By | November 13, 2021

బాలల దినోత్సవం బాలలకు భరోసగా ఉండేవారు నిత్యం వెన్నంటి ఉంటారు. ప్రతివారికి బాల్యం భగవంతుడు అందించిన వరం. అనుకరించడంలో డిగ్రీ పుచ్చుకున్నట్టుగా అనుసరించడంలో ముందుండే బాలల చుట్టూ రక్షణ వలయంలాగా సమాజం ఉంటుంది.

ఇంట్లో అమ్మా, నాన్న అన్నయ్య, అక్క, ఇంటి చుట్టూ ఇరుగుపొరుగు, ఇంటి బయట బంధువులు, ఊరికెళితే అత్తయ్య, మామయ్య, అమ్మమ్మ, తాతయ్య చదువుకుంటున్న వేళల్లో బోధకులు ఇలా నిత్యం బాలల వెన్నంటి బాలల శిక్షణకు, బాలల ఉత్తమ క్రమశిక్షణ కోసం పాటుపడే వ్యవస్థ మన సమాజంలో బాలలకు వరం వంటిది.

స్కూలుకు వెళ్ళిన బాలలు ఇంటికి తిరిగిరాకపోతే ఇంటి నుండి పెద్దల ఆరా… స్కూల్ నుండి ఇంటికి బయలుదేరిన పిల్లలు ఇంటికి క్షేమంగా చేరడానికి ప్రయత్నించే స్కూల్ సిబ్బంది…. ఇలా బాలల చుట్టూ బాలల కోసం పాటుపడేవారు తమ వంతు సేవ చేస్తూనే ఉంటారు.

సమాజంలో ఎక్కడన్నా రాజీపడి తప్పును క్షమిస్తారేమో కానీ బాలల విషయంలో తప్పుకు తావివ్వరు. అలా రక్షణాత్మక దోరణి బాలలపై చూపుతారు. అటువంటి బాల్యం అందరికీ వరమే. బాలల దినోత్సవం బాలలకు భరోసగా ఉండేవారు అనేకమంది వారి చుట్టూ ఉంటారు.

బాలల దినోత్సవం సందర్భంగా బాలలకు శుభాకాంక్షలు.

ప్రతి యేడాది నవంబర్14 బాలల దినోత్సవం. ఆ సందర్భంగా బాలలకు శుభాకాంక్షలు. బాలలు మీది నేర్చుకునే వయస్సు ఆ వయస్సులో మీరు ఏమి నేర్చుకుంటున్నారో అది మీ జీవితము మొత్తము మీకు తోడుగా ఉంటుంది. కాబట్టి మంచి విషయ పరిజ్ఙానం పెంపొందించుకోవడానికి నిత్యం పాటుపడాలి. ఎందుకంటే నిత్యం మీ వెన్నంటి ఉండేవారి తపన అదే కాబట్టి.

బాలల దినోత్సవం బాలలకు భరోసగా ఉండేవారు
బాలల దినోత్సవం బాలలకు భరోసగా ఉండేవారు

ఇక బాల్యంలో బాలలు ఏమి అలవాటు చేసుకుంటూ ఉంటే, ఆ అలవాట్లే జీవితము అంతా ప్రభావం చూపుతూ ఉంటాయి. కారణం అనుసరించే గుణం కలిగిన మనసుకు అనుసరించి, అనుసరించి అలవాటుగా మార్చేసుకుంటుంది. కాబట్టి మీరు మీ బాల్యంలో మంచి అలవాట్లను అలవరచుకుంటే, అవి మీకు జీవితము మొత్తము మంచి కీర్తి ప్రతిష్టలను సాధించడానికి దోహదపడతాయి. ఎందుకంటే నిత్యం మీ వెన్నంటి ఉండేవారి చిరకాల కోరిక అదే కాబట్టి.

ఎదిగే వయస్సులో అల్లరి ఉంటుంది. అదే అలవాటుగా అయిపోతే నలుగురిలో మీరు అల్లరిపాలు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అల్లరి సరదా దగ్గర ఆగిపోవాలి. మంచి అలవాట్లతో మనసుపై నియంత్రణ కలిగి ఉండడం అలవాటు చేసుకోవాలి.

బాలల దినోత్యవం సందర్భంగా బాలలు తమకు తాము గమనించవలసిన విషయాలు

పైన చెప్పుకున్నాము… బాలలుగా ఉన్నప్పుడు బాలల చుట్టూ ఒక రక్షణ వలయంగా ఇంటి దగ్గర నుండి స్కూల్ వరకు రక్షణాత్మక దోరణి ఉంటుందని.

అలా ఏర్పడిన రక్షణ వలయంలో ఉన్నవారంతా మీ క్షేమము కొరకే ఆలోచిస్తూ ఉంటారు. అందులో భాగంగా కొన్ని కొన్ని సార్లు కొంతమంది విద్యార్ధులను టీచర్లు మందలించడం కానీ ఇంట్లో పెద్దలు మందలించడం కానీ జరుగుతుంది. అలా మందలించబడిని విద్యార్ధులు తమ తప్పులు తాము తెలుసుకుని వాటిని సరిదిద్దుకునే మార్గం ఇంట్లో పెద్దవారిని కానీ స్కూల్లో టీచర్లను కానీ అడిగితే అక్కడే మీ మనసుపై మీకు విజయం సాధించే అవకాశాన్ని అందుకుంటున్నట్టే లెక్క.

ఇలా విద్యార్ధులు కొన్ని కొన్ని తప్పులు అల్లరితో వచ్చేవిగా ఉన్నట్టు ఉన్నా…. ఎక్కడైనా స్వభావం దోషంగా కనబడితే అటువంటి బాలల విషయంలో పెద్దలు కానీ టీచర్లు కానీ గమనించగానే బాలలను హెచ్చరించడం, మందలించడం సహజం…. కాబట్టి బాలలూ మిమ్మల్ని టీచర్లు మందలిస్తే, ముందు అలా మందలించడానికి కారణం కనుక్కోవాలి. అలా కనబడిన కారణంలో మీ తప్పును మీరు తెలుసుకోగలగాలి. తప్పును సరిదిద్దుకోవడానికి మార్గం ఆలోచించాలి. అలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్తపడాలి.

బాలలుగా ఉన్నప్పుడు పెద్దల మందలింపు చర్యలను తప్పు బట్టడం కన్నా ముందు ఆమాటలను పాజిటివ్ దృక్పదంతో ఆలోచించడం అలవాటు చేసుకోవాలి.

బాలలుగా ఉన్నప్పుడే ప్రధాన విషయాలలో వినడం ప్రధానం.

మొక్కగా ఉన్నప్పుడు ఒంగని మొక్క పెరిగి మానై అంటే పెద్ద చెట్టుగా పెరిగాకా ఒంగుతుందా? ఈ సామెతే బాలలకు బాగా వర్తిస్తుందంటారు.

బాలల దినోత్సవం బాలలకు భరోసగా ఉండేవారు
బాలల దినోత్సవం బాలలకు భరోసగా ఉండేవారు

బాల్యంలో వినడం మానేసి ఇష్టానుసారంగా వ్యవహరించే పిల్లలలు పెరిగి పెద్దయ్యాక కూడా అదే ప్రవర్తన కలిగి ఉంటారు. అటువంటి ప్రవర్తన వలననే సమాజంలో ఎప్పుడో ఒకసారి నలుగురిలో నవ్వులపాలు అవుతూ ఉండడం జరగవచ్చును. అదే బాల్యంలో క్రమశిక్షణకు అలవాటు పడితే మాత్రం ఆ క్రమశిక్షణ జీవితాంతము ఉంటుంది.

ప్రధానోపాధ్యాయులు కానీ ఉపాధ్యాయులు కానీ విద్యార్ధులను దండించారు అంటే దానికి కారణం మాత్రం క్రమశిక్షణను ఉల్లంఘించారనే భావన బలపడడమే అవుతుంది.

కాబట్టి బాలలుగా ఉన్నప్పుడు క్రమశిక్షణను ఉల్లంఘించరాదు. పొరపాటున క్రమశిక్షణ ఉల్లంఘించినా మరలా అది రిపీట్ కాకుడదు.

సమాజంలో ప్రధాన దరిద్రం ఏమిటంటే, కొన్ని వీడియోల ద్వారా ప్రేక్షకులను ఆకర్షించడం కోసం కామెడీ ప్రయత్నంలో బాగంగా క్రమశిక్షణను హేళన చేయడమే ప్రధాన ధ్యేయంగా ఉండడం.

కాబట్టి క్రమశిక్షణ ఉల్లంఘించడం అంటే గొప్పకాదు. అది మీకు మీరే నష్టం చేసుకుంటున్నట్టే.

బాలలుగా ఉన్నప్పుడే ప్రధాన విషయాలలో వినడం ప్రధానం. ప్రధాన విషయాలలో అంటే క్రమశిక్షణ, పాఠ్యాంశాలు చదివే తీరు, అవగాహన ఏర్పరచుకోవడం. పెద్దల మాటను గౌరవించడం. విన్నదానిలో విషయ సంగ్రహణం. ఎటువంటి విషయాలను వెంటనే వదిలిపెట్టాలి. ఎటువంటి విషయాలలో పట్టింపులు ఉండాలి. ఎటువంటి విషయాలలో పట్టుదల చూపాలి… ఇవ్వన్ని ఎప్పటికప్పుడు పెద్దల ద్వారా బాలలకు చెప్పబడుతూనే ఉంటాయి. విని మంచిని స్వీకరిస్తూ, పాజిటివ్ కాన్సెప్టును మైండులో బాగా వృద్ది చేసుకోవాలి….

బాలల దినోత్సవం బాలలకు భరోసగా ఉండేవారు ఎల్లప్పుడూ బాలల చుట్టూ ఉంటారు… బాలలుగా ఉన్నవారు పెద్దల కష్టం గుర్తించి, వార కష్టాన్ని వృధా కానీవ్వకుండా… నేర్చుకోవాలసిన విషయాలలో దృష్టి కేంద్రికరించడం ప్రధాన కర్తవ్యం.