By | November 7, 2021

వ్యాసం వ్రాయుటకు ఏదైనా అంశము ఎంచుకోవడానికి చాలా రకాల అంశములలో వివిధ విషయములు ఉంటాయి. అయితే తెలిసి ఉన్న రంగంలో మనకు బాగా తెలిసిన విషయంలో అయితే వ్యాసం బాగా వ్రాయగలుగుతాం. కాబట్టి వ్యాసం వ్రాయుటకు ఏదైనా అంశం ఎంచుకోవడంలో బాగా తెలిసిన అంశమునే ఎంచుకోవాలి.

విద్యార్ధులకు అయితే ప్రశ్నాపత్రములో ముందుగానే అంశము చెప్పి, దానిపై మీ సొంత వ్యాక్యాలలో వ్యాసం వ్రాయమని ప్రశ్నరూపంలో అడుగుతారు.

ప్రశ్నాపత్రములో పాఠ్యాంశము నుండి కానీ లేదా సామాజిక అంశము నుండి కానీ ఏదైనా ఒక విషయముపై వ్యాసము వ్రాయమని ప్రశ్న రూపంలో అడగడం జరుగుతుంది. కొన్ని సార్లు ఏదైనా ఒక అంశము మీ సొంత వ్యాక్యాలలో వ్యాసం వ్రాయమని కూడా అడిగే అవకాశం ఉంటుంది.

అలా మీకు మీరుగా ఒక అంశము మీ సొంత మాటలలో వ్యాసము వ్రాయండి అంటే ఖచ్చితంగా మనకు బాగా తెలిసిన విషయములలోని అంశమునే స్వీకరించాలి. ఏది వ్రాస్తే గొప్పగా భావిస్తారో? అదే వ్రాద్దామని ఆలోచిస్తే, వ్యాసం మద్యలో కలం కదలకపోవచ్చును. ఎందుకంటే ఆ గొప్ప అంశముపై మనసులో మదనం జరిగి ఉండదు. అంటే అంత ఎక్కువగా ఆలోచన జరిగి ఉండకపోవచ్చును. తత్కారణంగా వ్యాస రచన పూర్తి అయ్యేదాకా కలం కదలకపోవచ్చును.

అదే మీకు తెలిసిన విషయములో అంశమును ఎంచుకుంటే మీ మనసులో భావాలు అక్షరాలుగా కదులుతుంటే కాగితంపై కలం కదులుతూనే ఉంటుంది… ఆ కాగితపు అంచుల వరకు కలం కదులుతుంది.

కాబట్టి వ్యాసం వ్రాయుటకు ఏదైనా అంశము ఎంచుకునే ప్రక్రియలో మనకు తెలిసిన విషయములలో బాగా మననము అయిన అంశము ఎంచుకోవడం వలన సదరు వ్యాసం విజయవంతంగా పూర్తి చేయగలము. పూర్తి సొంతమాటలతోనే వ్యాస రచన చేయగలం.

ఉదా: మీ సొంత వ్యాక్యాలలో ఒక నాయకుడి గురించి వ్యాసం వ్రాయండి అంటే

సహజంగా అందరికీ నరేంద్ర మోదీ పేరు బాగా వినబడుతుంది. పుస్తకాలలో అబ్దుల్ కలాం, వాజ్ పేయి వంటి పేర్లు చదివి ఉంటాము. అయితే వారి గురించి మన మనసులో ఎంతవరకు మననం జరిగి ఉందనేది పాయింట్.

ఎందుకంటే నరేంద్ర మోదీగారు మన దేశ ప్రధాని. కాబట్టి నిత్యం వార్తలలో ఉండేవారు కాబట్టి అందరికీ సుపరిచయమైన పేరు కానీ అందరికీ పూర్తిగా నరేంద్ర మోదీగారి గురించి తెలుసునా? అంటే అందరికీ పూర్తిగా తెలుసు అని చెప్పలేం. కొందరికి కొంత వరకే తెలిసి ఉంటే, కొందరికి పూర్తిగా తెలిసి ఉంటుంది. అలా పూర్తి తెలిసినవారిలో మీరు కూడా ఉంటే, మీరు నరేంద్ర మోదీ గారి గురించి వ్యాసరచన మీ సొంత వ్యాక్యాలు ఉపయోగించి వ్రాయడానికి పూనుకోవచ్చును.

అయితే మీకు నరేంద్ర మోదీగారి గురించి బాగా తెలుసు కానీ అందరూ నరేంద్ర మోదీ గారి గురించే వ్రాస్తారు కానీ నేను పివి నరసింహారావు గారి గురించి వ్రాస్తాను అని భావిస్తే, మీకు పివి నరసింహారావుగారి గురించి ఎంతవరకు తెలుసు అనే ప్రశ్న వేసుకోవాలి. అసలు ఎంతకాలంగా మీ మనసులో పివి నరసింహారావుగారి గురించి ఆలోచనలు కలిగాయి ఆలోచిస్తే మీకు ఎవరి గురించి వ్యాసం అప్పటికప్పుడు మీ సొంత మాటలలో వ్రాయగలరో ఒక అవగాహన వచ్చే అవకాశం ఉంటుంది.

వినూత్నంగా విభిన్నంగా ఆలోచించడం మంచిదే కానీ ఆ వినూత్నమైన ఆలోచనను పరిపూర్ణంగా అమలు చేసినప్పుడే ఆ ఆలోచనకు సార్ధకత ఉంటుంది. వ్యాసరచన చేయడానికి మనకు బాగా తెలిసిన అంశము అయితే సులభంగా చక్కగా అర్ధవంతంగా సొంత అభిప్రాయం తెలియజేయగలరని అంటారు.

అంశము ఎంపిక జరిగిన పిమ్మట వ్యాస రచన నియమాలు పాటిస్తూ…. వ్యాసమును వ్రాయడం మొదలు పెట్టాలి.

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు