జీవితంలో చదువుకు ఎంత విలువ? చదువు ఎందుకు అవసరం?

జీవితంలో చదువుకు ఎంత విలువ కలదు అది ఎంత ముఖ్యమో తెల్పండి. ముఖ్యంగా మనకు చదువు ఎందుకు అవసరం. చదువుకోవడం వలన ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వృత్తి పని వచ్చినా, ఆ వృత్తి పనికి తగిన డిమాంట్ ఉంటేనే, వృత్తి పని ద్వారా వ్యక్తి జీవనం బాగుంటుంది. కేవలం వృత్తి పనితో బాటు తగిన చదువు ఉంటే, వ్యక్తి తనకు వచ్చిన పనితోనైనా జీవనం కొనసాగించగలడు. లేదా ఇతర కార్యాలయములలో ఉపాధి అవకాశాలు చూసుకోగలడు. కావునా ఈరోజులలో మనకు చదువు చాలా అవసరం. ఇంకా ఏవైనా చదవగలిగే జ్ఙానం అలవరుతుంది. ఇంకా వివిధ అంశాలలో విషయ విజ్ఙానం పెరుగుతుంది.

చదువు ఎందుకు అవసరం జీవితంలో చదువు విలువ ఎంత?

చదువు వల్ల కలిగే లాభాలు చాలా ఉంటాయి. సమాజంలో సహజంగా చదువుకున్న వ్యక్తికి కలిగే లాభాలు… పైన చెప్పినట్టు చేతిపని తెలిసినవారికి చదువు కూడా ఉండడం వలన ఆ పనిలో ఉన్నత స్థితికి వెళ్ళగలడు. లేదా తనకు తెలిసిన పనిని ఇంకా ఎక్కువ మందికి తెలియజేయడానికి చదువు ఉపయోగపడుతుంది. తనకు తెలిసిన పనిని మరింత నాణ్యతతో కొత్త పద్దతులలో చేయడానికి చదువు ఉపయోగపడే అవకాశం ఎక్కువ.

జీవితమును తమకు నచ్చినట్టుగా మార్చుకునే అవకాశాలు మెరుగుపడతాయి.

ఆర్ధిక పరిస్థితిని మరింత మెరుగుపరుచుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

ముందుగా మరొకరిపై ఆధారపడవలసిన అవసరం తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ప్రయాణం చేసే సందర్భాలలో…

ప్రయాణాలలో తెలిసి వస్తుంది. చదువు ఎందుకు అవసరం? అని

అక్షర జ్ఙానం లేకపోతే ప్రయాణించవలసిన ఊరు పేర్లు కూడా చదవలేము. అదే చదువుకుని ఉండడం వలన ప్రయాణపు మార్గముల గురించి ఒకరిపై ఆధారపడకుండా తెలుసుకోగలము. ఇది చదువుకోవడం వలన వ్యక్తికి కలిగే ప్రాధమిక ప్రయోజనం.

అక్షరజ్ఙానం ఉంటే ప్రయాణంలో ఒక బస్సు వెళ్ళే రూటు గురించి వివరాలు కోసం మరొకరిపై ఆధారపడనవసంలేదు. విషయ విజ్ఙానం ఉంటే లోకంలో మనగలగడానికి మార్గం ఉంటుంది.

ఇంకా చదువుకుని ఉండడం వలన వివిధ ప్రాంతాలలోని విషయ పరిజ్ఙానం గురించి పుస్తకాల ద్వారా తెలుసుకోవచ్చును. చదువు వలన వ్యక్తి నిత్యవిద్యార్ధిగా ఉండవచ్చును.

మరీ ముఖ్యంగా చదువుకున్న వ్యక్తులు తమ పిల్లల పెంపకంలో కీలక పాత్రను పోషించగలరు.

ఉపాధి అవకాశాలు మెరుగుపరచుకోవచ్చును. ఉపాధిని సృష్టించవచ్చును. ఎంత వ్యాపారం చేసినా, కనీస అక్షరజ్ఙానం అవసరం ఉంటుంది.

ఇంకా పరిశోధనాత్మకమైన తెలివితేటలు గల బాలుడికి సరైన చదువు తోడైతే, అతను ఒక శాస్త్రవేత్తగా మారే అవకాశాలు ఉంటాయి.

గత సామాజిక పరిస్థితులు, ఇప్పటి వర్తమాన పరిస్థితులు, భవిష్యత్తు సామాజిక పరిస్థితుల విశ్లేషణలు గ్రహించే శక్తి చదువుకుని ఉండడం తెలియబడుతుంది.

