మంచి మాటలు విద్యార్థులకు ప్రేరణను అందిస్తాయి. అవి వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచి, సానుకూల దృక్పథాన్ని కలిగిస్తాయి. చదువుకునే వయస్సులో మంచి మాటలు విద్యార్ధుల మనసులలో బాగు నాటుకుంటాయని అంటారు. ఎప్పుడైనా ఎక్కడైనా పెద్దవారు పిల్లలకు మేలు చేసే మాటలే చెబుతారు. మంచి మాటలు వినడం వలన మానవత్వం, నైతిక విలువలు, సమాజంలో ఎలా ప్రవర్తించాలో వంటి అంశాలపై అవగాహన పెరుగుతుంది. కావునా అనుభవజ్ఙులు చెప్పే మంచి మాటలు వింటూ ఉండాలి.
మంచి మాటలు వినడంలో ఆసక్తి చూపడం వలన మంచి అలవాట్లకు పునాది పడుతుంది. మంచి మాటలు వినడం వలన విద్యార్థులు విశ్లేషణాత్మకంగా ఆలోచించడానికి ప్రేరేపించబడతారు. ఇది విద్యలోనూ, జీవితంలోనూ ఉపయోగపడుతుంది. మంచి పనులు చేయాలనే ఆలోచనలు వస్తాయి. విద్యార్ధి యొక్క ఆసక్తి ఏ విషయాలపై ఉంటుందో, ఆ విషయాలు మంచి సంకల్పం ఏర్పడడంలో తోడ్పడతాయి. కావునా మంచి విషయాలపై ఆసక్తి పెంచుకోవడానికి మంచి మాటలపై ఆసక్తి కనబరచాలి.
మనోధైర్యం పెంచుకోవడానికి మంచి మాటలు వినడం, వాటిపై ఆలోచన చేయడం, అవగాహనతో మంచి పనులకు పూనుకోవడం…. మనోబలం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా విఫలతలను ఎదుర్కొనడంలో ధైర్యం, సహనంతో ముందుకు పోవడానికి మంచి మాటలు ఎంతోగానో మనకు తోడ్పడతాయి.
విద్యార్థులు మంచి మాటలు వినడం వలన చెడు అలవాట్లకు దూరంగా ఉండగలరు
ఈ రోజు మంచి మాటలు అంటే తెలుసుకున్న మంచి మాటలలో ఏది ఎంతవరకు ఆచరిస్తున్నామో… గమనించుకుంటే, అది మంచి పనికి నాంది కాగలదు.
ప్రతిరోజు ఒక మంచి మాటతో ప్రారంభిస్తే, ఏదో ఒక రోజు మంచి పనికి పూనుకుంటాము. సానుకూలమైన మాటలు మన మనసులో ప్రశాంతతను తీసుకువస్తాయి. ఇది చదువుపై మరియు లక్ష్యంపై దృష్టి కేంద్రీకరించడానికి దోహదం చేస్తుంది.
విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?
జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?
పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?
పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?
తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు
ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?
0 responses to “విద్యార్థులు మంచి మాటలు వినడం వలన”