తెలుగు సినిమాల ప్రభావం తెలుగు

తెలుగు సినిమాల ప్రభావం తెలుగు సమాజంపైన పడుతుందా? అవుననే అంటారు. ఎందుకంటే ఒకప్పుడు హిట్ సినిమాను బట్టి, ఆ సినిమా చీరలు అని అమ్మకాలు కొనసాగించేవారు.

అంటే పెళ్లిసందడి సినిమా సూపర్ హిట్ అయ్యింది… ఆ తురువాత బట్టల షాపులలో పెళ్ళిసందడి చీరలు అంటే అమ్మకాలు ఎక్కువగా ఉండేవి… అదేవిధంగా తెలుగు సినిమా హీరోల స్టైల్ కూడా యువతపై ప్రభావం చూపుతుంది.

మన తెలుగు సినిమాల కధలు సమాజంలో ఎదో ఒక మూల జరిగిన సంఘటన ఆధారంగా లేక రచయిత మైండులో పుట్టిన ఆలోచన ఆధారంగా కావచ్చు.

కాని ఆయా తెలుగు సినిమాల ప్రభావం మొత్తం తెలుగు సమాజంపై ఉంటుంది.

ఎక్కువ అభిమానులు కలిగిన హీరో సినిమా అయితే, ఎక్కువమంది యువకులపై ప్రభావం చూపుతుంది.

ఏమిటి? ఈ తెలుగు సినిమాల ప్రభావం తెలుగు సమాజం పైన…

అంటే ఆలోచనా ధోరణిలోకి సినిమాలలో ఉండే విషయాలు వచ్చి చేరతాయి.

ఎలాంటి విషయాలు ఆలోచన ధోరణికి దగ్గరవుతాయి? అంటే కధానాయకుడు వేష ధారణ యువకులలో అనుసరించాలనే ఆసక్తిని పెంచవచ్చు.

అలాగే కధానాయిక యొక్క వేషధారణ కు యువత మనసులో మెదులుతూ ఉంటుంది.

ఇంకా మాటల ప్రభావం కూడా ఉండవచ్చు. అంటే సినిమాలో నాయకా నాయికలు మాట్లాడే భాషా శైలి యువతను ఆకట్టుకుంటే, అటువంటి శైలిని యువత అనుసరించడానికి ఆసక్తి కనబరచవచ్చు.

ఇలా తెలుగు సినిమాల వలన వేషధారణ, మాటతీరు తెలుగు సమాజంపై పడే అవకాశం ఉంటే, ఇంకా సినిమా కధలో చేయవచ్చు, చేయకూడదు అనే పనులపైన కూడా సినిమా ప్రభావం ఉండవచ్చు.

సమాజంలో ఎదో ఒక ప్రాంతంలో ఏదైనా వింత ప్రవర్తన ఉన్న వ్యక్తి ఉంటే, అటువంటి వ్యక్తి కధను సినిమాగా మరల్చడం ద్వారా ఆయా ప్రాంతీయ పోకడ మొత్తం సమాజానికే తెలియబడుతుంది.

ఒక దర్శకుడి వినూత్న ఆలోచన సినిమాగా వచ్చినా ఆ ఆలోచన కూడా యువత మైండులో మెదులుతుంది.

ఇలా కొందరి ఆలోచనా సృష్టి, సమాజంలో యువతపైన ప్రభావం చూపించే అవకాశం సినిమాల వలన ఎక్కువగా ఉండవచ్చు.

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *