By | November 29, 2021

జీవనశైలి వ్యక్తి ఆరోగ్యం ఉంటుంది. ఎందుకంటే సమయానికి శ్రద్దతో ఆహారం స్వీకరించేవారు శక్తివంతులుగా ఉంటారు. సమయానికి ఒత్తిడి కారణంగా ఆహారం స్వీకరించక ఉండేవారు బలహీనతను కొని తెచ్చుకుంటారు.

జీవనశైలి వలన వచ్చు వ్యాధులు, వ్యక్తికి వచ్చు వ్యాధులు వ్యక్తి జీవనశైలిని బట్టి ఉంటుందని అంటారు. ఆరోగ్యానికి మంచి ఆహారం తీసుకునేవారి జీవనశైలితో వారు సంతోషంగా ఉండగలరు. ఒత్తిడికి తలొగ్గి కనీస సమయపాలన కూడా పాటించిన జీవనశైలి గలవారు అనారోగ్యవంతులు అవుతారని అంటారు. అంటే ఎవరి ఆరోగ్యం వారి జీవనశైలిని బట్టి ఉండవచ్చును.

జీవనశైలి వ్యక్తి ఆరోగ్యం ఉంటుంది
వ్యక్తికి వచ్చు వ్యాధులు వ్యక్తి జీవనశైలిని బట్టి ఉంటుందని అంటారు.

మాములూగానే గాలి వలన కొన్ని వ్యాధులు కలగవచ్చును. అంటే అంటువ్యాధులు ప్రభలినప్పుడు గాలి ద్వారా వ్యాదిసోకే అవకాశం ఉంటుంది. రకరకాల వ్యాధులు సమాజంలో పుడుతూ, పెరుగుతూ ఉంటాయి. కారణం కాలుష్యం ఎక్కువ అవుతుంది కాబట్టి. కావునా మనిషి తన జీవనశైలి సరిగ్గా ఉండకపోతే, వ్యాధులతో బాధపడవలసని ఆగత్యం ఏర్పడుతుందని అంటారు.

ఆరోగ్యం గురించి వ్యాసం మీద వ్యాసం వ్రాస్తూ ఉంటారు. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. మనిషి ఆరోగ్యంగా ఉంటే, తన పనులు తాను చేసుకుంటూ, మరొకరికి ఇబ్బందిగా మారడు. ఇంకా స్వశక్తితో తను ఆర్దికపరమైన ఉన్నతికి కృషి చేయగలడు. కాబట్టి సమాజంలో ఆందరికీ ఆరోగ్యం గురించి అవగాహన ఉండాలని ఔత్సాహికులు, సామాజిక శ్రేయోభిలాషులు వ్యాసరచన చేస్తూ ఉంటారు.

ఎవరి జీవనశైలి ఎలా ఉంటుందో, దానిననుసరించి వారి ఆరోగ్యస్థితి ఆధారపడి ఉంటుందని అంటారు.

సమాజంలో సంక్రమణ వ్యాధులు వంటివి ఉంటాయి. గాలి వలన కలిగే వ్యాధులు ఉండవచ్చును. కలుషిత నీటి వలన వ్యాధులు ఉంటాయి. నిల్వ ఉన్న ఆహారం వలన వ్యాధులు రావాడానికి ద్వారాలు తెరిచినట్టేనని అంటారు. వ్యాధులు రావడానికి అనేక మార్గములు ఉంటాయి. రక్షణకు మాత్రం స్వీయ సాధన అవసరం.

నిల్వ ఉన్న ఆహారం వలన వ్యాధులు రావాడానికి ద్వారాలు తెరిచినట్టేనని అంటారు.

ప్రధానంగా వ్యక్తి జీవనశైలి ఆరోగ్యంగా ఉండడానికి చూడాలి. ఉద్యోగంలో ఒత్తిడి ఉంది. లేక వ్యాపారంలో ఎమర్జెన్సీ ఉంది. లేక కుటుంబ అవసరాలు ఎక్కువ… ఏవో కారణాలు ఉంటూనే ఉంటాయి. అనేక సమస్యలు ఉంటాయి. కానీ ఏ సమస్య పరిష్కరింపబడాలన్న, ముందుగా మనం ఆరోగ్యంగా ఉంటే, ఆయా సమస్యలను ఎదుర్కొనవచ్చును. సమస్యల పరిష్కారం కోసం పాటుపడవచ్చును. సమస్యలను చేదించవచ్చును. కానీ ఆరోగ్యంగా ఉండడం చాలా చాలా ప్రధానం.

