By | November 6, 2021

మంచి చెడులను ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఎందుకు చర్చించండి? ముందుగా ఇది అందరికీ ఉపయోగపడే ప్రశ్న. అన్ని అంశములలోనూ మంచి చెడుల గురించి సరైన రీతిలో ఆలోచన చేయాలి. లేకపోతే నష్టం ఎక్కువగా ఉంటుంది.

ఒక మంచి స్నేహితుడు మంచే చెబుతూ ఉంటాడు. కానీ ఆలోచించకుండా త్వరపడి చెడు అభిప్రాయానికి వస్తే, మంచి స్నేహితుడు దూరం అయ్యే అవకాశాలు ఉంటాయి.

బంధువు గురించి చెడు అభిప్రాయం ఏర్పరచుకుంటే, ఆ బంధం అట్టేకాలం కొనసాగదు.

సహచరుల విషయంలో చెడు అభిప్రాయానికి వస్తే, సహచరులతో మనగలగడం గగనం అవుతుంది. ఇలా ఏ బంధంలోనైనా మంచి చెడులు యోచించకుండా నిర్ణయాలు తీసుకుంటే, జీవితంలో నష్టం ఎక్కువగా ఉంటుందంటారు.

మాములుగానే కొంతమంది ఒక విషయం చెబుతూ ఉంటారు. అదేమిటంటే ‘మంచి చెప్పేవారి కంటే, చెడు విషయాలను చేరవేసేవారు ఉంటారని’ అంటారు. ఇక మంచి చెడుల విచారణ లేకపోతే మనిషి చుట్టూ చెడు విషయాలు మేటవేసుకుంటాయి.

ఒక వ్యక్తి ఒక నిర్ణయం తీసుకుంటున్నాడంటే, ఆ నిర్ణయం తీసుకున్న వ్యక్తి చుట్టూ ఉన్న సమాజం అతని నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇక నిర్ణయం గురించి విమర్శిస్తూ ఉంటుంది. ఇంకా తీసుకున్న నిర్ణయం గురించి విచారణ చేస్తుంది. అంటే నిర్ణయం తీసుకున్న వ్యక్తి యొక్క ఆలోచనా తీరు తన చుట్టూ ఉన్న సమాజానికి నిర్ణయం ద్వారా తెలియపరచడం జరుగుతూ ఉంటుంది. లోకం దృష్టితో చూసినప్పుడు మాత్రం ఎప్పుడూ మంచి నిర్ణయాలకే ప్రధాన్యతను ఇవ్వడం వలన లోకంలో విలువ పెరుగుతుంది.

మంచి మాములుగా ఉంటే, చెడు చెలరేగిపోతుందట.

సమాజంలో మంచి సైకిలు వేగంతో ప్రయాణం చేస్తే, చెడు రైలు వేగంతో ప్రయాణం చేస్తుందని అంటారు. అంటే ఒక వ్యక్తి చుట్టూ చెడు చేరినంత వేగంగా మంచి విషయాలు చేరవు. స్వయంగా మంచి విషయాలపై ఆసక్తి చూపితేనే మంచిని ప్రబోదించే పండితులు ఉంటారని అంటారు.

మంచి చెడులను ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఎందుకు చర్చించండి

చెడు విషయాల గురించి ఆసక్తి లేకపోయినా అవి కంటికి కానవస్తూనే ఉంటాయి. చెడు విషయాల గురించి వినడానికి ఆలోచించకపోయినా వీనులకు వినబడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ మంచిని మాత్రం ఆసక్తి చూపిన చోటే పెంచగలం అంటారు.

వ్యసనాలకు బానిస కాకుడదు అని ప్రబోదించడంలోనే వ్యసనం అంటే ఏమిటో తెలుసుకోవాలన్న ఆసక్తి పెరిగితే చాలు చెడు విషయాలు మనిషి చుట్టూ అల్లుకుపోతూ ఉంటాయి. అదే మంచి విషయాలు ఏమిటి ఆని చూస్తే, అవి మనిషి మనసులో మరుగునపడి ఉంటాయి.

కాబట్టి మంచి చెడులను ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని అంటారు.

నిర్ణయం వ్యక్తి నిబద్దతను తెలియజేస్తుంది. నిర్ణయం వ్యక్తి స్వభావాన్ని ప్రస్ఫుటం చేస్తుంది. నిర్ణయం వ్యక్తి యోగ్యతను తెలియజేస్తుంది. నిర్ణయం వ్యక్తి జీవితాన్నే మార్చేయగలదు. అటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పడు తొందరపాటు పనికిరాదని అంటారు.

మంచి చెడులు విచారించకుండా నిర్ణయాలు తీసుకుంటే, జీవితం తలక్రిందులు అవుతుంది. మిత్రులు దూరం అయ్యే అవకాశం ఉండవచ్చును. కొలువు కోల్పోయే అవకాశం ఏర్పడవచ్చును. బంధం దూరం అయ్యే అవకాశం ఏర్పడవచ్చును. నిర్భంధించబడే స్థితి ఏర్పడవచ్చును. ఇలానిర్ణయం వ్యక్తి జీవితంపై విశేషమైన ప్రభావం చూపగలదు కాబట్టి మంచి చెడులను ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.