By | November 21, 2021

వెలకట్టలేని ఓటు విలువ తెలుసుకో! ఓటు వేయడం అంటే, ప్రజలు తమకు నచ్చిన అభిమాన నాయకుడిని గెలిపించడమే కాదు తమ తమ సంస్తృతి సంప్రదాయాలపై ప్రభావం చూపుతూ, సామాజిక భవిష్యత్తుని శాసించే అధికారాన్ని కొందరికి అప్పగించడమే అవుతుంది.

కష్టం చేసి కుటుంబాన్ని పోషించే కార్మికుడు కానీ శ్రామికుడు కానీ ఉద్యోగి కానీ అధికారి కానీ నిర్వహణాధికారి కానీ ఎవరైనా సమాజంలో భాగమే… అందరికీ ఓటు ఉంటుంది. అందరూ తమ కుటుంబ సభ్యుల కోసమే సంపాదించడానికి వివిధ వృత్తులు లేక ఉద్యోగాలు చేస్తూ ఉంటారు.

అటువంటి సమాజంలో ఉంటూ, ప్రజలు తమను తాము కాపాడుకుంటూ, తమ పిల్లలకు విద్యాబుద్దులు నేర్పుతున్నామంటే, అటువంటి సమాజాన్ని పూర్వికులు అందించినదే… ఇంతకుముందు తరం వారు ఓటు వేసి గెలిపించిన ప్రభుత్వాలే సమాజాన్ని నిర్ధేశిస్తూ వస్తుంటే, కుల మత సంప్రదాయాలు ఈ సమాజంలో భాగమై ప్రజలపై ప్రభావం చూపుతాయి.

అంటే ప్రజలు తమ ముందు తరానికి ఎటువంటి భవిష్యత్తు మార్గం అందించబోయేది…. వారు ఓట్లు వేసి గెలిపించిన ప్రభుత్వాలు చేసే చట్టాలకు అనుగుణంగా ఉంటే, వారు ఓట్లు వేసి గెలిపించిన ప్రతిభావంతమైన నాయకుడు ఆ చట్టాల రూపకల్పనకు దిశా నిర్దేశకుడు అవుతాడు. అలాంటి నాయకుడుని ఎంచుకునే పరమ పవిత్రమైన ఓటుకు వెలకట్టడం అంటే అది అమోదయోగ్యం కాదు.

కాసేపు ప్రజలతో మమేకం అయ్యి మాట్లాడడం నాయకుడికి ఎంత ముఖ్య లక్షణమో సామాజిక సమస్యలపై సరైన అవగాహన కలిగి ఉండడంతో బాటు, భవిష్యత్తులో సామాజిక అభివృద్దిపై సరైన అవగాహన కలిగి ఉండాలని అంటారు. అప్పుడే ప్రజలకు ఎంచుకున్న ప్రభుత్వం రాబోయే తరానికి ఇప్పటి సమాజాన్ని రక్షిస్తూ, ఇంకా మంచి సమాజాన్ని నిర్మించడంలో విజయవంతం కాగలదు.

వెలకట్టలేని ఓటు విలువ రాబోయే తరం యొక్క భవిష్యత్తు

ఓటరు తమ ఓటును వినియోగించుకుని ఓటు వేయడం అంటే, తమ ప్రాంతపు భవిష్యత్తును ఒక నాయకుడి చేతిలో పెట్టడమే.

వెలకట్టలేని ఓటు విలువ తెలుసుకో
వెలకట్టలేని ఓటు విలువ తెలుసుకో

ఇంట్లో నలుగురు పిల్లలు ఉంటే, మంచి చెడు ఆలోచన చేసి మిగిలినవారితో కలిసి మెలిసి ఉండే పిల్లవానికే బాద్యతను అప్పగిస్తారు… కానీ అవగాహనా రాహిత్యంతో మదనపడే పిల్లవాడికి బాద్యత అప్పగించరు…

ఇంట్లో పిల్లలను జాగ్రత్తగా గమనించే శక్తి కలిగిన పిల్లవానికే మిగిలిన పిల్లల బాధ్యతను అప్పగిస్తారు. అలాగే సమాజం యొక్క బాగోగులు ఎరిగినవారికే విజ్ఙులు బాద్యతలు అప్పగిస్తారని అంటారు.

ఓటు విలువ అంతా… ఇంతా… అని వెలకట్టరాదు… ఓటు ఒక వ్యక్తికి అధికారం అప్పగించబడే ఆయుధం. ఓటు ఒక ప్రభుత్వం యొక్క భవిష్యత్తుని నిర్ధేశిస్తుంది. ప్రభుత్వాలు సమాజాన్ని ప్రభావితం చేయగలవని అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఎటువంటి ప్రభుత్వాల మనుగడకు ఓటరు ప్రాముఖ్యత ఇస్తున్నారో… అటువంటి ప్రభుత్వాల ప్రభావం సమాజాన్ని శాసిస్తుంది…

అభివృద్ది ప్రాతిపదికన ఓటు వేయడం విజ్ఙుల లక్షణంగా చెప్పబడుతుంటే, అటువంటి అభివృద్దిని చేసి చూపించడం రాజకీయ పార్టీల బాధ్యత.

సామాజిక అభివృద్ది, వ్యక్తి సామాజిక భద్రత, వ్యక్తి హక్కులకు రక్షణ కల్పించే వ్యవస్థలపై పట్టు ఉండే ప్రభుత్వాలు ఓటరు ఓటు వేయడం వలననే ఏర్పడుతూ ఉంటాయి. ఒక ప్రభుత్వం మారుతుంది అంటే ఓటరు నిర్ణయం మారింది అంటారు. ఓటరు నిర్ణయం ఎందుకు మార్చుకున్నారు? అని ఎవరు ప్రశ్నించరు? ఆలోచిస్తారు….

ఓటరు ఆశించినట్టే పధక రచన చేస్తూ మరలా ఓటరు ముందుకు రావడం రాజకీయ పార్టీలకు పరిపాటి అయితే, తమ నిర్ణయం వలన సామాజిక అభివృద్ది ఏం జరిగింది? అనేది ఓటరు వేసుకోవలసిన ప్రశ్నగా పరిగణించబడుతుంది. ఆప్రశ్న వేసుకోకుండా కేవలం ఒక ఆవేశపూరిత నిర్ణయంగా ఓటు వేయడం అంటే అది తమ తమ ముందు తరాలకు ఎటువంటి భవిష్యత్తు అందుతుందో? తెలియదు.

నిరక్షరాస్యత ఉన్న చోట మాట చేతనే విషయం మనసుకు తెలియబడుతుంది… అక్షరాలలో దాగిన మర్మమేమిటో తెలియబడదు. కాబట్టి అక్షరాస్యులు మాత్రం ఓటు గురించి, ఓటు విలువ గురించి అందరికీ తెలియజేయాల్సిన బాద్యత ఉంటుంది.

వ్యక్తిని చూసి ఓటు వేయడం తప్పుకాదు. వ్యక్తి చెప్పే మాటలు నమ్మడం తప్పుకాదు. కానీ ప్రలోభాలకు లొంగి ఓటు వేయడం మాత్రం తప్పుగానే పరిగణిస్తారు.

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు