ఈ రోజు నేషనల్ సైన్స్ డే

ఈ రోజు నేషనల్ సైన్స్ డే

ఈ రోజు నేషనల్ సైన్స్ డే, రామన్ ఎఫెక్ట్ పరిశోధనా ఫలితాన్ని ఫిబ్రవరి 28, 1928లో ధృవపరుచుకున్నారు. ఆ సందర్భంగా ఈరోజు జాతీయ వైజ్ఙానికి దినోత్సవం.

కావునా ఫిబ్రవరి 28వ తేదీ జాతీయ వైజ్ఙానిక దినోత్సవం(నేషనల్ సైన్స్ డే) గా జరుపుతున్నారు. రామన్ ఎఫెక్ట్ ను కనిపెట్టింది, చంద్రశేఖర వేంకట రామన్.

రామన్ ఎఫెక్ట్ అంటే… ద్రవాలపై పడిన కాంతి కిరణాలు ఎలా పరిక్షేపం చెందుతాయో (చెదురుతాయో) తెలిపే పరిశోధన ఫలితాన్నే రామన్ ఎఫెక్ట్ అంటారు

చంద్రశేఖర్ వేంకటరామన్ 1888 సంవత్సరంలో నవంబర్ 7వ తేదీన అయ్యన్ పెటాయ్ గ్రామంలో జన్మించారు. ఈఊరు తిరుచినాపల్లి సమీపంలో ఉంది.

ఈయన తండ్రి చంద్రశేఖర్ అయ్యర్, రామన్ తల్లి పార్వతి అమ్మాళ్. రామన్ తండ్రిది మధ్య తరగతి కుటుంబం. వారి వృత్తి వ్యవసాయంగా ఉంది. సివి రామన్ విశాఖపట్నంలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తిచేశారు.

సి.వి.రామన్ బాల్యం నుండి సైన్స్ విషయాల పట్ల అమితమైన ఆసక్తిని కలిగి ఉండేవాడు. రామన్ ఆసక్తి భౌతికశాస్త్రం వైపు మరింత కుతూహలం పెంచుకునేలా చేసింది. బాల్యంలోనే తెలివైన విద్యార్థిగా పేరుగాంచిన రామన్ తన 12వ ఏట మెట్రిక్యులేషన్ లో ఫిజిక్స్‌లో గోల్డ్‌మెడల్ సాధించాడు.

1907లో ఎం.యస్.సి (ఫిజిక్స్)లో యూనివర్సిటీ ఫస్ట్ వచ్చారు. ఆ తరువాత రామన్ ఎమ్మే చదివి, ఫైనాన్స్‌ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం చేశారు.

సివి రామన్ ఉద్యోగం చేస్తూ పరిశోధనలు

1907లో ఉద్యోగం వలన కలకత్తాకు ట్రాన్సఫర్ అయ్యారు. అక్కడ నుండి ప్రతిరోజూ ఇండియన్‌ సైన్స్‌ అసోసియేషన్‌కు అక్కడ పరిశోధనలు చేసుకునేవారు. రామన్‌ ఆసక్తిని గమనించిన కలకత్తా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ అశుతోష్‌ ముఖర్జీ బ్రిటీష్‌ ప్రభుత్వానికి లేఖ వ్రాశారు.

అందులో రామన్‌ సైన్స్‌ పరిశోధనలకు, తన పూర్తి కాలానికి వినియోగించుకుంటే బాగుంటుందని సూచించారు. అయితే బ్రిటీష్‌ ప్రభుత్వం అందుకు అంగీకరించలేదు. అటుపై ఉద్యోగానికి రాజీనామా చేసి పరిశోధనలు కొనసాగించాడు.

ఆ తర్వాత తల్లిదండ్రుల సలహాపై ఐసిఎస్ పాసై కలకత్తా ప్రభుత్వ ఆర్థికశాఖలో డిప్యూటీ అకౌంటెంట్ జనరల్‌గా చేరారు. ఉద్యోగంలో చేరకముందే లోకసుందరి అమ్మాళ్‌తో రామన్ కు పెళ్ళయింది.

ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉద్యోగం, మిగిలిన కాలమంతా పరిశోధనలకే పరిమితం అయ్యారు.

ప్రయాణంలో ఓడలో ప్రయాణిస్తున్నప్పుడు ఆకాశానికి, సముద్రం నీటికీ రెండింటికి ఒకే నీలిరంగు ఉండటం రామన్ ను బాగా ఆలోచింపచేసింది. అప్పటిదాకా అనుకుంటున్నట్లు సముద్రపు నీలి రంగుకు కారణం ఆకాశపు నీలిరంగు సముద్రం మీద ప్రతిఫలించడం కాదు.

సముద్రపు నీటి గుండా కాంతి ప్రవహించేటప్పుడు కాంతి పరిక్షేపణం చెందడమే అందుకు కారణం అని ఊహించాడు. కలకత్తా చేరగానే తన ఆలోచనను నిరూపించడానికి ద్రవాలు, వాయువులు, పారదర్శక ఘనపదార్థాలు కాంతి పరిక్షేపణం గురించి పరిశోధనలు చేశారు.

అందుకు యువశాస్త్రవేత్తలైన కె.ఆర్.రామనాధన్, కె.యస్ .కృష్ణన్ ఆయనకు అండగా నిలిచారు. 1927 డిసెంబరులో ఒకరోజు సాయంత్రం కె.యస్.కృష్ణన్ రామన్ వద్దకు పరుగెత్తుకొని వచ్చి కాంప్టన్ (భౌతిక శాస్త్రవేత్త)కు నోబెల్ బహుమతి వచ్చిందని ఆనందంతో చెప్పగానే రామన్ ఎక్సలెంట్ న్యూస్ అని సంతోషపడ్డాడు.

కాంప్టన్ ఫలితం ఎక్సరేయిస్ విషయంలో నిజమైనపుడు, కాంతి విషయాలలో నిజం కావాలి కదా అనే ఆలోచనలో పడ్డాడు. ఆ ఆలోచనే రామన్ ఎఫెక్టుకు దారితీసింది.

జాతీయ విజ్ఞాన దినోత్సవం (నేషనల్ సైన్స్ డే)
1928లో ఫిబ్రవరి 28న రామన్ ఎఫెక్టును కనిపెట్టిన సందర్భం కారణంగా, దానిని పురస్కరించుకుని భారతదేశంలో ఫిబ్రవరి 28వ తారీఖును జాతీయ విజ్ఞాన దినోత్సవంగా (ఈ రోజు నేషనల్ సైన్స్ డే) జరుపుకొంటారు.

Enable Notifications    Ok No thanks