By | January 28, 2022

త్యాగం గొప్పతనం ఏమిటి వివరించండి. త్యాగం అంటే తన దగ్గర ఉన్నదానిని ఫలితం ఆశించకుండా ఇచ్చేయడమే… లేదా ఖర్చు చేయడమే. త్యాగమూర్తుల త్యాగ ఫలితం భవిష్యత్తు తరం కూడా అనుభవిస్తుంది.

సాయం ఒకరికే ఉపయుక్తం కావచ్చును… కానీ త్యాగ ఫలితాలు మాత్రం ఒక తరానికి లేదా కొన్ని తరాలకు సమాజంలో ఉపయోగపడుతూనే ఉంటాయని అంటారు.

ధనవంతుడు తన దగ్గర ఉన్న ధనంలో కొంత ధనం ఇతరులకు అందిస్తే, అది సాయం అవుతుంది. అదే తన దగ్గర ఉన్న ధనమంతా ఒక సామాజిక శ్రేయస్సు కొరకు ఇచ్చేస్తే, అది త్యాగం అవుతుంది. అలా ఒక వ్యక్తి దగ్గర తనకున్నదంతా మరొకరికి ఉపకారం జరగడం కోసమో లేదా సమాజానికి మేలు జరగడం కోసమో ఇచ్చేస్తే అది త్యాగంగా గుర్తింపబడుతుంది.

పొట్టి శ్రీరాములు ప్రత్యేక ఆంధ్ర కొరకు నిరవధిక దీక్ష జరిపి ప్రాణత్యాగం చేశారు. ఈయన తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కాలవాలంటూ నినదించి, ప్రాణం పోయేవరకు తపించారు… అయన త్యాగఫలితం తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం.

భరతమాత దాస్య సంకెళ్లు విచ్ఛిన్న చేయడానికి ఎందరో దేశభక్తులు తమ జీవితమంతా దేశ స్వాతంత్ర్య సమరానికి ధారపోశారు… అలా మనదేశంలో అనేక మంది త్యాగమూర్తుల ఫలితం నేడు మన సామాజిక పరిస్థితి… మనదేశంలో అనేక మంది తమ జీవితాలను త్యాగం చేయడం వలన వారు చిరస్మరణీయులుగా మారారు.

అంటే ఒక మనిషి తనదగ్గర ఉన్న ధనం, జీవితం, కాలం ఏదైనా ఒక సామాజిక ప్రయోజనార్ధం పూర్తిగా ఖర్చు చేస్తే, దాని ఫలితం భవిష్యత్తు సమాజం గుర్తు పెట్టుకుంటుంది. గొప్పగా చెప్పుకుంటుంది. త్యాగ ఫలితం త్యాగం చేసినవారు ఆశించరు… తమ భవిష్యత్తు తరం పొందాలనే తపనతో త్యాగం చేస్తారు. అటువంటి త్యాగ గుణం ఉండడం చాలా గొప్పవిషయం.

కాబట్టి త్యాగం చాలా గొప్పది. త్యాగం చేసేవారు ఏమి ఆశించకుండా ఉండడం చేత కొన్ని సామాజిక ప్రయోజనాలు కలిగితే, అటువంటి ప్రయోజనాలు సమాజంలో ఉన్నవారందరికీ లభిస్తాయి… కావునా త్యాగం గొప్పతనం అంటే భవిష్యత్తులో కూడా అది ప్రయోజనాలనే అందిస్తుంది….

వ్యక్తి వ్యక్తిగత శ్రేయస్సు కొరకు పాటుపడతాడు… అతను వ్యక్తిగతంగా సమాజంలో మంచి గుర్తింపు పొందుతాడు… కానీ సామాజిక ప్రయోజనాల కోసం నిత్య పాటుపడేవారి త్యాగం చాలా విలువైనది… భవిష్యత్తు తరం కూడా ఆ త్యాగఫలితం అనుభవించగలదు…

త్యాగం విషయంలో అమ్మనాన్నలను మించిన ఆదర్శవంతులు ఉండరు. వారు తమ పిల్లల కోసం తమ సుఖాలను త్యాగం చేస్తూ, పిల్లల వృద్దిని కాంక్షిస్తూ ఉంటారు.


మరిన్ని తెలుగురీడ్స్ పోస్టులు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు