By | October 12, 2021

కొత్త ఎప్పుడు సరికొత్త సంతోషం మనసులో కలిగిస్తే, కొత్త ఉత్సాహాన్ని అందిస్తే, అదే మనసుకు బలం అంటారు. అందుకేనోమో కొత్త బట్టలు కట్టుకున్నప్పుడు సరికొత్తగా అనిపిస్తుంది. కొత్త వస్తువు వచ్చినప్పుడు సరికొత్తగా ఉంటుంది. అందుకేనోమో మన పెద్దలు పండుగలకు కొత్త బట్టలు, కొత్త కానుకలు సిద్దం చేసేవారు.

ఏదైనా కొత్త అనేది సరికొత్తగా అనిపిస్తుంది… ఒక ఉత్సాహాన్ని అందిస్తుంది… మనసులో కొత్త ఆలోచనలు కూడా మొదలవుతాయి అంటారు.

ఒక తెలుగు సామెత లేదా జాతీయం ఉంది… కొత్త ఒక వింత పాత ఒక రోత.

అంటే కొత్త ఒక వింతగా అనిపిస్తే పాత ఒక రోతగా అనిపిస్తుందని అంటారు. పాత పరిచయస్తులు ఉన్నప్పుడు కొత్త పరిచయస్తులతో కలిసిపోతూ ఉంటుంటే అలంటి సందర్భాలలో ఇలాంటి మాటలు వాడుతూ ఉంటారు. అంటే పరిచయం అయిన కొత్తది ఒక వింత భావనను కలిగించే అవకాశం ఉంటుంది.

సరే వాడుతున్న వస్తువు స్థానంలో కొత్త వస్తువు తెచ్చుకున్నప్పుడు ఎంతో ఉత్సాహం ఉంటె, అసలు తొలిసారి కొత్త వస్తువు కొనుక్కునేటప్పుడు ఇంకెంత ఉత్సాహం ఉంటుంది?

స్మార్ట్ ఫోన్ వాడుతూ ఉండేవారు కొత్త స్మార్ట్ ఫోన్ కొనేటప్పుడు సంతోషంగా ఉంటె, మరి మొదటి స్మార్ట్ ఫోన్ కొనేటప్పుడు ఎంత ఉత్సాహంగా ఉంటారు?

ఈ ప్రశ్నలకు జవాబు ఆలోచిస్తే, కొత్త ఎప్పుడు సరికొత్త సంతోషం మనసులో కలిగిస్తుందనే భావన బలపడుతుంది.