By | October 14, 2021
చదువు గొప్పతనం గురించి వ్యాసం ఎందుకు చదువుకోవాలి

చదువు గొప్పతనం గురించి వ్యాసం ఎందుకు చదువుకోవాలి చదవడం కోసం చదువుకోవాలి. ఇప్పుడు పుస్తకం చదవాలంటే చదువు ఉండాలి. ఊరిపేరు చదవాలంటే, చదువు ఉండాలి. ఒక వ్యక్తి వ్రాసిన పుస్తకం చదవాలంటే, చదువుకోవాలి. ఏదైనా ఒక విషయం గురించి అవగాహన రావాలంటే, చదువుకోవాలి. అక్షర రూపంలో ఉండే వివిధ విషయాలు తెలుసుకోవాలంటే, చదువు రావాలి. చదువుకోవాలి.

అక్షరరూపంలో నిక్షిప్తమైన విషయాన్ని అర్ధం చేసుకోవాలంటే, చదువు తప్పనిసరి. లేకపోతే అనేక విజ్ఙాన విషయాలు ఇతరులతో చెప్పించుకోవాలిన స్థితి వస్తుంది.

నేటి సాంకేతిక ప్రపంచంలో విద్య ఆవశ్యకత చాలా ఉంది. కేవలం పని చేసే విధానంతో ఉండే పనులు కన్నా కొత్త తరహా పనులు పుట్టుకొస్తున్నాయి. ఏదో ఒక పనిలో సామర్ధ్యంతో బాటు అనుషంగికంగా ఇతర పనులలో నైపుణ్యత అవసరం అవుతుంది. చదువు వలననే రకరకాల పనులలో విధానం తెలుసుకుని వాటిని సాధన చేసే ప్రయత్నం చేయవచ్చును. అంతే కాకుండా వృత్తులలో కూడా విద్యను అభ్యసించాలి. ఇంకా వ్యవసాయం కూడా ఆధునిక పద్దతులను అనుసరించడం వలన వ్యవసాయ శాస్త్రంలో కూడా చదువు ఆవశ్యకత ఉంది.చదువుకోకపోవడం వలన, వ్రాయబడిన చదివే అవకాశం ఉండదు. ఒక పనిలో మంచి నైపుణ్యం ఉన్నా, దానికి చదువు కూడా తోడైతే, ఆ పని ద్వారా మంచి ఆదాయం పొందవచ్చును. పని నైపుణ్యం చక్కగా ఉన్నాసరే, తగినంత చదువు లేకపోతే, ఆ పనిద్వారా అతని ఆదాయం పరిమితంగానే ఉంటుంది.

చదువుకోవడం వలన కలిగే ప్రయోజనాలు?

1. చదువు జీవితాలపై ప్రభావం చూపుతుంది.


2. వ్యక్తి యొక్క ఆర్ధిక పరిస్థితిని చదువు మార్చగలదు.


3. వ్యక్తి ఆత్మవిశ్వాసం చదువు వలన మరింత బలపడుతుంది.


4. పర్సనాలిటీ డవలప్ మెంట్ చదువు వలన చక్కగా మారగలదు.


5. గొప్పవారి జీవిత చరిత్రలు అక్షరజ్ఙానం ఉంటేనే చదవగలం. మంచి పుస్తకాలు చదవడానికి కూడా అక్షరజ్ఙానం తెలిసి ఉండాలి.


6. చదువుకున్న తల్లిదండ్రుల వలన పిల్లలకు మరింత ప్రయోజనం చేకూరుతుంది.


7. చదువుకోవడం వలన విషయాలను తెలుసుకోగలం. కొత్త విషయాలను కనిపెట్టగలం.


8. సమాజంలో పలు విషయాలపై అవగాహన, పరిశీలన చదువు వలన మరింత వృద్ది చెందగలదు.


9. చదువుకుని ఉండడం వలన వివిధ విషయాలలో చారిత్రకతను తెలుసుకోవచ్చును.


10. పరిశోధనాత్మవి విషయ పరిజ్ఙానం పెంపొందించుకోవడానికి చదుకోవడం ప్రధానం.


పలు విషయాలలో పలు రంగాలలో కొలువులు సంపాదించుకోవడానికి చదువు ఎంతో అవసరం. జీవనోపాధి విషయంలో చదువుకోవడం వలన కలిగే ప్రయోజనాలు ఎక్కువ.

ఏ రంగంలోనైనా చదువు గొప్పతనం గురించి వ్యాసం

భోజనం పెట్టే హోటల్స్ కు కూడా ఒక విద్యా విధానం ఉంది. అలా అన్ని రంగాలలోనూ ఒక విద్యా విధానం ఏర్పడి విద్య కొత్త పుంతలు తొక్కుతుంది. కావునా రంగం ఏదైనా విద్యాభ్యాసం చేసి తగిన పట్టా పుచ్చుకుని ఉండాల్సిన ఆవశ్యకత నేటి సమాజంలో ఉంది.

పాలు ఇచ్చే గేదెల పెంపకం, కోళ్ల పెంపకం, అవుల పెంపకం అంటూ పశువుల పెంపకం పెద్దల దగ్గర చేరి తెలుసుకునే పూర్వపు రోజుల నుండి పుస్తకాలు చదివి తెలుసుకునే రోజులలో విద్య ఆవశ్యకత చాలా ఉంటుందని అంటారు.

అలాంటి చాలా పనులు పెద్దల దగ్గర నుండి నేర్చుకునే రోజులు మారి సాంకేతికత పరికరాల సాయంతోనో, పుస్తకం సాయంతోనో తెలుసుకునే రోజులు రావడం చేత చదువు అందరికీ అవసరం… మున్ముందు అక్షరజ్ఙానం లేకుండా మనగలగడం కష్టమే అంటారు.

చదువు గొప్పతనం గురించి వ్యాసం

సమాజంలో గుర్తింపు గలిగిన అధికారిగా వ్యక్తి మారాలంటే, దానికి విద్య ఎంతగానో తోడ్పడుతుంది. బాల్యం నుండి మంచి ఉత్తీర్ణత సాధించిన విద్యార్ధి, యవ్యనంలో కూడా అదే ఉత్తీర్ణత పరీక్షలలో సాధిస్తే మాత్రం సమాజంలో గుర్తింపు పొందే అధికారిగా మారగలడు. ఇందుకు విద్యే ప్రధాన సాధనం.

నేర్చుకునే వయసులో తెలుసుకోవాలసిన విషయసారాన్ని అర్ధించేవాడు విద్యార్ధి అయితే తెలియజేసేవారు గురువు అంటారు.

ప్రయాణంలో దారి తెలిసినవారు మరొకరికి దారి తెలియజేయగలరు. దారి తెలియనివారు దారి తెలిసినవారిని అనుసరించాల్సి ఉంటుంది. తెలియనితనం అయోమయానికి గురయ్యే అవకాశం ఉంటుంది. ప్రయాణం చేసేటప్పుడు దారి తెలిసి ఉండుట ప్రధానం. అలాగే జీవనపు ప్రయాణంలో కూడా తమ జీవితపు లక్ష్యం తెలిసి ఉండాలి. జీవితంలో సాధనకు కావాల్సిన జ్ఙానం సముపార్జించుకుని జీవన ప్రయాణం మొదలు పెట్టాలని అంటారు. నేర్చుకునే వయస్సులో విద్యను ఆర్జించడమే ప్రధానం అంటారు.

విషయాలపై సరైన అవగాహన కలిగి ఉండుట వలన విషయ విజ్ఙానం కలిగి ఉంటారు. విషయ విజ్ఙానం బాల్యం నుండి చదువులలో తెలియజేయబడుతూ ఉంటుంది. ఎవరు ఏ విషయంలో నైపుణ్యం సాధిస్తే అదే జీవనాధారం అవుతుంది. కొందరు తెలుగులో నైపుణ్యం సంపాదిస్తే తెలుగు టీచర్ కావచ్చు. ఒకరు మ్యాథ్స్ లో అయే మ్యాథ్స్ టీచర్ కావచ్చు… లేదా సంబంధిత కోర్సులు నేర్చుకుని మరొక రంగంలో ఉన్నత స్థానం పొందవచ్చును. విషయ పరిజ్ఙానం ప్రధానంగా ఉండాలి.

చదువుకోవడం వలన విషయ పరిజ్ఙానం పెరుగుతుంది

విషయ విజ్ఙానం పొందుపరిచిన పుస్తకాలు చదువుకోవడం వలన వాటిలోని విషయ పరిజ్ఙానం పెరుగుతుంది. సోషల్ సబ్జెక్టులో పరిజ్ఙానం పెంపొందించుకుంటూ, సామాజిక పరిస్థితుల గురించి తెలుసుకుంటూ, సామాజిక సమస్యలను గుర్తిస్తూ… విద్యార్ధి దశ సాగితే, ఆ తర్వాత అతను సామాజికపరమైన రంగంలో మంచి స్థానానికి వెళ్ళగలడు.

విషయ పరిజ్ఙానం తెలిసి ఉండుట వలన సామాజిక పరిస్థితులను బట్టి విషయావగాహన ఏర్పరచుకోవచ్చును. విద్య ద్వారా విషయ పరిజ్ఙానం పెంపొందించుకోవాలి. అంటే నేర్చుకునే వయస్సులో చదువుకోవాలి. చదువుతున్న వయస్సులో విషయాలపై సరైన అవగాహన కల్పించుకుంటూ, ఆసక్తి ఉన్న విషయంలో మరింత పరిజ్ఙానం పెంపొందించుకోవాలి. దీని వలన ఆసక్తి కలిగిన విషయసారమే ఆర్ధిక వనరు కాగలదు.

నేటి సాంకేతకత అవసరాలు పెరుగుతున్న నేపధ్యంలో విద్య లేనివారు అయోమయ అవస్థలో జీవించవలసి ఉండవచ్చును. కారణం అన్నింటిలోనూ అక్షరజ్ఙానం అవసరం అవుతుంది. ఇంకా విషయ పరిజ్ఙానం అవసరం.

విషయ పరిజ్ఙానంతో బాటు అక్షరజ్ఙానం ఉంటేనే, ఏం జరుగుతుందో? ఏం చేస్తున్నామో? ఒక అవగాహన కలిగి ఉంటాము. కావునా నేడు విద్య చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది.చదువుకుని ఉండడం వలన మన స్మార్ట్ ఫోను పూర్తిస్థాయిలో మనమే వాడవచ్చును. స్మార్ట్ ఫోన్ వంటి వస్తువులను పూర్తి స్థాయిలో వాడడానికి చదువు ఉంటేనే సాధ్యం.

చదువు వలన సంస్కారం, వినయం, విధేయత, విషయంపై అవగాహన ఎన్నో విద్యార్ధికి లభిస్తాయి. కనుక బాల్యం నుండి ప్రతిఒక్కరు చదువుకోవడం ముఖ్యం.

యువత పెడద్రోవ పట్టకుండా ఉండడానికి ఇటువంటి ప్రదర్శనలు గల చిత్రాలు ఉండరాదు.

ఆసక్తిని బట్టి వార్తలు వస్తున్నాయా?

నేటి నీ కృషి రేపటికి నీకు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఎవరు?

అబద్దం చెప్పిన వారి విలువను తగ్గిస్తుంది?

అభివృద్దికి ఆటంకాలు అంటే ఏవి?

అసత్య ప్రచారాలు వాస్తవాలు గురించి

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు