తెలుగురీడ్స్

బుక్ రీడింగ్ అలవాటున్న మీ స్నేహితులకు షేర్ చేయండి

ఒక ఇద్దరి మద్య సంభాషణలాగా కొన్ని ఆలోచనాత్మకమైన కల్పిత ఊహను క్రింది పోస్టులో తెలియజేయడమైనది. ఇందులో కేవలం ఇద్దరు కలిసి సంభాషణ ఒక ముఖ్యమైన విషయంలోకి ఎలా వెళుతుందనే చిన్న సంకల్పంతో ఊహ చేసిన కల్పిత సంభాషణే కానీ ఎవరిని, వేటిని, ఏ ఇతర విషయాలను కానీ ఉద్దేశింపబడింది కాదు.

అమెరికాలో సెటిల్ అయిన సాఫ్ట్ వేర్ ఇంజనీరు శ్రీనివాసుకు అతని భార్యతో బాటు ఒక నాన్న, ఒక కొడుకు ఒకే ఇంట్లో నివసిస్తూ ఉంటున్నారు. శ్రీనివాసు భార్యపేరు పావని, కొడుకు పేరు రీడ్స్(శ్రీనివాసు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ప్రియురాలి పేరును, కొడుకుకు ఆమె గుర్తుగా పెట్టుకున్నాడు), ఇతని వయస్సు 14ఏళ్లు. రీడ్స్ అమెరికాలోనే పుట్టాడు కాబట్టి అతనికి తెలుగు నేర్పే బాధ్యతను రీడ్స్ తాతయ్య తీసుకున్నాడు. రీడ్స్ తాతయ్య తెలుగు అంటే అభిమానం, కొడుకుమీద కోపం ఎందుకంటే, తన మనవడికి పేరు ఇంగ్లీషు పేరు పెట్టాడని. కాబట్టి రీడ్స్ కు తెలుగులో పండితుడిని చేయాలని, రీడ్స్ తాతయ్య కంకణం కట్టుకున్నాడు. అయితే రీడ్స్ కు అతని తాతయ్య పదే పదే తెలుగు గురించి చెప్పడంతో, రీడ్స్ అతనిని తెలుగుతానా అని పిలవడం ప్రారంభిస్తాడు. అయితే మనకు ఇక్కడ కధలు చెప్పుకోవడానికి రెండు పాత్రలు ఏర్పడితే, చెప్పేవారి పాత్రపేరు ”తెలుగుతానా” వినే బాలుడి పేరు ”రీడ్స్”. వీరి పాత్రలు ఇలా ఉన్నాయి. ఒకరోజు రీడ్స్ తాతయ్య గారి దగ్గరకు ఎవరో పెద్దాయన వచ్చి మాట్లాడుతుండగా…వారి మాటలలో ”మనసును కుదుట పరచుకో, అది నీటి తరంగాలు లాంటిది…నీటిలో రాళ్ళు పడుతున్న కొలది తరంగాలు హెచ్చినట్టు, మనసులో ఆలోచనలు మెదిలే కొలది, లోపలి భావప్రకంపనలు పెరుగుతాయి” అనే వాదార్పు మాటలు రీడ్స్ వింటాడు. ఆ పెద్దాయన కొంతసేపటికి వెళ్లిపోతాడు…ఆ తర్వాత రీడ్స్…తన తెలుగు తాతయ్యతో…ఇలా

రీడ్స్: ”ఏమిటి తెలుగు తాతయ్య మనసు అంటూ మీ స్నేహితునికి చెబుతున్నారు ” అని అడిగాడు.
తెలుగుతాతయ్య: ”నీకెందుకులేరా…నీవు తెలుగు పొయిట్రీ అప్పజెప్పు” అంటాడు.
రీడ్స్: ”తెలుగుతానా మీరు మనసు గురించి చెబితేనే, నే…తెలుగు పూర్తిగా నేర్చుకుంటాను…మీ..దగ్గర..” అని పలుకుతాడు.
తెలుగుతాతయ్య: ”చూడు…రీడ్స్…ఇప్పటికి నీవు నేర్చుకునే విషయం కాదు…ఇది…నీ ఏజ్ కు పొయిమ్స్, మీనింగ్స్…తెలుసుకో” అంటాడు.
రీడ్స్: ”వాట్ ఇజ్ దట్… విషయం మీన్స్…?”అంటాడు.