ఆరోగ్యంగా ఉండడం అంటే…

ఉల్లాసంగా ఉండగలగడం.

తిన్నది జీర్ణం చేసుకోగలగడం.

మలబద్దకం లేకుండా ఉండడం.

పనిచేయడానికి తగిన శక్తిని కలిగి ఉండడం… చాలా చాలానే చెబుతారు.

కానీ ఏదో సమస్య అంటూ, ఏదో కారణం అంటూ మానసికంగా ఒత్తిడికి గురికావడం కరెక్టు కాదు.

ముందుగా సమయానికి తిండి తినడం ప్రధానం.

ఇంకా వ్యాయామం, యోగ వంటి అంశాలు వ్యక్తి జీవనశైలిలో భాగమై ఉంటే, మెరుగైన ఫలితాలు సాధించవచ్చును అంటారు.

వ్యక్తి జీవనశైలిలో మార్పు అనివార్యం అయితే

ఆరోగ్యం కోసం వ్యక్తి జీవనశైలిలో మార్పు అనివార్యం అయితే, జీవనశైలిలో మార్పు తెచ్చుకోవాలి.

ఉరుకులు పరుగులతో డ్యూటీలకు వెళ్లడం, ఆహారం ఆదరా బాదరగా తినడం. అరిగిందో లేదో కూడా పట్టించుకోకుండా ఉంటూ ఉద్యోగాలు చేసేవారు ఉంటారు. అలా వారు అలవాటు పడితే, ఇక వారి పిల్లలకు కూడా ఉరుకులు పరుగులతో స్కూల్ కెళ్ళడం, వేగంగా తినేయడం వంటివి జరుగుతుంటే, అన్నం మీద శ్రద్ద, ఆహారం మీద గౌరవం కూడా తగ్గిపోతుంది. అన్నం తినడం కూడా యాంత్రికమైపోతుంది.

అంటే పిండిమరలో బియ్యం పోసేస్తూ ఉంటే, బియ్యం పిండిగా మారి వచ్చేస్తూ ఉంటుంది. అలాగే ఆకలైనప్పుడు నాలుగు మెతుకులు నోట్లో పడేస్తూ ఉంటే, ఎప్పటికో అదే అరుగుతుంది. తిండి ధ్యాసే లేకుండా, ఒత్తిడితో ఉండడం, ఒత్తిడిలో తినడం, ఏదో సాధించాలనే తపనతో ఆన్నం మీద ధ్యాస లేకపోవడం వలన శరీరానికి మేలు కలగదు.

అంటే తిండికోసం బ్రతకమని కాదు కానీ తింటున్న తిండి వంటబట్టాలి. తింటున్న తిండి ఒంట్లో శక్తిగా మారాలంటే, అన్నం మీద శ్రద్ద ఉండాలి. తినేటప్పుడు శ్రద్దతో తినాలి. ప్రేమతో అన్నం తినాలి. అదే కదా అమ్మ అన్నం పెడితే, ఇట్టే అరిగిపోతుంది.

ముందుగా వ్యక్తి తన జీవనశైలిలో వేగంగా అన్నం తినడం, ఒత్తిడిలో ఆలోచిస్తూ ఆహారం స్వీకరించడం చేయకూడదు…. ఇదే పెద్ద సమస్యగా మారకుండా తుగ జాగ్రత్త తీసుకోవాలని అంటారు.

వ్యాధులు, రోగాలు, జబ్బులు ఏదైనా ఒక్కటే కానీ ఒంటికి వస్తే, వచ్చినవారికి అవస్థ, అతని బంధువులకు తిప్పలు తప్పవు… ఆర్ధిక నష్టం… ఎన్నో నష్టాలకు మూల కారణం వ్యక్తి అనారోగ్యం అయితే, మనసు ఒత్తిడిలోకి నెట్టబడడం మరొక కారణం అవుతుంది.

మానసిక ఒత్తిడి నుండి మనిషి బయట పడాలి. ఆరోగ్యవంతుడుగా ఉంటూ, తన జీవన లక్ష్యంపైపు నడవాలి.