By | November 5, 2021

ఆత్మకథ అంటే ఏమిటి వివరించండి ! వ్యక్తి తన యొక్క జీవిత ప్రయాణంలో ఎదుర్కొన్న కష్టనష్టాలు, స్వానుభవం, చవి చూసిన అనుభవాలు, ఇంకా వారి స్వ జ్ఞాపకాలు గురించి తనకు తానుగా నిజాయితీగా రచన చేసిన కధను ఆత్మకథ అంటారు. అంటే వ్యక్తి జీవిత చరిత్రను కూడా ఆత్మకధగా చెబుతారు. ప్రధానం ప్రముఖులు ఆత్మకధలు సాధారణ వ్యక్తులలో ప్రేరణ పుట్టిస్తాయి. విద్యార్ధులకైతే ఏదైనా సాధించాలనే లక్ష్యము ఏర్పడగలదు.

తన జీవితములో తాను ఎదుర్కొన్న పరిస్థితులు వాస్తవిక దృష్టితో అర్ధవంతంగా ఇతరులెవరినీ నొప్పించకుండా ఉండడానికి ప్రధాన్యత ఇస్తారని అంటారు. వాస్తవిక దృష్టితో ఉండడం వలన సదరు నాయకుడు లేదా ప్రముఖులు జీవించిన కాలంలోని సామాజిక స్థితి గతుల గురించి భవిష్యత్తు తరానికి కూడా ఒక అవగాహన ఏర్పడే అవకాశం ఉంటుంది.

తమ జీవితములో తాము సాధించిన విజయాలు, పొందిన పరాజయాలు… విజయానికి తోడ్పాటు అందించినవారు, పరాజయానికి స్వీయ తప్పిదాలను వాస్తవంగా విచారిస్తూ వివరించే ప్రక్రియ ఆత్మకధలో కొనసాగుతుందని అంటారు.

మహాత్మగాంధీ గారు తన ఆత్మకధను సత్యశోధన అనే పేరుతో రచించారు. ఆ పుస్తకం ఇప్పుడు చదవడం వలన నాటి స్వాతంత్ర్యపు కాలం నాటి పరిస్థితులు ఎలా ఉండేవో మనకు ఊహాత్మక ఆలోచనలు కలిగే అవకాశం ఉంటుంది.

వింగ్స్ ఆఫ్ ఫైర్ అంటూ అబ్దుల్ కలాం రచించిన ఆత్మకధ పుస్తకం చదివితే, పరిశోధన గురించిన అవగాహన ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇంకా జీవితానికి ఒక లక్ష్యం ఏర్పడే అవకాశం ఉంటుంది.

ఈ విధంగా సమాజంలో పేరు ప్రఖ్యాతులు పొందినవారు తమ తమ జీవితంలో ఎదురైనా పరిస్థితులు గురించి తెలియజేయడం వలన అవి భవిష్యత్తులో మరికొందరికి ప్రేరణ కలిగించగలవు.

గడ్డు పరిస్థితులలో ప్రముఖులు చూపించిన తెలివితేటలు ఆత్మకధగా ఒక పుస్తక రూపంలో ఉంటే, అటువంటి పరిస్థితుల గురించి ఒక అవగాహన ఎప్పటికీ పుస్తక రూపంలో భద్రపరచబడి ఉంటుంది. అటువంటి పరిస్థితులు భవిష్యత్తులో ఎదురైనవారికి ఉపయుక్తం కాగలవు.