By | January 11, 2022

కుటుంబంలో మనమనే భావన బలమవుతుంది. అలా కాకుండా మనమనే భావన కొరవడితే, అది కుటుంబంలో బంధాలను బలహీనపరుస్తుంది. కావునా కుటుంబంలో సభ్యులందరిలోనూ మనమనే ఏక భావన ఉండడం, ఆ కుటుంబానికి శ్రేయష్కరం అంటారు.

మనమనే ఐక్యతా భావన ఒక కుటుంబానికి బలమైన భావనగా చెబుతారు. కుటుంబ సభ్యులంతా కుటుంబ పెద్ద మాటకు కట్టుబడి ఉండడం వలన, సదరు కుటుంబానికి సమాజంలో ఆకుటుంబ పెద్దకు మంచి విలువ ఉంటుంది. ఇంకా ఆ కుటుంబంలో సభ్యులంతా మనమనే భావనతో ఉండడం చేతనే, ఒకరి మాటను సభ్యులంతా మన్నిస్తారని అంటారు. అంటే కుటుంబంలో మనమనే ఐక్యతా భావన కుటుంబానికి సమాజంలో మంచి గుర్తింపును సాధించగలదు.

మన అనే భావన వలన అందరికీ అది మనోధైర్యం కూడా కాగలదని అంటారు. అది ఎలా ఉంటుందంటే…. పది ఎండు కట్టెలను కలిపి కట్టిన మోపును అలానే విరిచివేయడానికి కష్టం కానీ పది ఎండు కట్టెల మోపును ఊడదీసి విడి విడిగా ఒక్కొక్క కట్టెను సులభంగా విరిచివేయవచ్చును… కాబట్టి కుటుంబంలో మన అనే భావన కుటుంబంలోని అందరికీ రక్షణగా ఉంటుంది… అదే బలమవుతుంది.

అలా కాకుండా ఎవరికివారే యమునా తీరు అన్నట్టుగా అంతా మన అనే భావనకు విలువ ఇవ్వనప్పుడు… అదే కుటుంబానికి బలహీనమవుతుంది. ప్రత్యర్ధులు చాలా సులభంగా కుటుంబంలోని వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని విజయం సాధించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది.

కాబట్టి కుటుంబంలో మన అనే ఐక్యతా భావన ఆ కుటుంబానికి మంచి బలం అగుతుంది. అలా కాకుండా ఎవరి మాటకు వారు పంతం పట్టి ఉంటే, ఆ కుటుంబ పెద్ద మాటకు ఆ కుటుంబంలోనూ విలువ ఉండదు… అదేవిధంగా సమాజంలోనూ కుటుంబ పరపతి తగ్గుతూ ఉంటుందని అంటారు.

ఇంకా కుటుంబంలో పెద్దవారిని చూసి పిల్లలు అనుసరించే స్వభావం గలిగి ఉంటారు. కావునా కుటుంబంలో అంతా ఒక మాటకు కట్టుబడి లేకపోతే, భవిష్యత్తులో పిల్లలకు కూడా స్వతంత్ర భావాలు బలంగా పెంచుకుంటారు. అయితే అవి చెడు స్వభావాలు అయితే, పిల్లల భవిష్యత్తు, కుటుంబ భవిష్యత్తు కూడా ఆగమ్యగోచరంగా మారుతుంది.

కావునా ఏదైనా ఒక కుటుంబంలో సభ్యులంతా మన అనే భావనను కలిగి ఉండాలని అంటారు. కుటుంబ పెద్ద మాటకు కట్టుబడి ఉంటూ, సమాజంలో తమ కుటుంబ పరపతి పెరగడానికి కుటుంబ సభ్యుల కృషి అవసరం అంటారు.