జీవితంలో చదువుకు ఎంత విలువ? అది జీవితాలను మార్చగలిగే శక్తిని అందించగలదు.

చదువు ఎందుకు పదిగోవులు కాసుకుంటే పాడి ఉంటుంది… గోవులు వృద్ది చెందుతాయి. ఆర్ధికాభివృద్ది ఉంటుంది… చిన్నతనం నుండి పని అలవాటు అవుతుంది. అనేవారు ఉంటారు.

అవును చిన్నతనం నుండి పనిచేయడానికి అలవాటు పడినవారు బద్దకించరు. చిన్నతనం నుండి సుకుమారంగా పెరిగినవారు, కష్టాలకు కుదేలు అయ్యే అవకాశం ఉంటుంది. కానీ కష్టపడి రూపాయిలు సంపాధించినా అవి ఖర్చు చేయడానికి కూడా నేటి రోజులలో అక్షరజ్ఙానం అవసరం ఉంది.

ఇంకా పది గోవులు కాసుకుని పాడిని వృద్ది చేసుకునే వారు చదువుకుని ఉంటే, పాడి పంటలు, పశువుల పెంపకంలో మరిన్ని విషయ పరిజ్ఙానం పెంపొందించుకోవచ్చును. ఇంకా పాడిపంటలు ద్వారా మరింత ఆర్దికాభివృద్ది సంపాదించి, మరికొంతమందికి ఉపాధి ఇవ్వవచ్చును. అంటే దీనిని బట్టి కష్టానికి చదువు తోడైతే, అది ఒక సంస్థగా మార్చుకునే శక్తి వ్యక్తి ఏర్పడగలదు. కాబట్టి చదువు మనిషికి మేలు చేస్తుంది.

ఇలా ఒక వ్యక్తి జీవితంతో చదువు యొక్క ప్రాముఖ్యత ఎంతగానో ఉంటుంది. చదువుకోని వారిని నేటి రోజులలో చూస్తుంటే, వారి సాంకేతిక పరికరాల విషయంలో ఇతరులపై ఆధారపడవలసి వస్తుంటుంది.

నేటి రోజులలో పెరిగిన డిజిటల్ చెల్లింపులు అంటే ఖర్చులు చేయడం అంటారు. అంటే ఖర్చు పెట్టాలన్న కనీస అక్షరజ్ఙానం అవసరం. ఇంకా సాంకేతిక పరికరాలలో డబ్బును కాపాడుకోవలన్నా, విద్య నేడు చాలా ముఖ్యం.

చదువు ఎందుకు అవసరం? క్రమశిక్షణతో కూడిన చదువు

శ్రద్దాసక్తులు పెరిగితే కార్యదక్షత పెరుగుతుంది. కార్యదక్షత వలన కార్యాలయములలో అధికారం లభిస్తుంది.

ఇప్పుడు అయితే స్మార్ట్ ఫోన్, ట్యాబ్ అంటూ అందరిచేతిలో సాంకేతికత సహాయంగా ఉంటే, దానిని ఉపయోగించుకోవడానికి ఎంతోకొంత చదువు ఉంటే, సాంకేతికత బాగా ఉపయోగించుకోవచ్చును.

అదే సాంకేతికతకు నాణ్యమైన చదువు ఉంటే, సాంకేతికతలో అద్భుతాలు సృష్టించవచ్చును. ఏదైనా చదువుకుని ఉండడం వలన వ్యక్తి ఉన్నతికి ఉత్తమమైన మార్గాలు ఎక్కువగా ఉంటాయి.

లోకంలో మంచిమాటలు ప్రాచుర్యంలో ఉంటాయి. అలాంటి మాటలలో ఒక్కటి.. ధనం దొంగిలించగలరు కానీ విద్యను దొంగిలించలేరని… విద్య వలన వ్యక్తికి ఉపాధి అవకాశాలు మెరుగు అవుతాయి.

వ్యక్తి చదువుకుని ఉంటే, అది అతని ఉన్నతికి మరింత ఊతం ఇచ్చినట్టే ఉంటుంది. కాబట్టి చదువు చాలా విలువైనది… కాలం చాలా చాలా విలువైనది. అలాంటి కాలాన్ని తగురీతిలో సద్వినియోగం చేసుకోవడంలో చదువు బాగా ఉపయోగపడుతుంది.

అక్షరజ్ఙానం, విషయ విజ్ఙానం జీవితానికి ఎంతో అవసరం ఉంది. ఇంకా సాంకేతికపరమైన వృత్తులు ఎక్కువగా పెరుగుతున్న నేపధ్యంలో చదువులు లేకుండా మనుగడ అసాధ్యమే.