తెలుగుతాతయ్య: ”విషయం మీన్స్ థింగ్, అంటే ఒక వస్తువు, ఒక అవసరం, ఒక సేవా ఏదైనా ఒక మనిషికి అవసరం ఉండి, దానితో మనసుకు సంఘం ఏర్పడి ఉండేదానిని విషయం అంటారు.” అంటే..
రీడ్స్: ”వాట్ ఇజ్ సంఘం, ఇట్స్ మీన్స్…” అంటాడు.
తెలుగుతాతయ్య: ”సంఘం మీన్స్ ఎటాచ్ మెంట్ విత్ మైండ్…అంటే మనసుకు ఒక సంబంధించిన అనేక ఆలోచను కూడా ఏదో దానిపై ఆధారపడి ఉంటుంది. అలా ఆధారపడి ఉన్న విషయం మనసుపై తిరిగి ప్రభావం చూపుతుంది.”
రీడ్స్: ”తెలుగుతానా…ఎలా ఎఫెక్టు అవుతుంది మైండు విషయంతో…”
తెలుగుతాతయ్య: ”మైండ్ డుయింగ్ థింకింగ్ ఎట్ ఆల్వేస్….ఇట్ ఇజ్ ఏ బిజినెస్ ఆఫ్ మైండ్. ఇట్ ఇజ్ లుకింగ్ ఫర్ బెటర్ బెనిఫిట్ ఫ్రమ్ థింగ్స్.”
రీడ్స్: ”తెలుగుతానా…తెలుగులోనే చెప్పు…అర్ధం చేసుకుంటా…ఎప్పుడైనా డౌటు అయితే…టెల్ మి ఇన్ ఇంగ్లీష్” అంటాడు.
తెలుగుతాతయ్య: తెలుగుతానా నవ్వుతూ….”అలాగే రీడ్స్…నీకు తెలుగుమీద చాలా ఇంట్రెస్టు పెరిగింది….” అనగా..
రీడ్స్: ”అవును…నేర్చుకుంటున్న కొలది…ఇష్టంగానే ఉంది…”
తెలుగుతాతయ్య: ”సరే…మనసు అంటే ఎల్లప్పుడూ…ఆలోచనలు చేస్తూ..ఉంటుంది. అది కేవలం దానియొక్క వ్యాపారం. ఎప్పుడూ తనకు ఉన్న విషయాలతో లాభాన్ని లెక్కలు వేస్తూ…ఉంటుంది. భావాలను పెంచుకుంటూ…ఎక్కువగా అప్పటికీ ఏ భావం మనసు నిండా ఉంటే, ఆ భావన బయటపెడుతుంది.” అని తెలుగుతానా చెబుతాడు…రీడ్స్…తో.
రీడ్స్: ”భావన మీన్స్…” అని అడిగాడు
తెలుగుతాతయ్య: ”భావన అంటే మనసు ఆలోచనలతో పొందే ఊహా…ఏదైనా ఒక విషయంలో ఒకే రకమైన ఆలోచనలను బలంగా పొందుపరుచుకుని ఒక ఊహను తయారు చేసుకుంటుంది. ఆ ఊహతో ఊగిసాలాడుతూ ఉండే మనసు ఒక అభిప్రాయంతో ఉంటుంది. దానికిష్టమైన విషయం అయితే సుఖంగానూ, లేకపోతే దు:ఖంగానూ భావిస్తూ ఉంటుంది. మనసు మంచి భావనలను చేస్తూ ఉంటే, శాంతిగా ఉంటుంది. ఇతర ఆలోచనలతో ఉంటే, మనసు పరి పరివిధాలా భావాలను పొందుతూ, తననుతానే ఇబ్బందికి గురి చేసుకుంటుంది.” అని అన్నాడు.
రీడ్స్: అయోమయంగా చూస్తూ..”తెలుగుతానా…మనసును శాంతిగా ఉంచడం ఎలా సాధ్యం” అని అంటాడు.
తెలుగుతాతయ్య: ”నాయనా..రీడ్స్…మనసు తనకోసం ఆలోచన చేయడంతో బాటు, తన చుట్టూ ఉన్నవారికోసం కూడా పాటుపడుతూ అందరితో మంచి అనిపించుకుంటూ…శత్రువు చేత కూడా పొగడబడేంత మంచిని మనసులో పెంచుకుంటేనే…పూర్తి మనశ్శాంతి ఉంటుంది. లేకపోతే కాలంలో కలిగే కష్టాలకు మనసు కృంగుతూ…సుఖాలకు పొంగుతూ ఉంటుంది.”
