By | July 6, 2021

నేను నిత్య విధ్యార్ధిని భావన వ్యక్తిని ఉన్నత శిఖరం వైపుకు నడిపిస్తుంది. నేర్చుకునే ఆసక్తి ఉన్నంత కాలం, మనసు నిత్యం విషయసారం గ్రహిస్తూనే ఉంటుంది.

తెలుసుకోవడం విధ్య అయితే, నేను నిరంతరం నిత్య విధ్యార్ధిని అనే భావన, నిరంతరం ఏదో ఒక విషయం తెలుసుకునేలాగా మనసును ప్రేరేపిస్తుంది.

నాకు అంతా తెలుసు అనే భావన, అలసత్వానికి నాంది అవుతుంది. రాను రాను తెలుసు అనే భావన తెలిసిన విషయాలను మరిపించే అవకాశం కూడా ఉండవచ్చు.

విధ్యార్ధికి విద్యాలయంలో విధ్య నేర్పించబడుతూ ఉంటే, అందరికీ సమాజం కూడా ఒక పాఠశాల మాదిరిగా ఉంటుంది.

బడిలో తపన ఉన్న విధ్యార్ధి ఉత్తమ ఫలితాలను తెచ్చుకుంటూ ఉంటే, ఆసక్తి కనబరచని విధ్యార్ధి అధమ ఫలితాలను పొందుతూ ఉంటాడు. తపనకు శ్రద్ద తోడైతే, శ్రద్దకు సరైన బోధన అందితే, ఆ తపన మనిషిని ఉన్నత శిఖరం వరకు తీసుకువెళుతుంది.

ఒక స్కూల్ వలె సమాజం కూడా అందరికీ ఒక పాఠశాల వంటిదే అంటారు.

నిత్యం సమాజంలో అనేకానేక విషయాలు మనిషి చుట్టూ ఉంటాయి. అనేక సమస్యలు మనిషికి వస్తూ ఉంటాయి. అనేక సమస్యలు పరిస్కారం అవుతాయి. ప్రతి పరిస్కారం ఏదో ఒక పాఠం మిగిలుస్తుంది.

ఏదో నేర్చుకోవాలనే బలమైన భావనకు ప్రేరణ నేను నిత్య విధ్యార్ధిని అనే భావన!

సమాజంలో ఒక ప్రత్యేక గుర్తింపు పొందిన గొప్పవారు సైతం, ఇంకా ఏదో నేర్చుకోవాలనే బలమైన భావనతో ఉంటారు. వారికి నేర్చుకోవడంలోనే తృప్తి ఉంటుందేమో….

ఏదైనా అలవాటు ఉన్న మనసు, ఆ అలవాటువైపే చూస్తూ, మనిషిని ఆ అలవాటు దగ్గరికి తీసుకుపోతూ ఉంటుంది… అలా నేర్చుకోవడం ఒక అలవాటుగా మారితే, మరి వారి మనసు ఏదో కొత్త విషయం తెలుసుకునే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది.

‘‘జీవితంలో చాలా ఎత్తు పల్లాలు చూశారు. మీరు చూడని సక్సెస్‌ అంటూ లేదు.. ఇంకా ఏదో నేర్చుకోవాలనే తపన మీకెందుకు.?’’ అని మెగాస్టార్‌ చిరంజీవిని ప్రశ్నిస్తే, ‘నేనింకా నేర్చుకోవాల్సింది చాలా వుంది.

—చిరంజీవి

అమ్మ ఒడిలో ఆరంభం అయ్యే విధ్య, విద్యాలయంలో కొనసాగి, సమాజంలో ఒక గుర్తింపుగా మారుతుంది. అలా గుర్తింపు పొందిన వ్యక్తికి జీవితం ఏదో ఒక పాఠం చెప్పే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది.

సత్యం కోసం తపనపడే మనసు, అబద్దాన్ని ఛేదించేవరకు సాధన చేస్తూనే ఉంటుంది. నిత్య సత్యం చుట్టూ అబద్దం అల్లుకుంటూనే ఉంటే, సత్యాన్వేషణ చేసేవారికి, అబద్దం నిత్యం, ఏదో ఒక పాఠం అందిస్తూనే ఉంటుంది.

