By | October 11, 2021

వృత్తిని ప్రేమించేవారు ఆరంగంలో ఉన్నతస్థితిని సాధించగలరు తెలుగులో వ్యాసం. ఎవరికివారికి వారి వారి వృత్తులంటే అభిమానం ఉంటుంది. తమ తమ వృత్తులను ప్రేమిస్తారు. వృత్తిపై ఉండే ప్రేమ వలన వృత్తిలో కష్టనష్టాలను ఇష్టంతో అధిగమిస్తారు.

పురాణ శాస్త్రజ్ఞులైనవారు అంటూ ఉంటారు “మనదేశంలో వృత్తిపని ఒక తపస్సు వలె” చేస్తారని.

వైద్యుడు ఒక తపస్సు వలె వృత్తి పనిని నిర్వహించడం వలననే వేలమంది ప్రాణాలను నిలబెట్టగలరు.

పోలీసు తమ వృత్తిని తపస్సువలె నిర్వహించడం వలననే సమాజనికి రక్షణ.

ఒక ఐఏఎస్ అధికారి తమ కర్తవ్య నిర్వహణలో ఒత్తిడిని జయించడం వలన దుష్ట స్వభావుల నుండి సమాజాన్ని సంరక్షించగలరు. అది తపస్సు వంటి సాధన చేతనే ఒత్తిడిని జయించగలరు. తపస్సు అంటే ఒక విషయమును ప్రేమిస్తూ, దానిని కర్తవ్యతా దీక్షతో చేయడమే అయితే, అది తర్ఫీదు పొందడంలోనే సగం తపస్సు అవుతుంది.

మనదేశంలో వివిధ వృత్తులు ఉన్నాయి… ఆయా వృత్తులలో ఉండేవారు తమ వృత్తిని ప్రేమించడం వలననే విలువైన వస్తువులు తయారు అవుతున్నాయి…

చెప్పులు కుట్టువారు, తమ వృత్తిని అమితంగా ఇష్టపడి చేయడం వలన ఆకర్షణీయమైన రీతిలో చెప్పుల ఉత్పత్తి జరుగుతుంది. ఇలా ప్రతి వస్తువు తయారులో వివిధ వృత్తుల చేసేవారి తపస్సు ఉంటుంది. వివిధ వ్యక్తుల శ్రమ ఉంటుంది. వివిధ వ్యక్తుల కష్టం ఉంటుంది.

ఇష్టమైతే కష్టం శ్రమ అనిపించకుండానే కాలంలో కలసిపోతుంది… లేకపోతే కష్టం కాలాన్ని భారం చేస్తుంది.

మనసులో ఉండే నమ్మకం, అద్బుతమైన ఫలితాలను తీసుకురాగలదు

నమ్మకం ఉన్న చోట మనసు ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతమైన మనసు ప్రేమతో ప్రతిస్పందిస్తుంది… అటువంటి ప్రేమ వ్యవస్థలలో ఉన్నాయి కాబట్టి సమాజం అభివృద్ది వైపు పరుగులు పెడుతుంది. ఒక కొత్త సాఫ్ట్ వేర్ సృష్టించడానికి వేలమంది ఉద్యోగుల తపస్సు ఉంటుంది. తీరికలేకుండా వారు చేసే తపస్సు వంటి కృషి వలన కొత్త కొత్త సాఫ్ట్ వేర్స్ మరింత సౌకర్యవంతంగా అభివృద్ది చెందుతున్నాయి.

వ్యక్తి మనసులో ఉండే నమ్మకం, అద్బుతమైన ఫలితాలను తీసుకురాగలదు. డాక్టర్ ఇచ్చే మందులు కూడా రోగికి నమ్మకం కుదిరితేనే రోగి శరీరంపై సరైన ప్రభావం చూపగలవు అంటారు. కాబట్టి చేసే పనిపై శ్రద్ద, పనిచేస్తున్న వ్యవస్థపై నమ్మకం, పని ఇస్తున్న అధికారి వద్ద వినయం ముఖ్యం అంటారు.

తాము చేస్తున్న వృత్తిని ప్రేమతో నిర్వహించి, ఉన్నత శిఖరాలకు వెళ్ళినవారు ఎందరో ఉన్నారు.

ఒక తపస్సు చేసినట్టుగా చదివిన వారు ఉన్నత స్థాయికి వెళ్ళిన వారు ఉన్నారు.

ప్రతి ఒక్కరూ చిన్నతనంలో ‘చూసినది కావాలి కావాలి’ అని పదే పదే అమ్మ నాన్నల ముందు తపించి తపించి సాధించిన వస్తువు ఏదో ఒకటి ఉంటుంది. అలాంటి వస్తువు విషయంలో మనసు ఏవిధంగా స్పందించింది? తల్లిదండ్రులు ఎలా ఏవిధంగా నచ్చజెప్పినా వినకుండా వారి వద్ద నుండి లభించేవరకు మారాం చేసి సాధించిన విషయమేదో ఒకటి ప్రతివారిలోనూ ఉంటుంది. అటువంటి తపన చేస్తున్న వృత్తిలో పెడితే, మరింత ప్రయోజనం వ్యక్తిగతంగానూ… వ్యవస్థాపరంగాను.

అంతటి అభిమానం వృత్తిలోనూ చూపించేవారు ఆ రంగంలోనూ ఉన్నత స్థితికి వెళ్లగలరని అంటారు.

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు