మహాభారతం తెలుగు పుస్తకం రీడ్ చేయడం వలన కలుగు ప్రయోజనం? తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి, అనే నానుడి చాలా ప్రసిద్ది… మినప గారెలు మనకాయమునకు బలము అయితే మహాభారతం మన మనసు జవము అంటారు.
అంటే మనం మహాభారతం రీడ్ చేయడం వలన మన మనసును మరింత శక్తివంతం చేయవచ్చనే భావన పై నానుడి వలన కలుగుతుందని చెప్పవచ్చును. కారణం మినపగారెలు రుచిగా ఉంటాయి… అవి తిని అరిగితే, వాటి మన శరీరమునకు బలము చేకూరుతుంది. అలాగే మహాభారతం కూడా మనసుకు ఆసక్తిగా ఉంటుంది… వింటే దాని వలన మన మనసుకు మరింత బలమనే భావన ఉంటుంది.
భావనలే మనసుకు బలం అయితే మనసులో సద్భావం ఉన్నప్పుడు తన చుట్టూ ఉన్నవారితో సత్ప్రవర్తన కలిగి ఉంటుంది. అదే మనసు చికాకుగా ఉంటే, ఆ వ్యక్తి చుట్టూ ఉన్నవారితో ప్రవర్తన కూడా చికాకుగానే ఉంటుంది. కాబట్టి మనసుకు భావనలు బలం అయితే మంచి ఆలోచనలు ద్వారా సద్భావన పెరగడానికి మహాభారతం దోహదం చేయగలదని పెద్దలు చెబుతూ ఉంటారు.
మహాభారతం మనసులో ఆసక్తి పెరుగుతుంది
మహాభారతం తెలుగు పుస్తకం రీడ్ చేయడం కలుగు ప్రయోజనం ముందు మనసులో ఆసక్తి పెరుగుతుంది. మరే ఇతర గ్రంధం అయినా ఆసక్తి అందరికీ ఏర్పడుతుందా లేదో తెలియదు కానీ మహాభారతం అంటే అందరికీ సులభంగా ఆసక్తిని కలిగిస్తుందని పెద్దలు అంటారు. ఇంకా ఆసక్తిచేత మహాభారతం పుస్తకం రీడ్ చేయడం జరిగితే, అందులోని వివిధ పాత్రలు వివిధ సందేశాలను అంతర్లీనంగా కలిగి ఉంటాయని, వాటిని అర్ధం చేసుకోవడం వలన వ్యక్తికి ప్రయోజనం చేకూరుతుందని పెద్దలు అభిప్రాయపడుతూ ఉంటారు.
కేవలం పాండవులు – కౌరవుల చర్రిత కాకుండా వారి పూర్వికులు, వారి వారి పూర్వికుల గురించి మహాభారతంలో చెప్పబడుతుంది. ఇంకా కర్మప్రభావం వలన వ్యక్తి అయినా దేవత అయినా ఎలా కాలానికి కట్టుబడి ఉంటారో మహాభారతంలో తెలియజేయబడుతుందని అంటారు.
ధర్మము, ధర్మమును ఆచరించుట వలన కలుగు ప్రయోజనములు, మనసు, మనసుయొక్క లీలలు మహాభారతంలోని వివిధ పాత్రల ద్వారా తెలియజేయబడుతుందని అంటారు.
ఇక్కట్లు కలిగినప్పుడు మనిషికి బలం అయినవారి అనురాగం అయితే, మహాభారతం కూడా ఒక మంచి స్నేహితుని వలె అనిపిస్తుందని అభిప్రాయపడుతూ ఉంటారు.
అందుకే తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలని పెద్దలు చెబుతూ ఉంటారని అంటారు.