By | January 2, 2022

విశ్వసనీయత గురించి మీ మాటలలో విశ్వసనీయత ప్రధానమని తెలుగులో వివరించండి. విశ్వసనీయత జీవితంలో చాలా ముఖ్యమైనది. విశ్వాసం ఏర్పడిన తర్వాత దానిని నిలబెట్టుకోవడం వ్యక్తికి చాలా అవసరం. విశ్వాసం కోల్పోతే అర్హతను కోల్పోవలసి ఉంటుంది.

వ్యక్తికైనా, వ్యవస్థకైనా, సంస్థకైనా, రాజకీయ పార్టీకైనా చివరికి ఒక ప్రాంతమైనా విశ్వసనీయత ప్రధానమైన ప్రభావం చూపగలదు.

ఒక ప్రాంతంలో దారి దోపిడి దొంగలు ఎక్కువ అని సమాజంలో ప్రాచుర్యం పెరిగితే, ప్రయాణం చేసేటప్పుడు ఆ ప్రాంతంపై ప్రజలలో విశ్వసనీయత ఉండదు. ఆ ప్రాంతమును తప్పించుకుని వెళ్ళే మార్గములను అన్వేషిస్తారు. కాబట్టి ఎవరికైనా విశ్వసనీయత చాలా ప్రధానమైనదిగా చెబుతారు.

అలాగే ఒక స్కూల్ విషయంలో కూడా ఆక్కడ పాఠాలు బాగా చెబుతారు! క్రమశిక్షణతో కూడిన విద్యాభ్యాసం విద్యార్ధులకు అందిస్తారనే నమ్మకం ఉన్నన్నాళ్ళు… ఆస్కూల్ నందు తమ తమ పిల్లలను చదివించడానికి తల్లిదండ్రులు మొగ్గు చూపుతారు. ఒక్కసారి గా అక్కడ క్రమశిక్షణ లోపించింది… లేదా పాఠాలు చెప్పే టీచర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు… తదితర అంశాలలో విశ్వసనీయత కోల్పోతే, ఆ స్కూల్ నందు పిల్లలను చేర్చడానికి తల్లిదండ్రులు ఇష్టపడరు.

ఒక రాజకీయ నాయకుడు అధికారంలో ఉండగా ప్రజలకు మంచి పనులు చేసి పెడితే, ఆ రాజకీయ నాయకుడిని ప్రజలు మరలా గెలిపించుకుంటారు. లేకపోతే మరొక్కసారి అతనికి ఓటు వేయడానికి వెనుకాడతారు.

విశ్వసనీయత చాలా చాలా ప్రధాన ప్రభావం చూపగలదు.

వ్యక్తి అయితే తను ఇచ్చన మాట తప్పకుండా, మాట ప్రకారం చెల్లింపులు చేయడం, మాట ప్రకారం పనులు చేసి పెట్టడం జరుగుతూ ఉంటే, ఆ వ్యక్తిపై సమాజంలో విశ్వసనీయత పెరుగుతుంది. ఆ వ్యక్తి మాటకు విలువ పెరుగుతుంది. అదే ఒక వ్యక్తి ఇచ్చిన మాటను తప్పుతాడు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోడు… అని గుర్తించబడితే, సమాజంలో అతని మాటకు విలువ ఉండదు. ఒక రాజకీయ నాయకుడు అయినా ఇదే స్థితిని పొందే అవకాశం ఉంటుంది.

విశ్వసనీయత అంటే ఒక వ్యక్తి పై గానీ ఒక వ్యవస్థపై గానీ ఒక సంస్థపై గానీ ఒక పార్టీపై గానీ ఒక ప్రాంతంపై గానీ సమాజం ఏర్పరచుకునే నమ్మకం. అటువంటి నమ్మకం ఒక్కసారి ఏర్పడితే, అది చాలాకాలం ఉంటుంది. అటువంటి విశ్వసనీయతను తెలివైస సంస్థలు కానీ వ్యవస్థలు కానీ వ్యక్తులు కానీ కాపాడుకుంటూ తమ దైనందిన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు.

వ్యక్తికి గానీ సంస్థకి గానీ వ్యక్తుల చేత పని చేయించే వ్యవస్థ కానీ సమాజంలో గుర్తింపు పొందే విశ్వసనీయత వలననే వాటి విలువ ఆధారపడి ఉంటుందని అంటారు. ఒక్కసారి విశ్వసనీయత కోల్పోతే, వాటి విలువ సమాజంలో మారుతుందని అంటారు. అందుకే సమాజంలో విశ్వసనీయత ముఖ్యమైనదిగా తెలియబడుతుంది.

మరిన్ని తెలుగురీడ్స్ పోస్టులు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు