By | December 24, 2021

కరపత్రం ఎలా రాయాలి తెలుగులో కరపత్రం అంటే పాంప్లేట్ అంటారు. karapatram meaning in telugu కరపత్రం అంటే కరము చేత వ్రాయబడిన పత్రం లేదా కరము చేత పంచబడే పత్రం అనవచ్చును. కరము అంటే చేయి…. చేతి వ్రాతతో పత్రమును వ్రాసి, దానిని పలువురికి చేతితోనే అందిస్తూ ప్రచారం చేస్తారు. అటువంటి పత్రమును కరపత్రం అంటారు. అయితే ఇది ఇప్పుడు ప్రింటింగ్ చేస్తారు.

ఇది ఆకర్షణీయంగా ఉంటూ విషయం సరళంగా అర్ధవంతంగా ఉంటుంది. అది ఆహ్వానం కాచచ్చు లేక సమావేశం ఏర్పాటు గురించి కావచ్చును. లేదా ఏదైనా అంశములో ప్రజలలో అవగాహన కొరకు కూడా కరపత్రం ప్రచురిస్తూ ఉంటారు.

పాంప్టేట్ అంటే తెలుగులో కరపత్రం ఏదైనా సందర్భం గురించి తెలుపుతూ ఒక ఆహ్వాన లేఖ మాదిరిగా ఉండవచ్చును. లేకా ఒక అంశమును గురించి సమగ్రంగా తెలియజేసే సమాచార పత్రంగా కూడా ఉండవచ్చును. ఏదైనా సందర్భమును, దాని ఆవశ్యకతను కరపత్రం ద్వారా తెలియజేయడం జరుగుతుంది.

అంటే కరపత్రం అంటే వ్యాసం వ్రాసినట్టుగా ఉండవచ్చును. అయితే అందులో ఆహ్వానిస్తూ ఉండవచ్చును. లేదా ఒక అంశమును గురించి ప్రచారముగా కూడా ఉండవచ్చును.

పాంప్లేట్ కరపత్రం ఎలా రాయాలి?

కరపత్రంలో ముందుగా టైటిల్ ఎంపిక చాలా ముఖ్యం. ఇది కరపత్రంలోని సారాంశమును ప్రతిబింబించేలాగా ఉండాలి.

అంశమునకు ఎంచుకునే టైటిల్ అంటే తెలుగులో శీర్షిక… కరపత్రం యొక్క ఉద్దేశ్యమును తెలియజేసే విధంగా ఉండాలి. అందువలన కరపత్రం చదివేటప్పుడు దానిని మరింత లోతుగా అర్ధం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంకా ఈ టైటిల్ అంటే శీర్షిక వాడుక పదాలతో కలిసి ఉండడం వలన కరపత్రంపై ఆసక్తి కూడా పెరుగుతుంది.

కరపత్రమునకు ఆయుష్షు ఉంటుంది.

ఇక ప్రతీ కరపత్రానికి ఒక నిర్ణీత సమయం ఉంటుంది. ఒక తేదీ నుండి మరొక తేదీ తర్వాత ఆ కరపత్రము చరిత్రలో సంఘటనకు ఆధారము మాత్రమే. అంటే ఒక షాప్ ఓపెనింగ్ కు ఒక కరపత్రం అంటే ఇంగ్లీషులో పాంప్లేట్ తయారు చేయబడితే, షాప్ ఓపెన్ అయిన కొన్నాళ్ళకు ఆ కరపత్రము గతించిన సంఘటనకు సాక్ష్యం మాత్రమే.

కాబట్టి కరపత్రం ఇంగ్లీషులో పాంప్లేట్ వ్రాసేటప్పుడు టైటిల్ కు ఎగువ కానీ దిగువ కానీ తేదీ వ్రాయడం ప్రధానం…. లేదా తేదీని ఉంటంకిస్తూ… ఒక హెడ్ లైన్ ప్రధానం.

టైటిల్ వ్రాశాకా ఆ టైటిల్ ని క్లుప్తంగా వివరిస్తూ, సందర్భమును తెలియజేయడం ప్రధానం.

క్లుప్త వివరణ తర్వాత టైటిల్ ను బట్టి ప్రధానాంశాలు అప్పటి సందర్భమును బట్టి కొన్ని పేరాలు గా విభజిస్తూ…. సమగ్ర వివరణ ఉండాలి. ప్రధానంగా టైటిల్ ని బట్టి సందర్భము యొక్క ఉద్దేశ్యము, దాని ప్రధాన్యత ఉండాలి.

సామాజికపరమైన అంశము అయితే, కరపత్రములో సంబంధిత శీర్షికను బట్టి విషయము యొక్క ఆవశ్యకత, దాని యొక్క భవిష్యత్తు పరిణామాలు, సమాజంపై సంబంధిత విషయము యొక్క ప్రభావం అన్ని సమగ్రంగా తెలియజేయాలి.

ఆహ్వాన కరపత్రం అయితే ప్రజలను ఆహ్వనిస్తూ ముగించాలి. లేదా సామాజిక అంశము గురించి అవగాహన కరపత్రం అయితే, విషయమును పరిశీలించమని కోరుతూ ముగించాలి.

ప్రధానంగా కరపత్రము యొక్క డిజైన్ ఆకట్టుకునే విధంగా కూడా ఉండాలి.