రీడ్స్: తెలుగుతానా ”మనసును మంచి భావనలతో నింపడం ఎలా? అది ఎలా ప్రతిస్పందిస్తూ ఉంటుంది?” అని ప్రశ్నించాడు…రీడ్స్…అతని తాతయ్యను.
తెలుగుతాతయ్య: ”రీడ్స్…కుండలో నీటి చుక్కలు పడి పడి ఆ కుండ నిండినట్టు…మనసులో కూడా చిన్ననాటి నుండి చూసిన విషయాలపై తలంపులు తలచి తలచి, తీరిన కోరికలు తిరగి పొందాలని, తీరని కోరికలు ఎలా తీర్చుకోవాలి అని ఆలోచనలతో అనేక భావనలను పొందు పరచుకుంటూ…కోరికలతో నిండడానికి చూస్తూ ఉంటుంది. ఇక్కడే తీరిన కోరికలు గురించి ప్రతిసారి పునరాలోచన చేయకుండా…తీరని కోరికలు గురించి బెంగపెట్టుకోకుండా…మనసును మనసుచేత ఓర్పును బుద్ది పెంచగలిగితే…ఆ వ్యక్తి మనసు కష్టకాలంలో కృంగిపోకుండా ఉంటుంది. లేకపోతే కాలంలో కలిగే కష్టం వలన మనసు తీరిన కోరిక మరలా పొందలేనేమో? లేక తీరని కోరిక ఇక తీరదేమోననే బెంగ పెంచుకుంటుంది. మాములు సమయంలో మనసు చేసే, ఆలోచనల కన్నా కష్టకాలంలో మనసు చేసే ఆలోచన తీవ్రత ఎక్కువ. కాబట్టి సాదారణ సమయంలో మనసు ఎప్పుడూ…కావాలి అనకునే దానికన్నా…తాను పొందుతున్న విషయంలో తన చుట్టూ ఉన్నవారిని దృష్టిలో పెట్టుకుని, తనకోరిక తీరడం వలన ఎవరికి ఏ ఇబ్బంది లేదు…లేక తన కోరిక తీర్చడం ఎదుటివారు మనస్పూర్తిగా ఇష్టపడుతున్నారా? లేదా అనేది చెక్ చేసుకుని…ఏదైనా పొందితే…అటువంటి వ్యక్తి మనసు కష్టకాలంలో కృంగిపోదు.” అని చెప్పాడు.
రీడ్స్: గందరగోళంగా చూస్తూ…”తెలుగుతానా…మరి మనసులో మంచివికానీ ఆలోచనలు వస్తూ ఉంటే, వాటిని ఎలా తొలగించుకోవాలి?” అని అడిగాడు.
తెలుగుతాతయ్య: ”మంచినీరు కుండలో సగం వరకే ఉన్నాయి…అయితే ఆ నీటిలో కొన్ని తాటాకు ముక్కలు లాంటి తుక్కు పడింది. కానీ తుక్కుని కుండలో చేయి పెట్టి తీయడానికి చూస్తే, ఆ తుక్కులో కొంత నీటిలోకి చేరుతూ, నీరు తరంగాలులాగా కదులుతుంది, మనసు కూడా అంతే, దానిలో ఉన్న చెడుని వేరొకరు వేలెత్తి చూపితే, విపరీతంగా బాధపడుతుంది. కానీ సగం మంచినీరు ఉన్న కుండలో తుక్కు పడినప్పుడు, మరికొంత మంచినీరు తీసుకువచ్చి కుండ నిండి నీరు పొర్లిపోయేవరకు ఆ కుండలో పోస్తే, పొర్లిన నీరుతోబాటు..ఆ కుండలో తుక్కు కూడా ఎక్కువశాతం బయటికిపోస్తుంది. ఆ తర్వాత ఆ నీటిని వడకడితే నీరు, అందులోని తుక్కు అంతా పోతుంది. ఇంకా ఆ నీరుని కాసి, వడపోస్తే ఆ నీరు మరింత మంచినీరుగా మారుతుంది. అలాగే మనసుని మనసు చేతనే, నీకు నీవుగానే గుర్తిస్తే, అది అప్పటికి ఇబ్బందిగా అనిపించినా…మనసులో మంచి భావనలు పొందుతుంది.” అని అన్నాడు…తెలుగుతాతయ్య…రీడ్స్…తో.
