుంటూ ఉంటాడు. అలా మనిషి కూడా ప్రకృతిలో భాగమై ఉంటాడు. ఇంకా ప్రకృతిలో లభించే చెట్ల వలన మనిషి తనకు అవసరమైన నివాస గృహములను నిర్మించుకోగలడు. ఇలా మనిషి నిత్య జీవనంలో ఉపయోగపడే అనేక వస్తు సంపద అంతా ప్రకృతి ప్రసాదించిన వనరులను ఉపయోగించుకుని రూపొందించబడినవే. మనిషి తన మనుగడకు అవసరమైన అనేక విషయాలలో ప్రకృతిని తనకు కావాల్సిన విధంగా మార్చుకునే తెలివిని కలిగి ఉంటాడు.

సహజమై పర్యావరణ పరిస్థితులు మనిషి మనుగడకు అనుకూలం – తెలుగు భాషలో ప్రకృతి మీద వ్యాసం

మానవ మనుగడకు ఆధారమైన ప్రకృతి, మనిషి మనుగడ ప్రశాంతంగా సాగాలంటే, ప్రకృతి పర్యావరణ పరిస్థితులు సాధారణ స్థితిలోనే ఉండాలి. అంటే వానలు అతిగా కురిస్తే, మనిషి జీవనానికి ఆటంకం కలుగుతుంది. అధిక ఎండలు కాసిన ప్రకృతిలో మనిషికి అనేక ఇబ్బందులు తలెత్తుతాయి. అలాగే అగ్ని మంటలు చెలరేగితే ప్రకృతిలో మనిషి మనుగడ అసాధ్యం…. ఇలా గాలి, నీరు, నిప్పు… ఏది అధికమైనా… ఆస్థితిని మనిషి శరీరం తట్టుకోవడం దుర్లభం… అనేక ప్రాణాలు కోల్పోయే స్థితి కూడా ప్రకృతిలో అసాధారణ పరిస్థితులు ఏర్పడినప్పుడు కలుగుతుంది. భూమి పరిశుభ్రంగా ఉండడం వలన పరిశుభ్రమైన నీరు భూమిపై ప్రవహించే అవకాశం ఉంటుంది. అలాగే గాలి కూడా స్వచ్ఛంగా ఉండే అవకాశం ఉంటుంది. గాలి – నీరు ఎంత శుభ్రంగా ఉంటే, మనిషి సహజంగా అంతటి ఆరోగ్యవంతుడుగా ఉండగలడు అంటారు. కావునా ప్రకృతిని గురించి మనిషి అవగాహన ఏర్పరచుకోవాలి. ప్రకృతి ఎంత సహజంగా ఉంటే, అంత మేలు మానవాళికి కలుగుతుందని ప్రతి ఒక్కరు గుర్తించాలి. చెట్లు ఎక్కువగా ఉండడం వలన ప్రకృతిలో ఆక్సిజన్ శాతం బాగుంటుంది. ఆక్సిజన్ శాతం బాగుంటే, మనిషికి ఆరోగ్యదాయకం అంటారు. ఇలా ప్రకృతి ఎంత సహజంగా ఉంటే, అంతటి ప్రయోజనం మనిషి పొందగలడు.

ప్రకృతి మనిషికి ఆహారమే కాదు ప్రశాంతతను కూడా పంచుతుంది.

కేవలం ఒక్క ఆహారమే కాదు. పరిశీలిస్తే మనిషికి అందమైన ప్రకృతి ఎంతో ప్రశాంతతను కూడా ఇస్తుంది. అనేక ప్రదేశాలలో ఉండే కొండలు, కొండలు మద్య ఉండే చెట్లు, ప్రవాహాలు… ప్రకృతి అందాలు ఆస్వాదించే మనసుకు శాంతి చేకూరుతుందని అంటారు. ఇలా ప్రకృతి సహజంగా ఉండడం చేత మనిషి అనేక విధాలుగా శ్రేయస్సును పొందగలడు. అదే ప్రకృతిని అసహజంగా మారిస్తే, మనిషే మనిషి మనుగడకు చేటు చేసినవాడవుతాడని అంటారు. తెలుగు భాషలో ప్రకృతి మీద వ్యాసం ధన్యవాదాలు.

మరిన్ని తెలుగురీడ్స్ పోస్టులు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం? జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు? దానం గురించి దానం గొప్పతనం సన్మాన పత్రం ఇన్ తెలుగు వేచి ఉండడాన్ని నిర్వచించండి పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి? పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి? అవతారం అర్థం ఏమిటి తెలుగులో తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు లీడర్ అంటే ఎలా ఉండాలి ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి? ప్రేరణ తెలుగు పదము అర్ధము గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి? నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు