By | January 2, 2022

దీర్ఘకాలిక ప్రణాళికలు తాత్కాలికంగా ఇచ్చే ఫలితాలు ఉండవు. కాలహరణం కూడా చేస్తాయి. విమర్శలుపాలు అవుతాయి. ఇలా ముందుగానే నెగటివ్ ప్రభావాన్ని దీర్ఘకాలిక ప్రణాలికలు పొందే అవకాశం కూడా ఉంటుంది.

దీర్ఘకాలిక ప్రణాలికల ఫలితం తొలుత చిన్న ప్రకాశం మాదిరిగానే కనబడుతుంది. ప్రయత్నం చేయగా, దీర్ఘకాలంలో ప్రకాశం ఎందరికో వెలుగును చూపగలదు.

మారుతున్న కాలంలో వేగంగా ఫలితాలను పొందుతున్న రోజులలో దీర్ఘకాలిక చర్యలు అందరికీ సంతృప్తికరంగా అనిపించకపోవడంలో ఆశ్చర్యపడనవరం లేదని అంటారు.

అయితే అన్నింటిలోనూ దీర్ఘకాలిక చర్యలు తగదని కూడా చెబుతారు. అవసరమైనా తాత్కాలిక చర్యలు తప్పవని, అనసరమైన చోట తాత్కాతిక చర్యలతో సరిపెట్టుకోవడం వలన దీర్ఘకాలిక ఫలితాలు ప్రభావం చూపలేవని కూడా చెబుతారు.

వ్యక్తి సాదారణ జ్వరం వస్తే, తాత్కాలిక ఉపశమనం కోసం అందుబాటులో ఉన్న సాదారణ వైద్యుడి దగ్గరకు వెళ్ళడం పరిపాటి… ఆ వైద్యుడి వైద్యం వలన జ్వరం తగ్గే అవకాశాలు ఎక్కువ. అయితే వ్యక్తికి తరచూ జ్వరం రావడం అంటే, అది దీర్ఘకాలికంగా శరీరంపై ఏదో దుష్ప్రభావం చూపనుందని గ్రహించక, సాదారణ వైద్యంతో తాత్కాలికంగా మందులు వాడుతూ ఉండడం వలన దీర్ఘకాలంలో శరీరం అస్తవ్యస్తతకు గురయ్యే ప్రమాదముంటుంది.

అందుకే అవసరం, అవకాశం, సమస్య తీవ్రతను బట్టి చర్యలు తాత్కాలికమా… దీర్ఘకాలికమా అని అంచానా వేసుకోవాలని పెద్దలంటారు.

సైకాలజీ ప్రకారం చూసినా ఒక వ్యక్తికి దీర్ఘకాలిక ప్రణాళిక ఉండడం

ఎప్పుడూ ఇన్ స్టంట్ రిజల్ట్స్ అలవాటు పడిన మనసుకు వెయిట్ చేయవలసిన సమయంలో వెయిట్ చేయడానికి ఒప్పుకోదు అంటారు. ఇలా సైకాలజీ ప్రకారం చూసినా ఒక వ్యక్తికి దీర్ఘకాలిక ప్రణాళిక ఉండడం వలన వెయిట్ చేయడం లేదా ఓపిక పట్టడం లేదా సహనంతో ఉండడమనే గుణం పెరిగే అవకాశం ఉంటుందని పెద్దలు అంటారు.

కానీ దీర్ఘకాలిక చర్యలు లేదా ప్రణాళికలు ఎప్పుడూ తాత్కాలిక ఫలితాల సమయం అంతా హరిస్తున్నట్టుగానే కనబడతాయి. కానీ దీర్ఘకాలంలో ఫలితాలు అందిస్తున్నప్పుడు మాత్రం అవి విరివిగా అందిస్తాయి.

మామిడి మొక్కలు, కొబ్బరి మొక్కలు మొక్కలుగా ఉన్నప్పుడు కాయలు కాయడం అరుదు… అవి చెట్లుగా ఎదిగాకా మాత్రం దీర్ఘకాలంపాటు ప్రతి ఏడాది కాయలు కాయడం జరుగుతుంది. దీర్ఘకాలిక ఆదాయంగా కూడా ఉంటాయి. కానీ కొంతకాలం పాటు వాటికి సమయం కేటాయించాలి… నీరు, ఎరువులు వాటికి అందించాలి.

ఆసక్తిని బట్టి వార్తలు వస్తున్నాయా?

నేటి నీ కృషి రేపటికి నీకు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఎవరు?

అబద్దం చెప్పిన వారి విలువను తగ్గిస్తుంది?

అభివృద్దికి ఆటంకాలు అంటే ఏవి?

అసత్య ప్రచారాలు వాస్తవాలు గురించి