లోకం మనిషికి కొత్త అనుభవం అందిస్తూనే ఉంటుంది. కాలంతో బాటు లోకం తీరు మారుతుంది… లోకం తీరు గమనించేవారు, లోకాన్ని అనుసరించడం ద్వారా తమనుతాము అభ్యాసకులుగా మార్చుకుంటారు.

వినేవారు ఉండాలే కానీ చెప్పేవారికి కొదువలేదు… ఆసక్తి ఉంటే అశక్తతో ఉన్నా సరే ఓపికతో వినినిపించేవారు ఉంటారు. వారికి చెప్పడంలో ఉండే తృప్తి, వినేవారికి వరంగా మారుతుంది.

తన చుట్టూ ఉన్న పరిసరాలు, వ్యక్తులను పరిశీలిస్తే ప్రతిదినం ప్రతిఘడియ నూతన అనుభవం ఎదురయ్యే అవకాశం ఉంటుంది అంటారు. ఇలా మనిషి నిత్య విధ్యార్ధిగా ఉండే అవకాశాలు ఎక్కువ.

నేను నిత్య విధ్యార్ధిని భావన వ్యక్తిని ఉన్నత శిఖరం వైపుకు నడిపిస్తుంది.
నేను నిత్య విధ్యార్ధిని భావన వ్యక్తిని ఉన్నత శిఖరం వైపుకు నడిపిస్తుంది.

జీవితంలో ప్రతిరోజు, ప్రతిక్షణం పరిశీలన దృష్టి ఉంటే, ఒక కొత్త పాఠం నేర్చుకోవడమే అవుతుంది.

పుట్టిన వ్యక్తి పెరుగుతూ, తన జీవన కాలంలో ఎన్నో పాత్రల పోషిస్తూ ఉంటారు. ప్రతి పాత్రకు ఎదురయ్యే అనుభవాలు, కొత్త పాఠాన్ని నేర్పుతూ ఉంటాయి.

విశాఖలో ఎయు సైన్సు కళాశాల దినోత్సవంలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ తాను అనునిత్యం విద్యార్థిగా వివిధ అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తానని అన్నారు

—చంద్రబాబు నాయుడు

నేను నిత్య విధ్యార్ధిని అను భావనకు సాధన తోడైతే నిత్య సమాజమే ఒక పాఠశాల

అభ్యాసం ఎప్పుడూ ఒక కొత్త విషయాన్ని వెలుగులోకి తెస్తుంది. విధ్యార్ధి దశలో పాఠాలపై ఆసక్తి ఉంటే, ఉద్యోగంలో పనితీరు మెరుగుపరచుకోవడంలో అభ్యాసం, కొత్త విషయాలు తెలుసుకునేలాగా ప్రేరణ అవుతుంది.

ఒక ఉద్యోగికి తను పనిచేసే చోట అన్ని విషయాలు తెలిసే అవకాశం తక్కువ. కొత్తలో తెలిసిన విషయాలతో పని ప్రారంభం అయితే, తరువాత తెలియని విషయాలు తెలిసే అవకాశం ఉంటుంది. తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటే, అది అభ్యాసం వైపు మరలుతుంది.

తెలిసిన విషయాలు తెలియనివారికి తెలియజేస్తూ, తెలియని విషయాలు తెలుసుకోవడం అనేది కార్యాలయాలలో జరుగుతూ ఉంటుంది.

ఎదిగే పిల్లలకు ఇంట్లో అమ్మా, నాన్న, అక్క, అన్నయ్య… అందరూ అధ్యాపకులే అవుతారు…

ఒక్కోసారి చిన్నవారే పెద్దవారికే తెలిసిన విషయంలో సూచనలు అందిస్తూ ఉంటారు. ఎక్కువమంది ఉండే ఉమ్మడి కుటుంబంలో ఎన్నో విషయాలు తెలియబడుతూ ఉంటాయి.

నిత్య విధ్యార్ధికి ఇంటి నుండి బడి నుండి సమాజం…. పాఠశాలగానే కనబడితే, అను నిత్యం అభ్యాసమే….