రీడ్స్: ఇంకాస్త గందరగోళంగా చూస్తూ ఉంటే…
తెలుగుతాతయ్య: ”ఇంకా కొనసాగిస్తూ….మనసులో ఎప్పుడూ మంచి భావనలు చేత నింపుతూ…తనలో ఉన్న చెడుగుణాలను తలంపులోకి రానీయకుండా…తనని తానే శుద్ది చేసుకుంటూ కొంతకాలం చూస్తే, అది మారుతుంది. అయితే ఇది చేయడానికి ముందు మనసు చేత మనసులో ఉన్న గుణాలలో ఏవి మేలు చేసేవి? ఏవి చేటు చేసేవి? అనేది గుర్తింపబడాలి. అప్పుడే అది ఆ గుణాలకు విరుగుడుగా వేరు మంచి భావనలచేత తననుతాను మార్చుకునే అవకాశం మనసుకు ఉంటుంది. ఎలా అంటే.. నీటిగుంటలో నీరు తక్కువగా ఉంటే, ఆ గుంటలోని నీరుని ముట్టుకుంటే, ఆ నీరు మురికిగా మారుతుంది. అదే గుంటలో నీరు నిండుగా ఉంటే, గుంటలోని మురికి గుంట అడుగు భాగానే ఉండి, తేట నీరు పైకి ఉంటుంది. ఆ తేట నీరు మనిషికి దాహం తీరుస్తుంది. అలాగే మనసులో మంచి భావనలు ఎప్పుడూ తలస్తుంటే, బుద్ది ప్రకటితం మంచినే పంచుతుంది. కావునా ఎప్పటికీ కోరికలు ప్రధానంగా ఉన్న వాటి ప్రభావం చేత మనసు ఏవిధంగా తయారు అవుతుందో అనే విషయం ప్రధానంగా బుద్ది చేత గుర్తింపుబడాలి. బుద్దిచేత మనసుకు హెచ్చరిక చేయాలి. బుద్దికి మనసును లోబర్చాలి.” అని తెలుగుతాతయ్య ముగింపు ఇచ్చాడు.
రీడ్స్: ”తెలుగుతానా…తానా..కోరికలు లేకుండా ఎవరూ ఉండరు…కదా…మరి మనసు ఎలా కోరికను జయించగలుగుతుంది?” ప్రశ్నవేశాడు..రీడ్స్…తెలుగుతాతయ్యతో..
తెలుగుతాతయ్య: ”నీకు ఒక వస్తువు వాడుక విధానం ఎలా తెలస్తుంది?” అని తిరిగి ప్రశ్నించాడు…రీడ్స్..ని
రీడ్స్: ”ఆ వస్తువుని పరిశీలించి, వస్తువు యొక్క మాన్యువల్ చదివి వస్తువుని వాడుట చేత, ఒక వస్తువును వాడుక విధానం తెలుస్తుంది…లేకపోతే, ఎవరైనా ఉపయోగించినవారు ఉంటే, వారి దగ్గర అడిగి తెలుసుకోవడం ద్వారా వస్తువు వాడుక విధానం తెలియవస్తుంది.” అని బదులిచ్చాడు…రీడ్స్.
తెలుగుతానా: ”మనిషి మనసు ఇష్టాఇష్టాలతో పెరుగుతూ కొన్ని కోరికలను పెంచుకుంటూ పెరుగుతుంది. అయితే ఒక వస్తువుకు మాన్యువల్ ఉన్నట్టే..మనిషి మనసుకు కూడా కొన్ని ధర్మాలు ఉంటాయి. అవి గురువులు, పెద్దల ద్వారా మనకు సంప్రదాయంగా వస్తూ ఉంటాయి. లేకపోతే పుస్తకాల ద్వారా ధర్మం ఏమిటో తెలియవస్తుంది. తెలుసుకున్న ధర్మంలోకి మనిషికున్న కోరికలు వస్తున్నాయా..లేదా…అనేది చాలా ప్రధానం. మనిషి తాను పుట్టిన భూమిలో…తనకు కుటుంబ సంప్రదాయంగా వస్తున్న విధానాలను ఆచరిస్తూ….కోరికలను అదుపులో పెట్టుకుంటూ…ఉండడం చేత మనసుకు కోరికలను వదిలిపెట్టగలిగే బలం పెరుగుతుంది, అంటారు.”
రీడ్స్: ”తెలుగుతానా…అంటే మనిషికి ప్రధానం ధర్మమా?”
తెలుగుతానా: ”అవును రీడ్స్…ధర్మమును రక్షిస్తే, ధర్మము మనిషిని రక్షిస్తుందనేది…శాస్త్ర నానుడి.”

ధన్యవాదాలు – తెలుగురీడ్స్………………..