విద్యార్థులు రాజకీయాలు గురించి అవగాహన

విద్యార్థులు రాజకీయాలు గురించి అవగాహన ఎందుకు చేసుకోవాలి. నేడు సమాజాన్ని నడిపించేది, సామాజిక భవిష్యత్తును శాసించేది… రాజకీయం. సమాజంలో రాజకీయం వలననే అధికారం ఉంటుంది. ఈ రాజకీయాలు పాతతరం వారితో బాటు కొత్తతరం వారు కూడా ఉండడం చేత, సామాజిక భవిష్యత్తుకు చక్కటి మార్గం ఉంటుంది. కొత్తతరం వారు లేకుండా కేవలం పాతతరం వారితోనే రాజకీయాలు సాగితే, సామాజిక భవిష్యత్తు మారుతున్న కాలాన్ని అనుసరించలేకపోవచ్చును. మారుతున్న కాలాన్ని బట్టి నిర్ణయాధికారం లేకపోతే, సామాజిక భవిష్యత్తు ఎలా ఉంటుందో ? తెలియదు.

విద్యార్థులు రాజకీయాలు గురించి అవగాహన

కొత్తతరం అంటే నేటి కళాశాల విద్యార్ధులే, రేపటి సామాజిక నేతలు కావచ్చును. కాబట్టి కళాశాల రోజుల నుండే విద్యార్ధులకు రాజకీయా గురించిన అవగాహన ఉండడం మేలు అంటారు. సాంకేతికంగా అభివృద్ది చెందుతున్న తరుణంలో పారిశ్రామికపరమైన విధానాలు, వ్యవస్థ యొక్క విధానాలు.. చాలా రకాల విధానాలు సాంకేతికతతో ముడిపడి ఉంటున్నాయి. సాంకేతికతను ఆధారంగా చూసినా కూడా, కొత్తతరం రాజకీయ నేతల వలన సాంకేతికతపై రాజకీయాలలో మరింత అవగాహన చేసుకునే అవకాశం ఉంటుంది. సమాజాన్ని శాసించే రాజకీయాల గురించి విధ్యార్దులకు సరైన అవగాహన ఉండడం చేత వారు గొప్ప నేతలుగా ఎదిగే అవకాశం ఉంటుంది. విద్యార్ధులకు రాజకీయ అవగాహన లేకుండా ఉండడం చేత, అర్హత లేనివారు కూడా రాజకీయ నేతలుగా ఎదిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా స్వార్ధపరులు, అవినీతిపరులకు అవకాశం ఉండకూడదంటే, విద్యార్ధులకు రాజకీయ అవగాహన ఉండాలి. వారు సమాజంలో నేతలుగా మారినప్పుడు తాము చూసిన సమాజాన్ని మార్చగలిగే రాజకీయనేతలుగా మారగలరు.

మరిన్ని తెలుగురీడ్స్ పోస్టులు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు