By | December 12, 2021

మన చుట్టూ మనకో మార్గదర్శకుడు ఉంటారు. ఈ వ్యాక్యం ఆధారంగా ఒక వ్యాసం వ్రాయాలంటే, మన చుట్టూ ఉండే పరిస్థితుల గురించి మనకో అవగాహన ఉండాలి. మన చుట్టూ ఉండే పరిస్థితులలో, ఆ పరిస్థితులను ప్రభావితం చేసేవారు ఎవరెవరు ఉన్నారో తెలిసి ఉండాలి. ఇంకా ఎవరెవరు ఎటువంటి ప్రభావం చూపుతున్నారో తెలియబడి ఉండాలి. ఇలా మన చుట్టూ ఉన్న స్థితి మనకు అవగాహన ఉంటే, మన చుట్టూ మనకో మార్గదర్శకుడు కనబడతారు.

ఒక వ్యక్తి చుట్టూ ఒక అనేక పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అనేకమంది వ్యక్తుల ప్రభావం ఒక వ్యక్తిపై పడుతూ ఉంటుంది. చాలామంది మాటలు ఒక వ్యక్తి మనసులో మెదులుతూ ఉంటాయి.

సాదారణ జనులలో మార్గదర్శకుడు

ఎప్పుడైనా ఎక్కడైనా ఒక ప్రాంతంలోనైనా ఒక ప్రదేశంలోనైనా సాదారణ జనులు ఉంటారు. చెడు ప్రవర్తన కలిగినవారుంటారు. ఇంకా సత్ప్రవర్తన కలిగినవారుంటారు. అలాగే విద్యార్ధులు ఉంటారు. విద్యార్ధులు అంటే అభ్యసిస్తూ, గమనిస్తూ, పరిశీలనలో అనేక విషయాలలో విజ్ఙాననమును సముపార్జించుకుంటారు. అలా గమనించే విద్యార్ధుల దృష్టిలో ఎటువంటివారు ఎక్కువగా మెదులుతూ ఉంటారో, అటువంటి ఆలోచనలే విద్యార్ధుల మదిలో మెదులుతూ ఉంటారు.

సాదారణ జనులకు ఉండే లక్ష్యాలు కుటుంబ లక్ష్యాలే ఉంటాయి. తమ తమ కుటుంబం బాగుకోసం పాటుపడేవారు ఉంటారు.

ఇంకా సమాజంలో మంచి స్థితిని పొందినవారుంటారు. వారు ధనం వలన కానీ అధికారం వలన కానీ మంచి గుర్తింపు పొంది ఉంటారు. వారిని చూడడం వలన కలిగే ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి. అంటే ఒక ధనవంతుడిని చూస్తే, ధనం ఉండడం వలన సమాజంలో ఎటువంటి స్థితి? ఉంటుందో తెలియబడుతుంది. అలాగే ఒక అధికారిని గమనిస్తే, ప్రభుత్వ అధికారం ఉంటే, సమాజంలో ఎటువంటి గుర్తింపు ఉంటుందో తెలియబడుతుంది. ఇలా సమాజంలో వ్యక్తికి ఏదో స్థితిని పొంది ఉంటారు.

దేశంలో ఒక కాలంలో ఒకరే ప్రధాని ఉంటారు. అలాగే ఒక రాష్ట్రములో ఒక కాలంలో ముఖ్యమంత్రిగా ఒకరే ఉంటారు. ఇలా పెద్ద పెద్ద స్థాయి కలిగినవారిని మార్గదర్శకంగా పెట్టుకుంటే అదే అసాధ్యంగానే అనిపిస్తుంది. అయితే క్రమశిక్షణతో తోటివారిలో ముందు మంచి గుర్తింపు పొందడం వలన జీవితంలో ఉత్తమ స్థానానికి వెళ్ళవచ్చును.

సాధ్యమయ్యే లక్ష్యాలలో మన చుట్టూ మనకో మార్గదర్శకుడు ఉంటారు.

క్రమశిక్షణ కొరకు అయితే మనతో ఉండే సహవాసంలో కనబడవచ్చును.

ఆచారంలో మన ఇంటి పెద్దలలో కనబడవచ్చును.

చదువులో మన తోటివారిలో కనబడవచ్చును.

వినయం అంటే మన చుట్టూ మంచివానిగా గుర్తింపు పొందినవారిలో చూడవచ్చును.

ఇలా రకరకాల విషయాలలో మన చుట్టూ మనకు మార్గదర్శకుడు కనబడతారు.

మన చుట్టూనే ఉండేవారిలోనే మనకొక మార్గదర్శకుడుని ఎంచుకుంటే

ముందుగా నరేంద్రమోదీగారినే మనం ఒక మార్గదర్శకులుగా పెట్టుకుంటే, ఆయన అనుభవాలు తెలుసుకోవాలనే తాపత్రయం మొదలు అవుతుంది. అప్పుడు నరేంద్రమోదీగారినే అడిగి తెలుసుకోవాలంటే, ఆయనను కలవడం అందరికీ సాద్యం కాదు.

అదే మన చుట్టూనే ఉండేవారిలో మంచి గుణములు కలిగి ఉన్నారనే కీర్తి కలిగినవారినే మార్గదర్శకంగా భావిస్తే, మనకు అందుబాటులోనే ఉంటారు…. కాబట్టి పరిచయస్తుల ద్వారా మనం మనము ఎంచుకున్న మార్గదర్శకులను కలిసి మాట్లాడవచ్చును. అనేక విషయాలు తెలుసుకోవచ్చును. ఇంకా పెద్ద విషయం ఏమిటంటే, ఇద్దరూ ఒకే ప్రాంతం వారు కావడం వలన సామాజిక పరమైన అనుభవసారం కూడా తెలియబడుతుంది.

అందుకే తాత్కాలికంగా మన చుట్టూ మనకో మార్గదర్శకుడు ఉండాలని అంటారు.